మెయిన్ ఫీచర్

నీ జీవితాన్ని ప్రేమించు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ కాలం యువతకు జీతాన్ని ప్రేమించటం తెలిసినంతగా జీవితాన్ని ప్రేమించటం తెలీటంలేదండీ’’ అంటూ కాస్త అసహనంగా ఒక కామెంట్ పడేశాడు ఒక మిత్రరాజం..
మెదట్లో అది కామెంట్‌లా అనిపించినా అది కాంటెంపరరీ రియాలిటీనే అనిపించింది కాస్త నేను నెమ్మదించిన తర్వాత. ఈ నేపథ్యంలో - నా ‘ఒత్తిడి ఇక లేనట్లే’ పుస్తకం చదివిన కొందరు నాలో స్పందించిన తీరు వారికి నా ప్రతిస్పంన నా కళ్లముందుకొచ్చింది.. ఆ సారాంశానికి అక్షర రూపం-
****
పర్సనల్ ప్రోగ్రెస్ పేరిట స్వభావ విరుద్ధ జీవన విధానం, అప్రాకృతిక జీవనశైలి ఒక విధమైన ఆనందాన్ని ఇచ్చినప్పటికీ తెలీని ఒత్తిడినీ పెంచుతుంటాయి. స్వభావ సిద్ధంగా కాక సామాజికంగా పెంచుకున్న జీవితం నలుగురిలో తలెత్తుకునేలా చేస్తుందే తప్ప ఆరోగ్యపరంగా తలదించుకునేలా చేస్తుంది. ఈ జీవన విధానాన్ని షూళ్ఘఆజశ ఘశ ఖశూళ్ఘజఒఆజష ఒఆ్ఘశజ్ఘూజూగా ఛెప్పుకోవచ్చు.
***
మనల్ని చూసి ఇతరులు అసూయపడేలా మన జీవితం వెలిగిపోతుంటుంది... అయినా మనలో మనం దహించుకుపోతుంటాం.. కారణం డిప్రెషన్.. అంటే ష్దళౄజష్ఘ జౄఇ్ఘ్ఘశషళ జశ ఆ్దళ ఇ్ఘజశ. అవును, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెత మనం చిన్ననాటినుండీ వింటున్నదే. అది ఇంతకాలం సామెతలా అనిపించిందే కాని అది మనల్ని హెచ్చరిస్తోందని గుర్తించలేకపోయాం. అందుకే వృత్తిపరంగా కాంపిటీషన్ అనుకుంటూ కొట్టుకుపోతూ- మనకు తెలీకుండానే అసూయాగ్రస్థం అవుతూ, ఇతరులు అసూయపడేలా మన జీవన విధానాన్ని కొనసాగిస్తూ, ఫాల్స్ ప్రిస్టేజీతో, మనలో మనం దహించుకుపోతున్నాం. ఈ గమ్మత్తయిన ఒత్తిడితో మనలో కడుపుమంట.. అల్సర్, అసిసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్. ఫలితంగా భవిష్య జీవితమంతా క్రుంగుపాటు.. తెలీని దిగులు..
***
మనం చేయవలసింది- అసూయను కాదు, ఆనందాన్ని పెంచుకోవటం. లైఫ్ హాజ్ ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్ అని గుర్తించాయి. ఆనందక్షణాల కోసం కలలు కంటూ బయటి ప్రపంచంలో అలవేసి పట్టుకోనవసరం లేదు. కలలు కంటూ, అలలు విసురుతూ వాస్తవాన్ని మరిస్తే ఎలా? ఆనందం మనలో, మన అస్తిత్వంలోనే ఉంది. బయటి ప్రపంచాన్ని ఈదటం మాని, మనలోకి దిగాలి. మన లోలోతుల్లోకి వెళ్లగలిగితే అక్కడి ప్రతి అంశం ఆనందం కలిగించేదే.
అంతరంగంలో లభించే ఆనందం ముందు ఈ వస్తు ప్రపంచం అందించే ఆనందం ఏపాటిది? అవును, మన జీవితం ఆనంద నిలయమే! అయితే ఆ ఆనంద నిలయం కేవలం కాంక్రీట్ కట్టడం అయితే ఎలా? అది మిరుమిట్లుగొలిపే భవనమే అయినప్పటికీ ఆ ఇంటి చుట్టూ పచ్చదనం ఏది? ఆనందం కోసం కేవలం భవనం కట్టుకుంటే సరిపోదు.. అది ఎంతటి గొప్ప క్రియేషన్ అయినప్పటికీ గది ప్రకృతిలో వొదిగిపోవాలి. ఆ ఇంటి చుట్టూ మొక్కలకు, పాదులకు నీరు పోస్తూ, రక్షిస్తూ, సంరక్షిస్తూ, మనమే తోటమాలి కావాలి. అప్పుడే, ఆ పచ్చదనం మధ్యన జీవితం సీతాకోక చిలుక అవుతుంది. ఆనందం పరపరాగం, స్వపరాగం అవుతుంది. కాబట్టి, శాంతి వచనాలు పలికితే సరిపోదు- మనమే శాంతవనం కావాలి. అందుకే అంటుంటాం- ‘హావింగ్ ఎ గుడ్ లైఫ్ డజ్ నాట్ డిఫైన్ హాపీనెస్, బట్ హాపీనెస్ డిఫైన్స్ హావింగ్ ఎ గుడ్ లైఫ్’ అని.
***
ప్రతీ లక్ష్యం జీవితాన్ని నిర్వచించదు.. ఆనందమయ జీవితాన్ని అందించదు. కాంపిటీటివ్ ప్రపంచంలో నెగ్గుకురాకపోతే ఎలా? అని యువత అనుకోవటం సహజమే! ‘అవును కాబోలు’ అని వృద్ధ ప్రపంచమూ తల ఊపుతుంటుంది. లక్ష్యాలు, నిర్దేశించుకోని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. నిన్నటి తరంలోను ఉన్నారు. మన తరంలోను ఉన్నారు.. ఈనాటి యువతరంలోను ఉన్నారు.. రేపటి బాలతరంలోను ఉన్నారు. తరాలు మారుతున్నా, లక్ష్యాలను అధిగమిస్తున్నా, ఇంకా ‘తమి’ తీరకపోవటంతో, తడుస్తున్నా పోనీ నడుస్తున్నా జీవితం సైతం పొడి జీవితమే అవుతోంది.. జీవన విధానం డ్రై అవుతోంది. జీవన శైలి సూపర్‌ఫాస్ట్ అవుతోందే తప్ప తీసుకునే ఆహారం ఫాస్ట్ఫుడ్ సెంటర్‌లకే పరిమితం అవుతోంది. ఫలితం ఆనందం అధికం.. ఆరోగ్యం అధమం.
అవును, హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో జీవితాన్ని ప్రారంభించవచ్చు. లక్ష్యాలను అధిగమిస్తూ మైలురాళ్లను దాటుతుండవచ్చు. అయితే ప్రతీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవటం తెలియాలి. లక్ష్యం నుండి మరో లక్ష్యానికి ఎగబ్రాకటం ఒక్కటే సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవటం కాదు. చిన్న పిల్లలు పుట్టినరోజును జరుపుకుని మరునాడే మళ్లీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడిగినట్లు కాకూడదు సెలబ్రేషన్స్ అండ్ టార్గట్స్. అలాగే నేటి ‘సక్సెస్’ను మరచి రేపటి సక్సెస్ కోసం ఎదురుచూడటం నేటి ఆనందాన్ని కోల్పోవటమే! ‘ఎక్స్‌పీరియన్స్ ది జాయ్ ఆఫ్ ది మొమెంట్’ అంటే తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే, ఈ క్షణంలో బ్రతకటమే నిజమైన బ్రతుకు.. ఆ ఆనందం మధురం.. అదే సక్సెస్‌ఫుల్ లైఫ్!
***
‘హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ అట్టర్ శాటిస్‌ఫాక్షన్’- మంచి జీవితం అంటే డబ్బున్న జీవితమా? ఆరంకెల జీతమే సంపన్న జీవితమా? చిన్న కుటుంబం పెద్ద జీవితాన్ని అందించటం లేదూ! అలాగే జీతాన్ని ఎక్కువ తక్కువలతో లెక్కించటం తగ్గిస్తే జీవితం పెద్దదే అవుతుంది. ఆనందమయ జీవితానికి కావలసింది ఎనలేని సంతృప్తి. కష్టాలు, కన్నీళ్లు లేని జీవితం కలలోకి సైతం రాదు.. లాభాలు, నష్టాలు లేని జీవితం మూడో కంటికి సైతం కనిపించదు.
బ్రతకటానికి అన్నీ ఉండాలి.. జీవించటానికి అన్నీ ఎమోషన్స్ తోడుకావాలి.. తృప్తిగా జీవించటానికి పదిమంది తోడ్పాటు కావాలి. బ్రతుకంటే అది. ఈ బ్రతుకులోనే ఆనందం ఉంటుంది.. తృప్తి ఉంటుంది. ఎల్‌ఈడి టీవీనే బ్రతుకు కాదు.. పది లక్షల కారే పుష్పక విమానం కాదు.. కోటి రూపాయల ఇల్లే సర్గం కాదు.
మన ఆలోచనా విధానం మారాలి..
మన జీవన శైలి మారాలి..
మన జీవితాన్ని ప్రేమించటం తెలియాలి..
మనల్ని మనం ప్రేమించుకోవటం తెలియాలి..
జీవితాన్ని మనం ప్రేమిస్తేనే జీవితం మనల్ని ప్రేమిస్తుంది.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946