మెయిన్ ఫీచర్

మందపాల జరితలు -- 26 (మహాభారతంలో ఉపాఖ్యానాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం మందపాలుడనే మహర్షి ఉండేవాడు. అతడు ధర్మజ్ఞుడు. కఠోర నియమాలను పాటించి, బ్రహ్మచారుల మార్గాన్ని ఆశ్రయంచి, వేదవేదాంగాలను అధ్యయనం చేస్తూ, తపస్సు చేస్తూ ఇంద్రియాలను జయంచి జీవించాడు. తపస్సు పూర్తి అయన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి పితృ లోకాలకు వెళ్ళాడు. కాని అక్కడ అతని తపస్సుకు అధ్యయనానికి తగిన ఫలితాన్ని పొందలేక పోయాడు. ఇంత తీవ్ర తపస్సు చేసినా ఉత్తమ లోకాలు ప్రాప్తించకపోవటంతో ఆ మహర్షి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న దేవతలను ఇలా అడిగాడు. ‘‘నేను తపస్సు చేసి సాధించుకున్న లోకాలు ఏ కారణంచేత మాయమయ్యాయ? నేను ఎన్నో సత్కర్మలను, తీవ్ర తపస్సును చేశాను. అయనా ఎందుకు దానికి తగినంత ఫలితాన్ని పొందటం లేదు? మీరు నేను ఏ కర్మ లోపం చేశానో చెపితే ఆ కర్మను ఆచరిస్తాను. ఆ సత్కర్మను నాకు ఉపదేశించండి’’.
దేవతలు ఇలా అన్నారు ‘‘విప్రోత్తమా! మానవులు ఋణగ్రస్తులవటం చేత ఈ భూమి మీద పుడతారు. యజ్ఞ కర్మలు, బ్రహ్మ చర్యం, సంతానం ఈ మూడింటి వలన ఆ ఋణాలు తీరిపోతాయ నీవు తాపసివి. యజ్ఞ కర్తవు అయ్యావు. కాని సంతానం నీవు పొందలేదు. సంతానం లేకపోవడం వలన ఆ కర్మలచే పొందబడే లోకాలు మూసివేయబడ్డాయ. కనుక నీవు ముందు సంతానాన్ని కని, తర్వాత భోగాలను అనుభవించు. పుత్రుడు అంటే తండ్రిని పున్నామ నరకం నించి తప్పించువాడు అని అర్థం. కనుక నీవు సంతానం కోసం ప్రయత్నించు.
దేవతల సలహా విన్న మందపాలుడు ‘‘శీఘ్రంగా సంతానం ఎవరి వలన కలుగునా! అని ఆలోచించి శీఘ్రంగా ఎక్కువ సంతానాన్ని ఇచ్చేవి పక్షులు అని తెలిసుకొని జరిత అనే శారికతో అదే శారిక రూపం ధరించి సంబంధం పెట్టుకున్నాడు. ఆమె యందు సంస్కారంచే బ్రహ్మవాదులైన నలుగురు పక్షి కుమారులను జన్మింపచేశాడు. వారు అండదశలో ఉన్నప్పుడే వారిని తల్లి దగ్గర విడిచి లిపిత అనే పక్షి దగ్గరకు చేరాడు. ఇది చూసి జరిత చాలా చింతించింది. కాని తన అండాలలో ఉన్న పిల్లలను విడువ లేక అక్కడే ఆ ఖాండవ వనంలోనే ఉండిపోయంది. ఆ వనంలోనే లిపితతో విహరిస్తున్న మందపాలుని చూచి దుఃఖించింది. కొంతకాలానికి గ్రుడ్ల నించి పైకివచ్చిన పిల్లలను పెంచి పోషించసాగింది.
కొంత కాలానికి ఆ ఖాండవ వనాన్ని అగ్నిదేవుడు కృష్ణార్జునుల సహాయంతో దహించసాగాడు. అప్పుడు అక్కడ లిపితతో విహరిస్తున్న మందపాలుడు అగ్నిదేవునితో తన పుత్రులను రక్షింపుమని ప్రార్థించాడు. అతడు అగ్నిని ఇలా ప్రార్థించాడు. ‘‘దేవా! నీవు సర్వలోకాలకీ ముఖ స్వరూపుడివి. దేవతలకు యజ్ఞాలలో హవిస్సులను అందిస్తావు. నిన్ను దివ్య, భౌమ జఠర అనల రూపంగల త్రివిధ మ్మర్తిగా కొలుస్తారు. నిన్ను యజ్ఞ వాహనునిగా కీర్తిస్తారు. నీవు లేకపోతే లోకం అంతా నశించిపోతుంది. నీనుంచే ఈ జగత్తు అంతా పుట్టింది. హవ్య కావ్యాలు నీ యందు స్థిరంగా ప్రతిష్టించబడ్డాయ. దేవతలంతా నీ రూపాలే’’.
మంద పాలుడు ఈ విధంగా స్తుతించడంతో తృప్తిచెందిన అగ్ని అతని పట్ల ప్రసన్నుడై ‘‘ఏమి కావాలో కోరుకో’ మన్నాడు. అప్పుడు మందపాలుడు ‘ఖాండవ దహనం చేస్తున్న సమయంలో నా పుత్రులను విడిచి పెట్టు’ అని అగ్నిని అర్థించగా అతను అట్లే చేతునని మాట ఇచ్చాడు. అగ్ని ఇలా ఖాండవ వనాన్ని దహిస్తూ ఉండగా పక్షి పిల్లలు తమను రక్షించేవారు ఎవరూ లేనందున ఎంతో దుఃఖించాయ. వారి గురించి చింతిస్తూ తల్లిపక్షి జరిత విలపించి ఇలా అన్నది.
‘‘్భయంకరుడైన అగ్ని వనాన్ని దహిస్తూ ఇటువైపే వస్తున్నాడు. అతడు ఈ వనం అంతా బూడిద చేస్తాడు. ఈ చిన్నచిన్న పిల్లలకు ఇంకా రెక్కలు కూడా సరిగ్గా రాలేదు. వీళ్ళకు తల్లిని నేనే దిక్కు. నేను ఈ పిల్లల్ని అందర్నీ తీసుకొని ఎగురలేను. వీరిని విడిచిపోలేను. నేను ఏ పిల్లను విడిచిపెట్టగలను. ఎవరిని తీసుకొని ఎగరాలి. నాకు ఏమీ స్ఫురించడం లేదు. కనుక ఓ మానుల్లారా! మీరే ఏదో ఒక మార్గం చూపండి. నా రెక్కలతో మిమ్మల్ని కప్పుతాను. అందరం అగ్నిలోపడి మరణిద్దాం. కుమారులారా! నిర్ధయుడైన మీ తండ్రి మిమ్మల్ని అనాధల్లాగ వదిలివెళ్ళిపోయాడు. మీలో జరితారి అందరికన్న జ్యేష్ఠుడు. కనుక కుల రక్షణ భారం అతని పైన ఉంది. సారిసృక్కుడు రెండవ వాడు పితృదేవతల కుల వృద్ధి ఇతని వలన జరుగును. మూడవవాడు అయన స్తంబమిత్రుడు తపస్సు చేస్తాడు. ద్రోణుడు బ్రహ్మవాదులలో శ్రేష్ఠుడు. నా మీద పెద్ద ఆపద వచ్చిపడింది. మీ నలుగురిలో ఎవరిని తీసుకొని ఎగిరిబయటపడాలి? ఏం చేస్తే పని జరుగుతుంది? ఈ ఆపద గట్టెక్కుతుంది.
ఈ విధంగా భయపడుతున్న జరితను చూచి పిల్లలు ఇలా అన్నారు.... ‘‘తల్లీ నువ్వు మాపై ప్రేమను వదిలిపెట్టి ఈ అగ్ని దహించని చోటికి వెంటనే వెళ్ళిపో. మేము అగ్నిలో దహించుకుపోయ నా ఏమీ నష్టం లేదు. నీకు మళ్ళీ పిల్లలు కలగడానికి అవకాశం ఉంది. అదే నీవు నశిస్తే కులపరంపర మిగలదు. కనుక ఈ రెండు పక్షాలు బాగుగా ఆలోచించి మన కులానికి ఏది శ్రేయస్కరమో ఆ పని నీవు చేయవలసింది. నీవు మాపై పుత్రప్రేమ విడిచిపెట్టు. లేకపోతే ఈ అగ్నిలో పడి అందరం దహింపబడతాం. మా తండ్రి ఉత్తమ లోకాలని కాంక్షి ంచే మమ్మల్ని కన్నాడు. ఆ మా తండ్రి సత్కర్మ వ్యర్థం అవకూడదు’’.

(ఇంకావుంది)