మెయిన్ ఫీచర్

అతి వద్దు... కొంచెం చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీరోసైజ్ ఉండాలని అమ్మాయిలు అనుకోవడం మామూలే. ప్రతి అమ్మారుూ సన్నగా నాజుగ్గా తమలపాకు ఈనలాగా ఉండాలని అనుకొంటూ ఉంటుంది. దీనికోసం జిమ్‌లు చుట్టూ తిరిగేవారు కొందరు. డైట్ అంటూ అసలేమీ తినకుండా కడుపు మాడ్చుకునేవారు ఇంకొందరు ఉంటారు. ప్రూట్ డైట్, లిక్విడ్ డైట్ అంటూ మరికొందరు సన్నగా రావాలని అనుకొంటుంటారు.
ఇట్లా అనుకొనేవారు కేవలం టీనేజ్‌లో ఉండేవారేకాదు. ఈమధ్య 50కి దగ్గరలో ఉన్నవారు కూడా సన్నగా ఉండాలనుకొంటున్నారు. ఇలా అనుకోవడం మంచిదే కానీ దానికోసం ఒక పద్ధతి లేకుండా ఒకటే జిమ్‌కు వెళ్లడం, లేక తిండి తినకపోవడం లాంటివి చేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
నాకు తెలిసిన ఒక శ్రావ్య 20 ఏళ్లు ఉంటాయి. తను అంత లావు కాదు సన్నమూ కాదు మధ్యరకంగా ఉంటుంది. కానీ జీరోసైజ్ రావాలని ప్రూట్ డైట్ మొదలెట్టింది. రోజుకు ఓ నిమ్మకాయ రసం తాగేది. మరేమీ తీసుకోకుండా ఉండిపోయింది. శ్రావ్య వాళ్ల అమ్మ దాదాపు ఆమెకు 45 ఏళ్లు ఆమె కూడా తన కూతురుతో పాటుగా సన్నగా రావాలని డైట్ తో పాటు జిమ్‌కు కూడా వెళ్లడం ప్రారంభించింది. ఈ తల్లి కాస్త ఊబకాయురాలే. ‘అయ్యో శ్రావ్య నీవు అసలే సన్నగా ఉన్నావు. నీతోపాటు నేను సన్నగా రావాలంటే తొందరగా బరువు తగ్గాలి కదా ’అంటూ రోజుకు 5 గంటలు జిమ్ చేసింది.
వీరే కాదు చాలామంది తొందరగా సన్నగారావాలని ఎక్కువ చేయడమో లేక వేరే పనులతో రేపు వీలుకాదు కనుక ఈరోజే రేపటి వ్యాయామం చేసేస్తాను అనో చేస్తుంటారు.
అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదా. దేనికైనా అతి పనికిరాదు. జిమ్‌లో బరువులెత్తడం, పరుగెత్తడం అసలు ఏ వ్యాయామం అయినా తక్కువ కాలంలో ఎక్కువ చేస్తూ ఉంటే సన్నగా రావడం కాదు ఆరోగ్యసమస్యలు మొదలవుతాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. కొందరికి ఊపిరి ఆగిపోతుంది. మరికొందరికి శ్వాసకోశంలో ఇబ్బందులు ఏర్పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
అందుకే రోజు వ్యాయామం కొంతసేపు మాత్రమే చేయాలి. సన్నగా రావాలి అంటూ అసలు తినకపోవడం, అతిగా తినడమూ తప్పే. దేనికైనా ఒక క్రమపద్ధతిని పాటించాలి. అపుడే అనుకొన్నదాన్ని సాధించగలుగుతాము. అంతేకానీ రేపొద్దుటి కల్లా అనుకొన్నది జరిగిపోవాలి అనుకొంటే అది ప్రమాద గంటికలనే మోగిస్తుంది.
బరువు తగ్గాలనుకొన్నా, పెరగాలనుకొన్నా సరే ఒక శిక్షకుని దగ్గరకు వెళ్లాలి. వారి దగ్గర సలహాతీసుకోవాలి. వ్యాయామం మొదలుపెట్టేటపుడు బాడీ కండీషన్ ఎలా ఉందో చూసుకోవడానికి ముందు వైద్యుల దగ్గరకు వెళ్లాలి. వారి సలహాను పాటించి మాత్రమే వ్యాయామాలు మొదలు పెట్టాలి. పత్రికలు చదివో, టీవీలు చూసో ఏదో ఒకటి చేసేయ్యకూడదు. ఎవరి బాడీ కండీషన్‌ను వారు చూసుకొని మాత్రమే చేయాలి.
శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. లేకపోతే కండరాలు పట్టుకుపోవడమో, అలసటకు గురి అవడమో జరుగుతుంది. రోజూ సాధారణంగా 45 నిముషాల నుంచి 1 గంట వరకు వ్యాయామం చేయవచ్చు. ఇది కూడా వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఏ వ్యాయామం చేయడానికైనా ముందుగా 15 నిముషాలు వార్మ్‌అప్ చేయాలి. నిద్రలేవగానే ట్రెడ్‌మిల్ ఎక్కి పరుగెత్తడమోలేక సైకిల్ తొక్కేయడమో చేయకూడదు. బరువులు ఎత్తేటపుడు కూడా మహిళలు కేవలం నాలుగు కిలోలతో సాధన చేయాలి. ఆ తరువాత మెల్లమెల్లగా పెంచుకుంటూ 6,7 కేజీల దాకా వెళ్లవచ్చు. అంతేకాని ఒకటే సారి 10, 15 కిలోలు ఎత్తేయ్యకూడదు.
ప్రతిరోజు వ్యాయామం చేయాలి కాని రెండుమూడు రోజుల వ్యాయామం ఒకటే సారి చేయకూడదు. వ్యాయామం తర్వాత విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి. అట్లానే డైట్ విషయంలోను అంతే. వైద్యుల సలహాతీసుకొన్న తర్వాతనే డైట్ కంట్రోలు చేయాలి. ఇక్కడ కూడా మెల్లగా ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి కానీ అన్నీ చేసేయకూడదు. చిన్నపాటి వ్యాయామాలతో శరీరానికి ఫ్లెక్సిబుల్‌గా చేసుకోవాలి.

- లక్ష్మీప్రియాంక