మెయిన్ ఫీచర్

సమభావనతోనే సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ స్ర్తిని మరీ చులకనగా ఒక బల్లలా, ఒక కుర్చీలా కేవలం ఏదో ఒక వస్తువులాంటి ఆస్తిలా పరిగణిస్తారే కానీ, ప్రాణమున్న జీవిగా చూడరు. అందుకే చైనాలో భర్త తన భార్యను చంపినా అక్కడి చట్టాలు అతనిని శిక్షించవు. ఎందుకంటే, అక్కడ స్ర్తి కేవలం ఒక వస్తువు లాంటిది. ఆమెను ఏమిచేసినా, చివరకు ఆమెను చంపినా అక్కడి చట్టాల దృష్టిలో అది నేరం కాదు. వ్యక్తిగత ఆస్తుల ప్రవేశంతో స్ర్తికూడా ఒక వ్యక్తిగత ఆస్తిగా తయారైంది. సహజంగా తల్లి ఎవరో తెలుస్తుంది. కానీ, తండ్రి ఎవరో తల్లి చెప్తే కానీ తెలియని పరిస్థితి. అది పెద్ద సమస్యగా పరిణమించడంతో ప్రతి భర్త తన భార్య స్వేచ్ఛకు అన్నిరకాల అడ్డుకట్టలు కట్టి, ఆమె పర పురుషుని చూడకుండా అన్ని తలుపులు మూసేసి, ఆమెకు పుట్టిన సంతానం తనదే అని చెప్పుకునేందుకు కావలసిన అన్నిరకాల వ్యూహాలను అనుసరించాడు. చర్చిలు, దేవాలయాలలోకి ప్రవేశించేందుకు కేవలం వృద్ధ స్ర్తిలను మాత్రమే అనుమతించడమనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగినదికాదు. శతాబ్దాల తరబడి స్ర్తి స్వేచ్ఛగా బయటకు వచ్చేందుకు అవకాశమున్న ప్రదేశాలు అవే. కుటుంబ వ్యవస్థ రక్షణ విషయంలో చర్చి ప్రధాన పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. ఎందుకంటే, కుటుంబ వ్యవస్థ లేకపోతే తనకు మనుగడ ఉండదని చర్చికి తెలుసు. ‘‘ఇంటి కన్న గుడి పదిలం’’అన్నట్లుగా శృంగార కలాపాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఏకైక ప్రదేశమే చర్చి. మతాచార్యుడు బ్రహ్మచారిగా ఉంటూ సెక్స్‌ను, స్ర్తిని వ్యతిరేకిస్తూ ఉంటాడు. చర్చి మీకిచ్చే హామీలు అవే. అన్ని మతాలలో ఇదే పరిస్థితి వివిధ రకాలుగా సాగుతోంది.
జైన సన్యాసి ఏ స్ర్తిని తాకలేడు. వాస్తవానికి, ఏ స్ర్తి అయినా జైన సన్యాసికి ఎనిమిది అడుగుల దూరంలోనే ఉండాలి తప్ప అంతకన్నా దగ్గరకు వెళ్ళకూడదు. బౌద్ధ సన్యాసులను స్ర్తిని తాకనివ్వరు. మతపరమైన దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి ధార్మిక ప్రదేశాలలోకి ప్రవేశించేందుకు స్ర్తిలను అనుమతించని అనేక మతాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అనుమతించినా, వారు పురుషుల కంటపడకుండా ఉండేలా, వారికోసం కొద్దిగా కేటాయించిన ప్రత్యేక విభాగాలు ఉంటాయి. పురుషులు అటువంటి ధార్మిక ప్రదేశాలలో అత్యధిక భాగాన్ని ఆక్రమించినప్పటికీ అక్కడి స్ర్తిలను ఏమాత్రం కలవలేరు, కనీసం చూడలేరు. అలా ఉంటాయి అక్కడి ఏర్పాట్లు. అనేక మతాలు, ముఖ్యంగా ఇస్లాం మతం, తమ స్ర్తిల ముఖాలను, శరీరాలను పూర్తిగా ముసుగుతో కప్పేసింది. అందుకే ఎండ తగలని వారి ముఖాలు, శరీరాలు పాలిపోయి ఉంటాయి. పైగా, వారు స్ర్తిలకు చదువు చెప్పించరు. ఎందుకంటే, అప్పుడు వారికి విషయాలు వివరంగా తెలుస్తాయి. వెంటనే వారు అనేక ప్రశ్నలతో వాదించడం ప్రారంభిస్తారు. అలాగే, స్ర్తిలను ఉద్యోగం చెయ్యనివ్వరు. ఎందుకంటే, అప్పుడు వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది. అప్పుడు వారు చెప్పిన మాట వినరు. అందుకే స్ర్తిల స్వేచ్ఛను అన్ని రకాలుగా హరించి ఆమెను బానిసను చేశాయి అన్ని మతాలు. అప్పుడే పురుషుడు తన భార్యకు పుట్టిన కొడుకును తన కొడుకుగా నమ్మగలడు. ముఖ్యంగా రాజులకు, చక్రవర్తులకు అనేక వందల మంది భార్యలు ఉండేవారు. వారిలో చాలామంది ముఖాలను కూడా వారు చూసి ఉండరు. అందువల్ల సహజంగానే వారి భార్యలు పరపురుషుని ప్రేమలో పడే అవకాశముంటుంది. అందుకే వీర్య గ్రంథులను తొలగించి నిర్వీర్యులుగా చేయబడ్డ పురుషులనే వారు తమ సేవకులుగా నియమించుకునేవారు. అప్పుడు తమ భార్యలు వారి ప్రేమలోపడినా ఎలాంటి ప్రమాదముండదు. ఎందుకంటే, వారివల్ల పిల్లలు పుట్టే అవకాశముండదు. అదే అసలు విషయం.
కుటుంబ వ్యవస్థ అంతరించి దాని స్థానంలో భావసారూప్య వ్యక్తుల సమిష్టి కలయిక అయిన ‘కమ్యూన్’ చోటుచేసుకోవాలి. అప్పుడు అందరి వనరులు, శక్తులు అక్కడ ఏకమవుతాయి. ఫలితంగా అందరూ శ్రీమంతులై బాధ్యతలను, సుఖసంతోషాలను సమానంగా పంచుకుంటారు. అక్కడి పిల్లలందరూ అందరివారే అవడంతో వారసత్వ సమస్య తలెత్తదు. అలాంటి వ్యక్తులు, వారితో కూడుకున్న ‘కమ్యూన్’లు సమాంతరంగా ఎదుగుతూ ఉంటే సమాజం, దాని రుగ్మతలు అంతరిస్తాయి.
ఒక ఉదాహరణ:
మామూలుగా మనకు రోగం వచ్చినప్పుడే వైద్యునికి డబ్బు చెల్లించి అతను ఇచ్చిన సలహాలను పాటించి రోగాన్ని నయం చేసుకుంటాం. ఈ విధానంలో ప్రజలకు రోగాలు వచ్చినప్పుడే వైద్యులకు ఆదాయం వస్తుంది.
అందుకే ప్రజలకు రోగాలు రావాలని, అవి తొందరగా తగ్గకూడదని వైద్యులందరూ కోరుకుంటారు. అందుకే ఆ విధానాన్ని మార్చేందుకు రెండువేల సంవత్సరాల క్రితం చైనాలో ఒక విప్లవాత్మక నిర్ణయం చోటుచేసుకుంది. ఆ నూతన విధానంలో దేశంలోని ప్రతి వ్యక్తికి అతని ఆరోగ్య బాధ్యతను స్వీకరించే వ్యక్తిగత వైద్యుడు తప్పకుండా ఉండాలి. ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆ వైద్యునికి అతను ప్రతినెల జీతం చెల్లిస్తూనే ఉండాలి. ఒకవేళ అతనికి రోగమొస్తే వైద్యునికి జీతం చెల్లించక్కర్లేదు. అందువల్ల సహజంగానే వైద్యులందరూ చాలా బాధ్యతాయుతంగా ఉంటూ, ఎవరికీ ఎలాంటి రోగాలు రాకూడదని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే, ఎవరికైనా రోగమొస్తే అతని వైద్యునికి జీతం రాదు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.