మెయిన్ ఫీచర్

సాగరకన్యల సాహస వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర జలాల్లో చకచకా ముందుకు దూసుకుపోయేవారు మత్స్యకన్యలు కారు. అలాగని వారు స్కూబా డైవింగ్ హాబీగా కలిగిన ప్రొఫెషనల్స్ కూడా కారు. వాళ్లను మించిన నైపుణ్యంతో సముద్రపు లోతుల్లో వేటాడే హాన్యోలు దక్షిణ కొరియాలోని బేజు ద్వీపంలోని మహిళలు. పదిహేనేళ్ల బాలిక నుంచి ఎనభై ఏళ్ల బామ్మవరకు చేపవలే వేగంగా, చాకచక్యంగా సముద్రపు లోతులకు చేరుకుంటారు. అక్కడ లభించే సముద్ర సంపదను తెచ్చుకుని పంచుకుంటారు. స్కూబా డైవింగ్‌కి కావలసిన ఎలాంటి పరికరాలు అంతగా ఉపయోగించకుండానే సముద్రం లోపలికి సాగిపోవడం వీరి ప్రత్యేకత. ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చాకచక్యంగా ఈదగల ఫ్రీ డైవర్లుగా వీరికి పేరుంది. వీరు వేటాడే విధానం కూడా ప్రమాదంతో కూడుకున్నది. ఆక్సిజన్ మాస్క్స్ లాంటి ఎలాంటి వనరు లేకుండానే, కేవలం తలకు ధరించే ఒక పాతకాలపు లైట్ మాస్క్‌ను ముఖానికి ధరించి, ఊపిరి బిగపట్టి సముద్రంలో 30 మీటర్ల లోతులవరకు అవలీలగా చేరుకోవడం వీరి ప్రత్యేకత. ఇప్పుడు మాత్రం డైవింగ్ కావలసిన కొన్ని పరికరాలను అది కూడా తగు మాత్రంగానే ఉపయోగిస్తూ వేటాడుతున్నారు. గుంపులుగా వీరు వేటకు వెళతారు. అతివల సామర్థ్యం రుజువైందిలా...
వందల ఏళ్ల చరిత్ర వీరి స్వంతం. నిజానికి వందల ఏళ్ల క్రితం ఈ సముద్ర జీవులు, ముత్యాల వేటను ఇక్కడ పురుషులే చేసేవారట. అయితే అప్పట్లో ఆ ప్రాంతంలో యుద్ధ భీభత్సత ఎక్కువగా ఉండడంతో పురుషులు తప్పనిసరిగా యుద్ధంలోకి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. దానికితోడు సముద్రపు లోతుల్లోకి వేటకు వెళ్లిన సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో చాలామంది పురుషులు మరణించారు. అప్పట్లో ఆ ప్రాంత పాలకులు పన్నులు అధికంగా వేయడం, వాటిని చెల్లించడానికి అధిక సంపాదన కోసం పురుషులతోపాటు స్ర్తిలు కూడా ఈ వేటలోకి దిగడం.. ఇలా వివిధ కారణాలతో మహిళలు ఈ వృత్తిని చేపట్టడం జరిగిందట. అలా ప్రారంభమైన ఈ వేటలో మహిళలు ఎంతగా ముందుకు వెళ్లిపోయారంటే ఇపుడు పురుషులను కూడా వెనక్కునెట్టి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఈ ప్రాంతాల్లో మాతృస్వామిక వ్యవస్థను స్థిరపరిచారట. వారి భాషలో హాన్యో అంటే సముద్ర మహిళ అని అర్థమట.
ఇంతకీ సముద్ర లోతుల్లో
వీరేం చేస్తారు?
సముద్రపు ఆహారాన్ని అంటే.. ఆ ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఆహారంగా పరిగణించే పీతలు, ఆక్టోపస్, షెల్‌ఫిష్, ఆరుస్టర్, ముఖ్యంగా ముత్యాల్ని సేకరిస్తారు.
పితృస్వామ్యం నుంచి మాతృస్వామ్యం దిశగా..
పురుషాధిపత్యం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో జేజు ద్వీపంలో మాత్రం మహిళల ఆధిపత్యమే కొనసాగుతుంది. దీనికంతకూ కారణం సముద్రపు వేటలో వీరు సాధించిన తిరుగులేని ఆధిపత్యం, ఆర్జించిన ఆర్థిక స్వావలంబనే కారణంగా చెప్తారు. ఈ కారణంగా చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఈ మహిళలకు ఎంతో గౌరవ, మర్యాదలు లభిస్తాయట. మిగిలిన సమాజాన్ని భిన్నంగా ఇక్కడ మగ బిడ్డకంటే ఆడబిడ్డ జన్మిస్తేనే ఎక్కువగా సంబరాలు చేసుకుంటారు. ఆడపిల్లలకు ఎదురు కట్నాలిచ్చి మరీ వివాహం చేసుకుంటారు. ఇక్కడంతా మహిళలదే రాజ్యమని చెప్పాలి. ఈ దీవిలోని కొన్ని ప్రాంతాల్లో అయితే మగవారు కేవలం ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల్ని చూసుకోవడానికే పరిమితమవడం కూడా కనబడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
కనుమరుగవ్వబోతున్న హాన్యోలు
ప్రారంభంలో మగవారినే తోసిరాజని తమ సంఖ్యను పెంచుకున్న హాన్యోలు అంటే సముద్ర మహిళలు రాను రాను తగ్గిపోతూ కొనే్నళ్లకు పూర్తిగా కనబడని స్థితి ఏర్పడుతోందట. ఈ వృత్తిలో ఉండే ప్రమాదాల కారణంగా సీనియర్ హాన్యోలు తమ కుమార్తెలను వేటలోకి రానివ్వకపోవడం, ఈ వృత్తిలో రాన్రాను తగ్గుతున్న ఆదాయం, పట్టణవాసంపై వ్యామోహం, పట్టణాలకు వలసపోవడం వంటి కారణాలతో ఈ వేటలోకి వచ్చే ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోతోందట. ప్రారంభంలో దాదాపు అరవై వేల మంది హాన్యోలు ఉండగా ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం అయిదువేలకు చేరుకుందని తెలుస్తోంది.

-గాయత్రి