మెయన్ ఫీచర్

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఐసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ భారతంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలు బాగా విస్తరించాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబయి నగరాలకు భద్రత లేకుండా పోతున్నది. అనంతపురానికి ఐసిస్ భూతం చేరింది. దేశంలో హై ఎలర్ట్ ప్రకటించారు. కేజ్రీవాల్, కెసిఆర్, సిద్దరామయ్య వంటి ముఖ్యమంత్రులకు ఇది పరీక్షా సమయం.
మహారాష్టల్రోని నాందేడ్ నుండి హైదరాబాద్‌కు చెందిన ఐసిస్ ఉగ్రవాదులు ఆయుధాలు కొనుగోలు చేశారు. ఈ విషయం నిర్ధారణ అయింది. హబీబ్ ఇబ్రహీం అనే ఉగ్రవాది ఎన్‌ఐఎ అనే దర్యాప్తు సంస్థకు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొత్తగా సోదాలు జరిగాయి. రెండు స్కానర్లు, రెండు కంప్యూటర్లు, 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అబూ అద్మాన్ ఐసిస్ ముఖ్య నిర్వాహకుడు. అతనితో తాలాబ్‌కట్ట వద్ద ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు ఆన్‌లైన్‌లో విధ్వంసానికి కావలసిన సూచనలు అందుకున్నారు. విధ్వంసకోసం గత నాలుగు నెలలుగా పథకం రూపొందించినట్టు చెప్పారు. వీరికి భారీగా నైట్రేట్ డిటొనేటర్లు ఎవరు సరఫరా చేశారు? అనేకోణంలో ఎన్‌ఐఎ డిజి సంజీవ్‌కుమార్ పరిశోధించారు. రహ్మాన్ రిజ్వాన్ తన పేరును అబూ హసన్‌గా మార్చుకున్నాడు. ఇబ్రహీం పేరు ఈ అబ్దుల్ రహమాన్‌గా మార్చుకున్నాడు. హబీబ్ పేరును అబు షీబా గాను, పహద్ పేరును అలీమా గాను ఐసిస్ అధినాయకత్వం మార్చింది. ఏకకాలంలో పలు ప్రాం తాల్లో విధ్వంసం సృష్టించాలని, హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులను చేయాలని కుట్ర పన్నారు. దీనివల్ల వారు సాధించే ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తే, రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలహీన పడతాయని వ్యూహరచన చేశారు. ఇంత జరుగుతున్నా ఈ దుర్మార్గానికి వాసిమ్ పఠాన్, జాన్ దయాల్ వంటి వారు టీవీల్లో బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతినిస్తూ మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అంతేకాదు సివిల్ సొసైటీ అనే ఇస్లామిక్ సంస్థ సభ్యులు ‘‘మా పిల్లలు అమాయకులు. వారు ఏ నేరం చేయలేదు’’ అని జూలై 5న పత్రికలవారికి చెప్పారు. కావాలని నిష్కారణంగా కేంద్ర ప్రభుత్వం తమ బిడ్డల్ని వేధిస్తున్నదని ఆరోపించారు.
దారుల్ సలాంలో ఇత్తెహాదుల్ మజ్లిస్ కేంద్రకార్యాలయం ఉంది. ఇక్కడినుండి ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతున్నది. న్యాయ సహాయం కూడా అందిస్తామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించాడు. ఇదంతా దేన్ని తెలియజేస్తున్నది? బంగ్లాదేశ్‌లోని రెస్టారెంట్‌పై జరిగిన విధ్వంసానికి పాక్ మూలాలున్నాయని, బంగ్లా ప్రధాని షేక్ హసీనా ప్రకటించింది. తెలంగాణలో కొత్త జిల్లాల నిర్మాణం, హైకోర్టు విభజన వంటి సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతుండడం వల్ల ప్రజల దృష్టి ఉగ్రవాద సమస్య నుండి మళ్లింది. దీన్ని ఐసిస్ సద్వినియోగం చేసుకోవాలని చూసింది.
అలాగే ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్ తన రాజకీయాధికారాన్ని నిలుపుకోవాలన్న తపనతో, ఉగ్రవాద చర్యలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. కైరానాలో జరుగుతున్న విధ్వంసానికి అఖిలేశ్ యాదవ్ సమాధానం చెప్పలేదు. ఇక్కడినుండి వందలాది హిందూ కుటుంబాలు కట్టుబట్టలతో కాందిశీకులై వెళ్లిపోయారు. అంటే హైదరాబాద్ పాతబస్తీ ఉగ్రవాద చర్యల వల్ల అక్కడి హిందువులు భయభ్రాంతులై వెళ్లిపోతే దాన్ని మరొక కాశ్మీర్‌లోయగా, పూర్తి ముస్లిం మెజారిటీ ప్రాంతంగా మార్చాలనే వ్యూహం కనిపిస్తోంది. భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించండి అని ఐసిస్ కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన సందేశం వెలువడిన విషయాన్ని మనం ఇంగ్లీషు ఛానళ్లలో చూశాం.
క్రీ.శ. 1323 నుంచి, 1948 వరకు అవిచ్ఛిన్నంగా ఏడువందల సంవత్సరాల పాటు ఇక్కడ ఇస్లామిక్ పాలన సాగింది. స్వాతంత్య్రానంతరం కాశిం రజ్వీతో పాటు ప్రముఖ రజాకార్లు పాకిస్తాన్ వెళ్లిపోయారు. కాని వారి అనుయాయులు ఇత్తెహాదుల్ మజ్లీస్ సంస్థను పునరుద్ధరించారు. వీరి మద్దతుతోనే కాంగ్రెస్, ఇప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. తెలంగాణలో భాజపా బలపడటం వీరెవరికీ ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే ఐసిస్ అనే నరహంతక ఉగ్రవాద సంస్థ వ్యాప్తిని అర్థం చేసుకోవలసి ఉంది. భారతీయులకు కాశీ ఎటువంటిదో, ముస్లింలకు మక్కా మదీనాలు అటువంటివి. మరి సౌదీ అరేబియాలోని మదీనాలో రంజాన్ ఉపవాస దినాల్లో ఐసిస్ ఎందుకు బాంబులను పేల్చి ముస్లింలను చంపినట్టు?
తెలంగాణలో చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను గద్దె దించడంకోసం కాంగ్రెస్‌లోని ఒక వర్గం మతకల్లోలాలను సృష్టించడం తెలిసిందే. ఇప్పుడీ మతభూతం ఐసిస్ రూపం దాల్చి పాతబస్తీ నుంచి తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఐసిస్‌లో చేరడానికి వెళుతున్నవారిని లోగడ శంషాబాద్ విమానాశ్రయం వద్ద పట్టుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. వారంతా నిరుద్యోగులు. అందుకని ఐసిస్‌లో చేరి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటున్నారని షబనమ్‌లోనీ ప్రకటించింది. ఈమె కశ్మీర్‌కు చెందిన లాయరు. ప్రొఫెసర్ కోదండరామ్ ఒకవైపు మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల వద్ద ఉద్యమాలు చేయిస్తుంటే, హైదరాబాద్ నడిబొడ్డులో అసదుద్దీన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఏం చేయాలో తెలియక తెలంగాణ ప్రభుత్వం అయోమయంలో పడింది.
అనంతపురంలోని నందిని లాడ్జ్‌లో ఎన్‌ఐఎ దర్యాప్తుసంస్థ సోదాలు నిర్వహించి జూలై 6న కీలక సమాచారాన్ని సేకరించింది. అంటే ఈ ఉగ్రభూతం హైదరాబాద్ నుండి రాయలసీమ వరకు వ్యాపించిందని అర్థం. దీన్ని గురించి పాలకులు ఎందుకు మాట్లాడటం లేదు. అసదుద్దీన్ ఒవైసీని, జకీర్ నాయక్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అదుపుచేయలేకపోయాయి? అంటే ఓటు బ్యాంకు రాజకీయం వల్ల. తీగ లాగితే డొంక కదిలిందన్నది సామెత, చర్లపల్లి జైలులో ఉగ్రవాదులను ప్రశ్నిస్తే అనంతపురంపై దాడి చేయాలనుకున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీమ్ అనంతపురం సందర్శించి తన అనుయాయులతో రెక్కీ నిర్వహించినట్టు, దాడులు చేయాల్సిన టార్గెట్లను నిర్ణయించుకున్నట్టు ఎన్‌ఐఎ నిర్ధారించింది. లాడ్జిలో ఇబ్ర హీమ్ డబుల్ రూమ్ తీసుకున్నాడు. రిజిస్టర్‌లో తన పేరు రిజ్వాన్ అని రాశాడు. ఉదయం నగరంలోకి వెళ్లినవాడు రాత్రి పదిగంటలకు తిరిగి లాడ్జ్‌కి వచ్చి వెంటనే గది ఖాళీ చేశాడు. కేసు విచారణలోఅనంతపురం పోలీసులు, లాడ్జ్ పరివారం ఎన్‌ఐఎకి సహకరించారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం బూటకపు ప్రజాస్వామ్యం ఉంది. ఆ కారణం చేత రెస్టారెంట్‌పై దాడి చేశాం. ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమే ఇంకా తీవ్రమైన దాడులు జరుగబోతున్నాయి..అంటూ సిరియాలోని రెక్కా నగరం నుండి బంగ్లా భాషలోనే ఒక వీడియో విడుదలైంది. సరీగ్గా అట్లాగే జరిగింది. రంజాన్ పండుగనాడు కిషన్ గంజ్‌లోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న వారిపై బాంబులు వేశారు. ఫలితంగా పోలీసులు చనిపోయారు. జైలులో ఉన్న తమ ఉగ్రవాద నాయకుడిని విడుదల చేయాలంటూ వారు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనాను బెదిరిస్తున్నారు. ఇక లష్కరే తొయ్యబా అధినేత హఫీజ్ సరుూద్‌ను కూడా చంపేస్తామని ఐసిసి ప్రకటించింది. కశ్మీరు విమోచన విషయంలో ఇతడికి పట్టుదల లేదని ఐసిస్ ప్రకటించింది.
హైదరాబాద్‌లోని ఉగ్రవాద కార్యకర్తలు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రభావితమయ్యారు. ఢాకాలోని వరుస దాడులకు కారణమైన ఉగ్రవాదులు కూడా జకీర్ నాయక్‌ను గురువుగా భావిస్తున్నారు. జకీర్ నాయక్‌పై బ్రిటన్, అమెరికాలు నిషేధం విధించాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ఈయనకు ఎక్కడెక్కడినుండి నిధులు అందుతున్నాయనేదానిపై విచారణ జరుపుతోంది. ఇలాంటి వ్యక్తిని దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకులు బలపరచడం దారుణం. జకీర్ నాయక్‌ను కౌగలించుకుంటూ ‘మీ ఓట్లు మాకు వేయండి’ అని దిగ్విజయ్ సింగ్ అడుగుతున్న వీడియోను మొన్న ఇంగ్లీష్ ఛానెల్ ప్రసారం చేసింది. హిందూ ధర్మంలో ఉన్నట్టుగానే ఇస్లాంలో కూడా 72 శాఖాభేదాలున్నాయి. మరి వీరందరిని హిందువులు ఆదరించారు. అదే హిందువుల్లోని సహనశీలత.
జకీర్ నాయక్ ఒకపెద్ద ఉగ్రవాద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ముంబయి ప్రధాన కేంద్రంగా 120 దేశాల్లో తన ‘‘శాంతి ధామం’’ శాఖలను ఏర్పాటు చేశాడు. ‘పీస్ టివి’ ద్వారా ప్రచారాలు నిర్వహిస్తున్నాడు. ఆయన ఆస్తి కోట్ల మిలియన్ డాలర్లలో ఉంది. లండన్ అండర్ గ్రౌండ్ రైల్వేపై జరిగిన దాడుల సందర్భంగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌పై ఐసిస్ ఉగ్రవాదులు జరుపబోయే దాడులను ఈయన బహిరంగంగా సమర్థిస్తున్నాడు. బంగ్లాదేశ్ రెస్టారెంట్‌పై మొన్న జరిగిన దాడుల సూత్రధారుల్లో జకీర్ నాయక్ పేరు కూడా ఉన్నది. ఇదీ నాయక్ గారి ‘ఆధ్యాత్మిక’ సామ్రాజ్యం. దీన్ని బహిరంగంగా ముఫ్తి మహమ్మద్ సరుూద్, ఒవైసీ, దిగ్విజయ్ సింగ్ వంటివారు బలపరుస్తున్నారు. తస్లీమ్ రహమాన్ వంటివారు ‘జకీర్ శాంతి దూత-మేము ఆయన శిష్యులం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం’ అని ఒక ప్రముఖ ఇంగ్లీషు టివి ఛానర్‌లో రంజాన్ నాడు ప్రకటించారు. 2012లో దారుల్ ఉలుం ఇతనికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది.
వౌలానా ఫిరీగీ మెహదీ వంటి స్థానిక మత ఛాందసవాదులు జకీర్ నాయక్‌ను బలపరుస్తున్నారు. ‘‘మతం మత్తుమందు’’అని ప్రచారం చేసిన ఈ మహా పురుషులు జకీర్ నాయక్ దుశ్చర్యలను ఎందుకు ఖండించలేదు? ఇండియన్ ముజాహిద్దీన్ వంటి సంస్థలతో జకీర్ నాయక్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జకీర్ నాయక్‌ను ఓటుబ్యాంకుగా వాడుకున్నారు. ఇతనిని ఆధ్యాత్మిక గురువుగా కీర్తించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజూ న్యూఢిల్లీలో మాట్లాడుతూ జకీర్ నాయక్ సంస్థపై ఏం చర్య తీసుకోవాలో ఆలోచించి నిర్ణయిస్తాం. ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. జకీర్ సంస్థను తక్షణమే నిషేధించాలని, శివసేన డిమాండ్ చేసింది. జకీర్ నాయక్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందినవాడు ఒకడు ఢాకా హోటల్‌పై దాడి జరిపిన వారిలో ఉన్నాడని బంగ్లా ప్రభుత్వం నిర్ధారించింది.
‘‘ప్రతి ముస్లిం ఒక ఉగ్రవాదిగా సూసైడ్ బాంబర్ గా మారాలి’’ - అని నేను అనిన మాట నిజమే కాని ఆ సందర్భం వేరు. అని జకీర్ నాయక్ ఒప్పుకున్నాడు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల వార్త. హైదరాబాదులో సంతోష్ నగర్‌లో ఉన్న ఈడీ బజార్‌లో నిన్న నిజా ముద్దీన్ అని మరొక ఉగ్రవాద సానుభూతి పరుణ్ణి ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. పోలీసు కస్టడీలో అతనుంచి సమాచారం సేకరిస్తుంది. ఇప్పటి వరకు 23మంది ఉగ్రవాదులు హైదరా బాదునుండి సిరియా చేరారు. భారతదేశం అరెస్టు చేయబడిన వారి సంఖ్య అరవై. ఉత్తర ప్రదేశ్ , మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటక కేరళ రాష్ట్రాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయ. ముంబాయ, హైదరాబాదు బెంగుళూరు నగరాలను వాళ్లు టార్గెట్‌గా చేసుకొన్నారు. ఇపుడు ఢిల్లీలో ఇం ద్రుడు, మన గల్లీలో చంద్రుడు ఏం జాగ్రత్తలు తీసుకొంటాఠో చూడాలి.

- ముదిగొండ శివ ప్రసాద్