మెయిన్ ఫీచర్

శరీరమే కాన్వాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ముఖంలో ఆరు జతల కళ్లు..
ఆ ముఖంలో రెండు ముఖాలు..
ఆ ముఖంలో అనేక వేళ్లు మొలిచి ఉంటాయి...
ఇదేంటి.. ఆ ముఖం అంత భయంకరంగా ఉంటుందా!? అని ఆలోచిస్తున్నారేమో.. లేదు. ఆ ముఖం చాలా చాలా అందంగా ఉంటుంది. ఆ అందగత్తె పేరు డైన్ యూన్. దక్షిణ కొరియా రాజధాని సోల్‌కు చెందిన ఈ అందగత్తె తన శరీరానే్న కాన్వాస్‌గా మార్చుకుని కళకు జీవం పోస్తోంది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంతోమంది ఆమెను, ఆమె కళను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. డైన్ యూన్ మునుపు డ్రామాల్లోనూ, సినిమాల్లోనూ పనిచేసింది. మొదట ఈమె ఇతరుల శరీరాలపై బొమ్మలు వేసేది. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఆమె తన శరీరానే్న కాన్వాస్‌గా మార్చుకుని బొమ్మలు వేస్తోంది. ఇలాగైతే తనను తాను మరింతగా వ్యక్తీకరించుకోవచ్చని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోయిందో ఏమో కానీ.. తన శరీరంపైనే బొమ్మలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఆ ఫొటోలను కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం మొదలుపెట్టింది. అంతే లైకుల మీద లైకులు, కామెంట్లు రావడం మొదలయ్యాయి. దీంతో ఆమె మరింతగా తన కళను మెరుగుపరుచుకుంది. తనలోని భావాలను ఇన్‌స్టాగ్రామ్ అభిమానులతో ఇలా పంచుకుంది.
‘నేను నా ముఖాన్ని డైరీలోని ఒక పేజీలా భావిస్తాను. నేను కలిసిన వ్యక్తుల పట్ల నాకు కలిగిన భావాలనే నేను శరీరంపై చిత్రీకరిస్తాను. నా చిత్రాలు చాలావరకు నా భావాలను బట్టే ఉంటాయి. మనిషి ముఖం ఒకటే అయినా వ్యక్తిత్వంలో మాత్రం ఎన్నో పార్శ్వాలుంటాయి. ఎవరైనా తాము తమలా ఉన్నప్పుడే వారు మరింత అందంగా ఉంటారు. నా శరీరంపై బొమ్మలు వేయడం ప్రారంభించాక కొన్ని రోజులు ఎలాంటి భావాలూ పలికించని ముఖాలు వచ్చాయి. నేను నిరాశపడలేదు.. మళ్లీ మళ్లీ గీశాను. ముఖ్యంగా కళ్లు. మనుషులను కలిపేది కళ్లు కాబట్టి నా చిత్రకళలో కళ్లే చాలా ఆసక్తికరమైనవి. నా శరీరంపై కొత్త చిత్రాలను వేసుకున్న తర్వాత వాటిని సరదాగా ఫొటోలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచుతాను. అలా అలా నా చిత్రకళకి మరింత పేరొచ్చింది. ఇప్పుడు బయట ఎవరైనా నన్ను ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. నా ఆత్మవిశ్వాసం ఇప్పుడు మరింతగా పెరిగింది. అన్నట్లు నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. వీటినే ఎక్కువగా చూస్తాను. పుస్తకాలు కూడా ఇలాంటివే ఎక్కువగా చదువుతుంటాను. ఇవి కూడా నా ఆర్ట్‌కు ఎక్కువ ప్లస్ అవుతాయి’ అని చెబుతోంది డైన్ యూన్. ఏది ఏమైనా ఇలాంటి వెరైటీ చిత్రకళ వేయాలంటే మాత్రం పట్టుదల, శ్రద్ధ చాలా అవసరమే మరి!