మెయిన్ ఫీచర్

శుభగీతిక తామ్రపర్ణి పుష్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన ఆర్ష విద్య, సభ్యతా సంస్కృతులకు, సనాతన సంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి ఉన్న భారతావనిలో ప్రతి జీవిలో దైవాన్ని దర్శించి, పూజించడం సదాచారంగా వస్తున్నది. అందులోభాగంగానే పంచ మహా భూతాలలో ఒకటిదైన నీటికి ప్రాధాన్యత ఇస్తూ, జీవనదులను ఆరాధించడం పరంపరానుగతంగా వస్తున్నది. పుష్కరం అంటే 12ఏళ్ళు. 12ఏళ్ళకు ఒకసారి ఒక నదికి పుష్కరం రావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే 12నదులకు సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రదాయం ఆచరణలో ఉంది. ‘‘మేషే గంగా, వృషే రేవా, మిథునేతు సరస్వతీ, కర్కటే యమునా ప్రోక్తా, సింహే గోదావరీ స్మృతా, కన్యాయాం కృష్ణవేణీచ, కావేరీ ధటకే స్మృతా, వృశ్చికే తామ్రపర్ణీచ, చాపే పుష్కర వాహినీ, మకరే తుంగభద్రాచ, కుంభే సింధునదీ స్మృతా, మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మృతా పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మృతా’’ ఇది నిర్ణయ సింధు ప్రమాణం. పూర్వం తుందులుడు అనే భక్తుడు, శివుని గూర్చి ఘోర తపమాచరించి, ప్రసన్నుడిని చేసుకుని, భూమండలంలోని సమస్త తీర్థాలకు అధిపతిగా ఉండే వరం కోరాడు. శివుడు వరమొసంగి, తన రూపాలలో ఒక రూపమైన జల రూపం తుందులునికి ఇచ్చి, పుష్కరుడు అని పేరు పెట్టడం జరిగింది. బ్రహ్మ దేవుడూ, తపస్సు చేసి, పుష్కరుడిని తనకు ఇమ్మని కోరడం జరిగింది. శివుడు అంగీకరించగా, గురుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, తాను ఎక్కడ ఉంటే పుష్కరుడు అక్కడ ఉండేట్లు కోరగా, పుష్కరుడు అందుకు అంగీకరించలేదు. అయితే బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే, ఆ ప్రాంత నది యందు పుష్కరుడు ఉండాలని నిర్ణయించడం జరిగింది. అలా గురుడు రాశి మారినపుడు, సంబంధిత నదికి మొదటి పనె్నండు దినాలు పుష్కరాలుగా జరుపుకుంటారు. తామ్రపర్ణి ఒకప్పుడు శివునికి రథంగా ఉండడం వల్ల బీమరథి అని పేరు వచ్చినట్లు చెపుతారు. వాల్మీకి రామాయణం, మహాభారతంలలో తామ్రపర్ణి నది పేర్కొన బడింది. గురుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల అక్టోబర్ 12నుండి 23వరకు తామ్రపర్ణి నదికి పుష్కరాలు జరుగుతాయి. ప్రత్యేకించి ఇది పనె్నండు పుష్కరాల అనగా 144 ఏళ్ళకు రానున్న మహా పుష్కరం. ‘‘తామ్రపర్ణి’’ అంటే రాగి ఆకు అని అర్థం. నది నీరు రాగి రంగులో ఉంటాయి. నదీ తీరాన రాగిరంగు గల వృక్షాలు అధికంగా కన్పిస్తాయి. అగస్త్య పర్వతంలో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మీదుగా ప్రవహిస్తూ, సముద్రంలో కలుస్తుంది. తన తండ్రి దక్షప్రజాపతి చేసిన అవమాన భారంతో సతీదేవి (దాక్షాయణి) ఆత్మత్యాగానికి పాల్పడి, తిరిగి హిమవంతుని కూతురుగా పునర్జన్మ పొంది, పరమేశ్వరనుని వివాహమాడేందుకు పరాశక్తిని పూజించగా, పరాశక్తి సంతసించి, పార్వతికి ఒక పద్మమాలను ప్రసాదించి, ఆ మాల విశ్వానికి ప్రయోజనకారి కాలదని వరమిచ్చినట్లు పురాణ కథనం. హైమవతీ, పరమేశ్వరుల వివాహానికి, భార్య లోపముద్రతో కూడి అగస్త్య మహాముని రాగా, శివుడు అగస్త్యుని దక్షిణంవైపు రమ్మని, తమ కళ్యాణంలో ఉపయుక్తమైన పద్మమాలను అగస్త్యునికి ఒసంగగా, ఆ మాల సుందర రూపత్వాన్ని సంతరించు కోవడం, సకల దేవతలు పుష్పవర్షం కురిపించడం, ‘‘తామ్రవర్ణి’’ నామాంకితయై, శివుని ఆదేశానుసారం నదిగా రూపాంతరం చెందినట్లు పౌరాణిక కథనాలు ఉన్నాయి. అగస్త్యుడు దక్షిణ దేశ యాత్రలకై బయలు దేరాక, తనకు బహూకరింప బడిన పద్మమాలకు స్ర్తిరూపం లభింప చేసి, ‘‘తామ్రపర్ణి’’ పేరున జీవరాసులకు దాహార్తిని తీర్చాలని దీవించారు. ఫలితంగా తామ్రపర్ణి, అగస్త్య మహామునిని అనుసరిస్తూ వెళ్ళగా, మహాముని పుణ్య తీర్థాలను స్థాపిస్తూ సాగారు. ఇలా 118 పుణ్య తీర్థాలను స్థాపించినట్లు స్థల పురాణాధారం. పుష్కరాలు మహారాష్టల్రోని భీమానదికి లేదా భీమరథికియని కొందరు చెపుతుండగా, చెన్నై పట్టణానికి 625 కిలోమీటర్ల దూరాన గల తిరునవ్వేలి ప్రాంతంలో తామ్రపర్ణి సంపూర్ణంగా ఉంది కనుక పుష్కరాలు ఉన్నాయని కంచి, శృంగేరీ పీఠాథిపతులు సెలవివ్వడం జరిగింది. అక్టోబర్ 12వ తేదీ శుక్రవారం ఉదయం 6నుండి 7గంటల మధ్య శుక్రహోరా యందు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించిన అనంతరం, కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామీజీ, తామ్రపర్ణి నదీ మంగళ స్నానం ఆచరించడం ద్వారా పుష్కరాలను ప్రారంభించనున్నారు.

-సంగనభట్ల రామకిష్టయ్య....9440595494