మెయిన్ ఫీచర్

ఇంటికి ఇంటీరియర్ ముఖ్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అనడం ఒకప్పటి మాట. ఇల్లు చూసి ఇంటీరియర్ డెకరేషన్‌ను చూడడం నేటి ఫ్యాషన్. భవన నిర్మాణంలో ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు, డుప్లెక్స్‌లు.. ఇలా పేరేదైనా, రూపు ఎలాంటిదైనా అందరికీ అనుకూలంగా అమర్చేవారే ఇంటీరియర్ డిజైనర్లు. లివింగ్ రూము, బెడ్‌రూము, కిచెన్, పూజ, డైనింగ్, బాత్రూం, పిల్లల గది, అతిథుల గది.. వీటన్నింటినీ ఆర్కిటెక్ట్ చూసుకుంటాడు. పూర్తయిన ఇంటి నిర్మాణాన్ని చూస్తే ఇంకా ఏదో మిగిలే ఉందనిపిస్తుంది. ఆ శూన్యమే.. లోపించిన ఇంటీరియర్ డిజైన్! మనిషి మనుగడకు గుర్తింపు ఎంత ముఖ్యమో.. ఆధునిక కాలంలో ఇంటికి ఇంటీరియర్ అంత ముఖ్యం. నాలుగ్గోడల మధ్యనున్న శూన్యాన్ని తరిమేసి ఇంటికి నిండుదనాన్ని తెచ్చేదే ఇంటీరియర్. ఇల్లు కట్టేటప్పుడు కేవలం ఇంటి యజమాని మాత్రమే పాలు పంచుకుంటాడు. అయితే ఇంటీరియర్ విషయంలో మాత్రం ఇంటిల్లిపాదీ పాలు పంచుకుంటారు. ఎందుకంటే ఎవరి గది ఎలా ఉండాలో, ఎలా తీర్చిదిద్దుకోవాలో వారి అభిరుచి బట్టి ఇంటీరియర్ ఉంటుంది.
ఇంటి ఇల్లాలు వంటగదిపై ఎక్కువ ఆసక్తి చూపుతుంది. పిల్లలు తమ గదిలో కార్టూన్ థీమ్ కావాలంటారు. యజమాని లివింగ్, డ్రాయింగ్ రూం డైనింగ్ రూముపై ఎక్కువ ఆసక్తి చూపుతాడు. తన స్నేహితులు వచ్చినప్పుడు అవి చక్కగా ఉండాలనుకుంటాడు కాబట్టి. ఇక ఆ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే పూజగది బాగుండాలి నాయనా అని చెబుతారు. ఇలా.. వీళ్లందరి అభిప్రాయాలను సమన్వయపరిచి ఇంట్లోని వారందరికీ నచ్చే విధంగా, ఇంటికి వచ్చినవారు మెచ్చేవిధంగా ఇంటికి ఆకర్షణీయంగా తీర్చిదిద్దగల వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్. అటువంటి ఇంటిని ధరాభారం కాకుండా, ధనాభావం రాకుండా సామాన్యులు కూడా అందుకోవాలంటే కష్టమేమో అనుకోనక్కరలేదు. ఎందుకంటే మన బడ్జెట్లోనే ఇంటిని తీర్చిదిద్దే ఇంటీరియర్ డిజైనర్లు చాలామందే ఉన్నారు. వీరు మార్కెట్లోని వివిధ ఉత్పత్తుల మధ్య ధరల తేడాలను వివరించడమే కాకుండా, తక్కువ బడ్జెట్లోనే నాణ్యతను ఎలా కాపాడుకోవాలో సూక్ష్మ మార్గాలను వివరిస్తున్నారు.
ఇంటీరియర్ డిజైనర్లు చెబుతున్న ముఖ్య విషయాల్లో.. తూకం తక్కువుండి నిడివి పెద్దవైనా అటువంటి హ్యాం డిస్‌లు వాడకూడదన్నది మొదటి పాయింట్. వాటికన్నా క్వాలిటీ బాగున్న చిన్నసైజువే మేలని వివరిస్తున్నారు. అలాగే గ్లాస్ వినియోగించాల్సి వచ్చినప్పుడు గాఢమైన డిజైన్లు చేయించి అధిక ధర వెచ్చించే కన్నా గ్లాస్ మీద చక్కటి స్టికర్ అంటించి కొత్త అందాలను సృష్టించవచ్చని సూచిస్తున్నారు.
సాధారణంగా కొత్త ఇల్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇంటి డిజైనింగ్, ఇంటికి వేయాల్సిన రంగులు. చాలామంది తమకు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక రంగును వేస్తుంటారు. ఎంతో శ్రమించి, వెచ్చించి నిర్మించుకున్న ఇంటికి సరైన రంగులు వేయకుంటే ఆ ఇంటికి అందం ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే అందమైన డిజైనింగ్‌తో రూపొందిన ఇల్లు కూడా ఆహ్లాదాన్ని కోల్పోతుంది. అలాకాకుండా ఇంటికి మనకు నచ్చిన రంగులు వేసుకుంటే అందంగా ఉంటాయంటున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. పెయింటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే ఇంట్లో ఆహ్లాదకరమైన, పవిత్రమైన వాతావరణం ఉంటుంది. ఆహ్లాదకరమైన పెయింటింగుతో ఇంట్లో అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.
*