మెయిన్ ఫీచర్

బాబా నిద్రా నియమం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా ఒక్కోసారి ఆహార పదార్థాలను శిష్యులను రుచి చూడమని చెప్పి వారిని ఈ విషయంలో పరీక్షించేవారు. బాబా చేతివంట, బాబా స్వయంగా వడ్డించగా తిన్నవారు ధన్యులు. బాబా వంట పాత్రలోని ప్రతి మెతుకు తిన్నవారికి ఎంతో సత్తువను కలుగజేసేది. అది రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారం. మహాప్రసాదం. అది సదా శుభదాయకమైనది. పవిత్రమైనది.
***
జీవితంలో ఏదీ పొందనివ్వకుండా, లక్ష్యశుద్ధి లేకుండా, జీవితకాలాన్ని వ్యర్థం చేసేది నిద్ర. మనిషి దానికి బానిస కాకూడదు. అతిగా నిద్రపోవటం, అసలు నిద్రలేక పోవటం... ఇవి రెండూ జబ్బులే. సాయితత్వంలో నిద్రా నియమానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సర్వజీవులకు నిద్ర సాధారణ ధర్మం. కొందరికి మొద్దునిద్ర. ఇంకొందరిది మాగన్ను. మరికొందరిది కలత నిద్ర. చాలామందికి ‘సరిగా పట్టని’ నిద్ర. మొత్తానికి అతి నిద్ర పనికి చేటు. ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించాలన్నా, జీవితంలో లౌకిక లాభాలు పొందాలన్నా అటు యోగసాధకులకు, ఇటు కార్యసాధకులకు నిద్ర బద్ధ శత్రువు.
మసీదులో నాలుగు మూరల పొడవు, జానెడు వెడల్పు గల కొయ్యబల్ల ఉండేది. బాబా చింకి గుడ్డల్ని తాడుగా అల్లి కొయ్యబల్లకు నాలుగువైపులా కట్టి నేలకు మూడడుగుల ఎత్తున వేలాడదీసేవారు. కొయ్యబల్లకు నాలుగు మూలలా నాలుగు దీపపు ప్రమిదలను ఉంచేవారు. అసలే బాబా ఆజానుబాహులు. అంత మనిషి ఆ బల్లపైకి ఎలా ఎక్కేవారో? ఎలా దిగేవారో అనేది ఎవరికీ అంతుబట్టేది కాదు. బాబా బల్లపై ఎలా నిద్రిస్తారో అనేది పెద్ద వింత. బాబా నిద్రపోయే, నిద్ర లేచే వేళలను చూడాలని షిర్డీవాసులంతా ఉబలాటంతో అక్కడికి చేరేవారు. జనం తీరుతో విసిపోయిన బాబా ఒకసారి కొయ్యబల్లను విరిచి ముక్కలు చేసి పారేశారు. ఒకసారి కాకా సాహెబు దీక్షిత్ వద్ద బాబా బల్ల ప్రస్తావన తెచ్చారు.
‘‘బాబా! మీకు మక్కువగా ఉంటే మరో కొయ్యబల్లను తయారుచేయించి తీసుకువస్తాను’’ అన్నాడు కాకా సాహెబు.
‘‘మహల్సాపతిని వదిలి నేనొక్కడినే పైన పడుకోను’’ అని బాబా చెప్పారు.
‘‘అతనికి కూడా మరొకటి చేయిస్తాను బాబా’’ అన్నాడు కాకా.
‘‘అంతెత్తు బల్లపై మహల్సాపతి ఎలా పడుకోగలడు? ఎవరైతే కళ్లు తెరిచి నిద్రించగలరో వారే పడుకోగలరు. నేను నిద్రపోయేటపుడు నా పక్కన కూర్చుని తన చేయిని నా హృదయంపై ఉంచమంటాను. అక్కడినుంచి వినబడే భగవన్నామ స్మరణను శ్రద్ధగా వినమంటాను. నేను నిద్రలోకి జారుకుంటే కనుక మేల్కల్పమంటాను. కానీ మహల్సాపతి గుర్రుపెట్టి నిద్రపోతుంటాడు. కునికిపాట్లు పడతాడు. నిద్రవల్ల నా హృదయంపై ఉండిన వాడి చేయి బరువెక్కటం గమనించి ‘ఓ భగవత్’ అని పిలుస్తాను. ఉలిక్కిపడి లేస్తాడు. ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేరో, ఎవరైతే నిద్రకు బానిసలో, ఎవరైతే కొద్ది క్షణాల పాటైనా కదలక, మెదలక ఉండలేరో వారు ఎతె్తైన బల్లపై ఎలా పడుకోగలరు?
బాబా చెప్పిన ఈ మాటలనుంచి మనం రెండు విషయాలు గ్రహించాలి. కొయ్యబల్లపై పడుకోవటం అంటే యోగసాధన. సాధారణులైన వారికి బాబా బల్లపై ఎలా పడుకోగలుగుతున్నారనేది పెద్ద ప్రశే్న! కానీ, యోగులకది అతి సాధారణం. బల్లపై పడుకోవటం అనే సాధన చేయాలంటే నిద్ర పనికిరాదు. కార్యసాధనకు నిద్ర శత్రువనేది బాబా భావం. ఇక రెండవది- కొయ్య బల్ల విరిచిపారేయటం. దీని ద్వారా బాబా మరో మంచి విషయాన్ని చెబుతున్నారు.
‘‘మంచి కాని, చెడ్డ కాని ఏది మనదో అదే మన వద్ద ఉంటుంది. ఏది ఇతరులదో అది ఇతరుల వద్దే ఉంటుంది’’.
బాబా యోగాభ్యాసాలు..
శ్రీ సాయి సకల యోగ సాధకులు. బాబాకు రాని విద్య లేదు. జనం మెప్పుకోసం, వాటిని ఏనాడూ ప్రదర్శించాలనుకోలేదు. తాను నిద్రపోవటాన్ని కూడా జనం వేలంవెర్రితనంతో చూడటాన్ని సహించని బాబా తాను నిద్రించే కొయ్యబల్లను ముక్కలు చేసిపారేశాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించటమే బాబా కర్తవ్యంగా భావించారు. తన యోగ విద్యలు, మహిమలు, లీలల్ని బహిరంగ ప్రదర్శనల స్థాయికి మార్చేవారు కాదు. ధౌతి, ఖండయోగం, సమాధి స్థితి, షడ్విధ యోగ ప్రక్రియల్లో బాబా ఆరితేరినవారు. ఎవరి కంటా పడకుండా బాబా తన యోగ విద్యలను ఆచరించేవారు.
మసీదుకు దూరంగా ఉన్న మర్రి చెట్టు వద్ద ఓ బావి ఉండేది. ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అక్కడకు వెళ్లి ముఖం కడుక్కుని స్నానం చేసేవారు. ఆ సమయంలో బాబా తన ప్రేగుల్ని బయటికి తీసి వాటిని నీటితో శుభ్రపర్చుకునేవారు. అనంతరం వాటిని సమీపంలోని నేరేడు చెట్టుపై ఆరవేసేవారు. ఇది భక్తులు కొందరు కళ్లారా చూసారు. ఇలా శరీరంలోని అవయవాలను బయటికి తీసి శుభ్రపర్చుకుని, వాటిని ఆరబెట్టి మళ్లీ యధావిధిగా అమర్చుకోవటాన్ని ధౌతియోగం అంటారు. సాధారణంగా మూడు అడుగుల వెడల్పు, ఇరవై రెండున్నర అడుగుల గల గుడ్డను కడుపులోకి మింగి అరగంట సేపు లోపల ఉంచి తిరిగి ఆ గుడ్డను బయటికి తీయటాన్ని ధౌతి యోగం అంటారు. అంటే ఆ గుడ్డను ఉపయోగించి శరీరం లోపలి అవయవాలను శుభ్రపర్చుకోవటం ఈ యోగ ప్రక్రియలోని పరమార్థం. కానీ బాబా ఆచరించే ధౌతి ప్రక్రియ మిక్కిలి విశిష్టమైన, అసాధారణమైనది. బాబా ఆచరించే ఖండయోగం మరీ ఆశ్చర్యకరం. బాబా తన శరీర అవయవాలను వేటికవి వేరు చేసి మసీదు ఆవరణలో వేర్వేరు చోట్ల ఉంచేవారు.
*
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566