మెయన్ ఫీచర్

సంకల్ప బలంతో జీవన సాఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్దుల్ కలాం జననం భారతదేశ భవిష్యత్తును ప్రపంచ చరిత్రలోనే నూతనాధ్యాయాన్ని సృష్టిం చేలా చేసింది. 1931, అక్టోబరు 15న జన్మించిన ఆయన ఆదర్శాలను అమలు చేయగలిగినప్పుడు ప్రతి వ్య క్తీ ఒక్కో కలాం కాగలడు. కడవరకూ జీవితాన్ని అధ్య యనం చేసిన ఆయన ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా తన కోసం ఆస్తిపాస్తులేమీ సంపాదించుకోలేదు. కేవలం మూడు ప్యాంట్లు, ఆరు షర్టులు, మూడు సూట్లు, చేతిగడియారం, 2,500 పుస్తకాలు, బెంగళూరులో చిన్న ఇల్లు.. అన్నింటికీ మించి 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలే ఆయన ఆస్తిపాస్తులు. ప్రముఖ క్షిపణి శాస్తవ్రేత్తగా, 11వ భారత రాష్టప్రతిగా ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ దేశాభివృద్ధికి ప్రముఖపాత్ర పోషించారు.
తన ఉన్నతికి కారకులైన తల్లితండ్రుల్ని, చిన్ననాటి స్నేహితుల్ని, ఉపాధ్యాయుల్ని, గురువుల్ని, సహో ద్యోగుల్ని ఆన నిరంతరం తలుచుకునేవారు. తాను నిరంత విద్యార్థినని చెప్పుకున్న అబ్దుల్ కలామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం. తన తండ్రి నిజాయితీని, ఆత్మక్రమశిక్షణని అందిపుచ్చుకున్నానని, తల్లి నుంచి మంచితనంలో నమ్మకాన్ని, సానుభూతిని అందుకు న్నానని, అవే వారు తనకిచ్చిన విలువైన ఆస్తులని గర్వంగా చెప్పుకున్నారు. చిన్ననాటి మిత్రులైన రామనాథశాస్ర్తి, అరవిందం, శివప్రకాశన్ సనాతన హిందూ కుటుంబాల నుంచి వచ్చినవారైనా, వారితో ఎలాంటి విబేధాలు ఉండేవి కాదని, ఇది తన భావి జీవితానికి పునాదిరాయి అని కలాం చెప్పేవారు. శివసుబ్రహ్మణ్యశాస్ర్తి ఉపాధ్యా యుడుగా మాత్రమే కాకుండా, సన్నిహితుడుగా తన ఇంటికి కలాంను భోజనానికి పిలిచి స్వహస్తాలతో వడ్డించేవారు.
రామేశ్వరం వదిలి రామనాథపురంలో చదువుకోవడానికి వెళ్లినపుడు- ‘‘నువ్వు పైకెదగడానికి ముందుకు పోక తప్పదని నాకు తెలుసు.. సముద్రపక్షి తనకంటూ ఒక గూడు కూడా లేకుండా సూర్యుడికి ఎదురేగడం మనం చూడట్లేదా.. నీ ఆశలు ఫలించే చోటుకి పోవాలంటే నీ బాల్య స్థలం మీద బెంగ వదులుకోక తప్పదు... నిన్ను మా ప్రేమ ఆపదు. నీకు మా అవసరాలు అడ్డు చెప్పవు’’ అన్న తండ్రిమాటలే తన జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి సోపానాలయ్యాయని కలాం గుర్తుచే సేవారు. బెంగగా ఉన్నప్పుడు, నిస్పృహకి లోనైనప్పుడు పాజిటివ్‌గా ఆలోచించి ఆయన భవిష్యత్తుని సుగమం చేసుకునేవారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు- ‘‘ఎలాగైనా విమానాలు నడపాలి.. నన్ను నేను నిల దొక్కుకునే శక్తిలేకపోయినా నా లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలని’’ అనుకున్నారు. రకరకాల వ్యక్తులతో పరిచయం పెంచుకోవలసి వచ్చింది. ఎన్నో వైఫల్యాలు, ఆశాభంగాలు, దారితప్పడాలు వచ్చాయి. అలాంటి సమ యంలో- ‘‘ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం, ప్రయోజనం శూన్యం’’- అన్న తండ్రి మాటలను పదేపదే మననం చేసుకునేవారట. నిరాశా నిస్పృహలకి ఎదురీది తన జీవన రహదారిని ఆయన సుగమం చేసుకున్నారు.
‘‘వైమానికదళం అభ్యర్థుల ఎంపికలో తొమ్మిదో స్థానంలో నిలబడినప్పుడు నిరాశని నేను హరా యించు కోలేకపోయాను. ఆ సమయంలో నేను కలిసిన స్వామి శివానంద నా అంతరంగాన్ని చదివి - కోరిక అనేది హృదయం నుంచి ఆత్మ నుంచి ఉప్పొంగినప్పుడు, అది పరిశుద్ధమూ, తీవ్రమూ అయినప్పుడు దానికొక గంభీరమైన విద్యుదయస్కాంత శక్తి వస్తుంది. మనం నిద్రలోకి జారుకున్న ప్రతిరాత్రీ ఈ శక్తి శూన్యంలోకి విడుదలవుతుంది. తిరిగి ప్రతి ఉదయమూ అది విశ్వశక్తి ప్రవాహాల బలాన్ని పుంజుకుని మన వ్యక్త స్థితిలో మనని చేరవేస్తుంది. నువ్వేది అనుకున్నావో అది తప్పక సాక్షాత్కరిస్తుంది. ఈ కాలాతీత వాగ్దానం మీద- ఓ యువకుడా.. నువవు తప్పక ఆశ పెట్టుకోవచ్చు. అనంత కాలం నుండి సూర్యోదయం కానీ, వసంతాగమనం కానీ ఎలా గతి తప్పలేదో ఈ వాగ్దానమూ అలాగే... నువవు ముందుకు సాగిపో. నువ్వేమి కావలసి ఉందో నీకు తెలియదు. నీ భవిష్యత్తువైపు సాగడానికి ఈ వైఫల్యం కూడా అవసరమే..’’ - అని చెప్పిన మాటలు నా భవిష్య త్తుకి కొత్త బాట వేశాయని కలాం ప్రపంచానికి తెలిపారు.
రాష్టప్రతి పదవిని చేపట్టినా సామాన్యుడిలాగే జీవితం గడిపిన కలామ్ లాంటి ఆదర్శనీయ వ్యక్తిని ఇంకొకరిని మనం చూడలేం. రాష్టప్రతి హోదాలో వివిధ దేశాల్లో పర్యటించినపుడు ఆయా దేశాధినేతలు ఇచ్చిన బహు మతులను తిరస్కరిస్తే వారిని అవమానపరిచినట్లు అవుతుందని, దానివల్ల తనదేశం ఎటువంటి ఇబ్బందులకి గురవకూడదని వాటిని తీసుకుని, ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటోలు తీసి, కేటలాగు తయారు చేయించి ఆర్కైవ్స్‌లో ఆయన భద్రపరచేవారు. పదవీ కాలం పూర్తయిన తర్వాత ఒక్క పెన్సిల్ కూడా ఆయన తీసుకోలేదంటే ఆశ్చర్యకరమే. 2002లో రంజాన్ సందర్భంగా రాష్టప్రతి ఇచ్చే ఇఫ్తార్ విందుకు అయ్యే ఖర్చు 22 లక్షలు ఖర్చు అవుతుందని తెలుసుకుని, శ్రీమంతులకు విందు కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరమా? ఆ సొమ్మును నిరుపేదలకు, అనాథా శ్రమాలకు ఇవ్వమని కలాం చెప్పారు. అనాథాశ్రమాలను ఎంపిక చేసే పని కొందరికి అప్పజెప్పారు తప్ప తాను జోక్యం చేసుకోలేదు. తన సంపాదనలో లక్ష రూపా యలను తన వ్యక్తిగత సహాయకుడైన నాయర్ కు ఇచ్చి, దీని గురించి ఎవరికీ చెప్పకండి అన్నారు. ఇఫ్తార్ విందు నిధులు ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్టప్రతి అబ్దుల్ కలాం. అయతే, తన మాటలకు అందరూ అంగీకారం తెలపాలనే నైజం ఆయనకు లేదు.
ఒకసారి కలాం తన బంధువులను సుమారు 50 మందిని రాష్టప్రతి భవనానికి ఆహ్వానించారు. వారికి ఢిల్లీ చూపించడానికి బస్సును బుక్ చేసి, అయిన ఖర్చును వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు. వారికోసం ఖర్చయన సుమారు రూ.2 లక్షలను తనే చెల్లించారు. దేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఇంతకు మునుపు ఎప్పుడూ జరగలేదు. రాష్టప్రతి భవన్‌ను వదిలి వెళ్ళేముందు ప్రతి వ్యక్తినీ పేరు పేరునా పలకరించారు. వ్యక్తిగత సహా యకుడు నాయర్ భార్య ఎందుకు రాలేదని అడిగి, అనారోగ్యంగా ఉందని తెలుసుకుని ఇంటికి వెళ్ళి ఆమెను పలకరించారు. ప్రపంచంలో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య అనారోగ్యంతో ఉందని తెలిసి ఇంటికి వెళ్లి పరామర్శించినట్టు చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఒక ఉద్యోగి చక్కగా పనిచెయ్యాలంటే ఏ రకంగా ప్రోత్సాహమివ్వాలో చెప్పి, ఉద్యోగుల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.
కలామ్ తన జీవితాన్ని రాకెట్‌తో పోల్చుకున్నారు. తన ఇగ్నైటెడ్ మైండ్స్ రచనల్లో ఆయన తన జీవితం నాలుగు దశల్లో సాగిందని చెప్పుకున్నారు. రాకెట్ను నిర్దేశిత గమనమార్గంలో ప్రవేశపెట్టడంలో ప్రతి దశ తరువాతి దశ కోసం తప్పుకుంటుంది. తన జీవితంలో కూడా ఒక దశ నుంచి మరొక దశకి సాగిన ప్రయాణం తన జీవితానికొక స్పష్టమైన మార్గనిర్దేశాన్ని చేస్తూ వచ్చిందని చెప్పేవారు. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషీ మానవచరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించగలడని, ఈ విష యాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రహించాని అనేవారు. యువతకు ఒక సంకల్పాన్ని కలిగించడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యంగా ఆయన భావించారు. ఆయన రాసిన ‘‘వింగ్స్ ఆఫ్ ఫైర్’’ ఎలాంటివారి జీవి తాన్నైనా ఉన్నతస్థితికి చేర్చగలిగే శక్తివంతమైన పుస్తకం. సంకల్పశక్తి అమోఘమనడానికి, ఆయన పదే పదే ఒక తుమ్మెదని ఉదాహరణగా చెప్పేవారు. ‘మనం ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాలను వర్తింపచేసి చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమనే చెప్పాలి. కానీ, తుమ్మెదలో ఎగరాలనే ఇచ్ఛ, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది సదా తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అది పదే పదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల ప్రభవించే ఉన్నత తరంగ దైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకుతోస్తాయి. అలా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి, బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల నువ్వు నిస్సందేహంగా ఎదురీదగలవు’-అనేవారు కలాం.
కలాం తను నేర్చుకున్న ప్రతి విషయాన్ని జీవితంలో అమలుచేసి ఉన్నత శిఖరాల్ని ఎలా అధిరోహించారో మనం తెలుసుకోవాలి. పాఠశాల విద్య పూర్తిచేసిన తర్వాత తన తండ్రికి అండగా ఉండాలని కలామ్ న్యూస్‌పేపర్లు పంపిణీ చేసేవారు. న్యూస్ పేపర్‌ను మడతపెట్టి మేడల మీదకి విసిరేటప్పుడే రాకెట్లని ఆకాశంలోకి పంపించే అంశంపై ఆసక్తి ఏర్పడింది. చిన్నప్పుడు సగటు మార్కులతోనే చదువు సాగించినప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు. 1958లో మద్రాస్ ఐఐటీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు. పట్ట్భద్రుడైన తర్వాత కలాం ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’ (డి.ఆర్.డి.ఒ)లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్‌ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962లో ‘ఇస్రో’లో చేరారు. అక్కడ ఆయన అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎల్‌వీ-త్రీ) అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.
రాష్టప్రతి పదవిని చేపట్టడానికి ముందు ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేశారు. భారతదేశపు ‘మిస్సైల్ మాన్’గా పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్షలలో కీలకమైన పాత్ర పోషించారు. 2002లో రాష్టప్రతి ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కలాం తన పుస్తకం ‘ఇండి యా-2020’లో భారతదేశాన్ని 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. కలాంను పద్మభూషణ్ (1981), పద్మవిభూషణ్ (1990), భారతరత్న (1997) పురస్కారాలు వరించాయి. 30 యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఇండియా- 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా, ఇండియా-మై-డ్రీం, వింగ్స్ ఆఫ్ ఫైర్.. వంటి రచనలు ఆయన కీర్తిని మరింత ఇనుమడింపచేశాయి. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా- జూలై 27, 2015న హఠాన్మరణానికి గురయ్యారు. దేశం ఒక విజ్ఞానఖనిని కోల్పోయింది.

--నాగలక్ష్మి దామరాజు nagalakshmidamaraju@gmail.com