Others

చైతన్యానికి అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
అనువాదం: భరత్
*
ఎంత నేరంచేసినా ఎప్పుడో అరవై సంవత్సరాల వయసుమీరిన తరువాత వచ్చే మరణంకోసం యావజ్జీవ కారాగారశిక్ష విధించి అలా హింసించడం అమానుషమని, చేసిన నేరానికి అనుభవిస్తున్న శిక్షకు మధ్య సమతుల్యత లేదని, అది పగతో ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా ఉంది కానీ, శిక్ష విధించినట్లుగా లేదని భావించిన ఫ్రెంచి విప్లవకారులు ముందుగా వారందరినీ విడుదల చేసేందుకు జైలు తలుపులు తెరిచి, వారి సంకెళ్ళను తొలగించారు.
కానీ, ఆశ్చర్యమేమంటే, అందులోంచి బయటపడేందుకు ఎవరూ సిద్ధంగాలేరు. ఎందుకంటే, అంతకాలం చీకటి గదిలో మగ్గినవారి కళ్ళు సూర్యకాంతిని భరించలేవు. పైగా, దాదాపు వారి జీవితమంతా అక్కడే గడిచింది. అందుకే వారందరూ విప్లవకారులతో ‘‘ఇంతకాలం తరువాత మా కుటుంబాలు, ఆస్తులు ఏమయ్యాయో, స్నేహితులు ఏమయ్యారో ఎలా తెలుస్తుంది? ప్రపంచమంతా పూర్తిగా మారిపోయే ఉంటుంది.
ఇప్పుడు మేము బయటకువెళ్ళి, ఏం చెయ్యగలం? పైగా, నేరస్థులమని ముద్రపడిన మాకు ఎవరు పని ఇస్తారు, ఎవరు తిండి పెడతారు? ఇక్కడ కనీసం మాకు భోజనం దొరుకుతుంది. ఆ చీకటి గదిలో ఎలాగో జీవితాన్ని ముగిస్తాం’’అన్నారు.
వారి వాదనలో అర్థముంది. కానీ, విప్లవకారులు వారిని బలవంతంగా జైలునుంచి గెంటేశారు. అయినా ఆ రాత్రి వారు వెనక్కివచ్చి ఆ విప్లవకారులతో ‘‘మాకు సంకెళ్ళువేసి చీకటిగదిలో బంధించండి. అక్కడే మాకు నిద్రపడుతుంది. ఎందుకంటే, ఆ సంకెళ్ళు మా శరీరంలో భాగమయ్యాయి. అవి లేకుండా మేముండలేము. మేము బలహీనులం. దయచేసి మీ ప్రతాపం మాపై చూపకండి’’అన్నారు. విప్లవకారులకు మతిపోయింది. ఈ సంఘటన ‘‘దేనినుంచో లభించి స్వేచ్ఛ’’ ఒక ఆశీర్వాదంగా మారవలసిన అవసరం ఏమాత్రంలేదని స్పష్టం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే, బ్రిటిష్, స్పేనిష్, పోర్చుగీస్ సామ్రాజ్యాల ఆధిపత్యంనుంచి అనేక దేశాలు స్వేచ్ఛ పొందినట్లు మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ, వాటి పరిస్థితి బానిసత్వంలో మగ్గిన దానికన్నా మరింత దయనీయంగా తయారైంది. బానిసత్వంలో ఉన్నప్పుడు వాటి ఆశలు అడుగంటినా, దానికి అలవాటుపడిన ఆ దేశాలు అదే అదృష్టంగా భావించాయి. కాబట్టి, బానిసత్వంనుంచి లభించిన స్వేచ్ఛ ఎప్పుడూ గందరగోళానే్న సృష్టిస్తుంది.
మా కుటుంబ సభ్యులందరూ భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలులోమగ్గిన మంచి విప్లవకారులే. జైలులో ఉండగా వారు విప్లవ నాయకులందరితో సంప్రదించి తమ జీవితాలను విప్లవానికి అంకితమిచ్చినవారే.
అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి. అయినా నేను నా తండ్రితో, మామయ్యలతో ‘‘మానవత్వాన్ని కించరుస్తూ, మనిషి గౌరవాన్ని, ప్రతిష్ఠను, మానవతా విలువలను మంటగలిపే బానిసత్వం ఎంత అసహ్యకరమైనదో నేను అర్థంచేసుకోగలను. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే. కానీ, మీకు స్వేచ్ఛ లభిస్తే ఏం చేస్తారనేదే నా ప్రశ్న. దేనినుంచో లభించే స్వేచ్ఛ ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తోంది. నేను దానికి వ్యతిరేకిని కాను. కానీ, అది లభిస్తే మీరేం చేస్తారనేది నాకు స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే, బానిసత్వంలో ఎలా జీవించాలో మీకు తెలుసు.
కానీ, స్వేచ్ఛలో ఎలా జీవించాలో మీకు తెలుసా? బానిసత్వంలో జీవించేటప్పుడు చెప్పిన మాట వినకపోయినా, చెప్పిన పని చెయ్యకపోయినా మిమ్మల్ని చంపేస్తారు. కానీ, స్వేచ్ఛలో జీవించేటప్పుడు ఆదేశాల నిర్వహణ బాధ్యత పూర్తిగామీదే అవుతుంది. అందువల్ల ఎవరూ మిమ్మల్ని చంపరు, బాధ్యత వహించరు. స్వతంత్రమెందుకని మీరెప్పుడైనా మీ నాయకులను అడిగారా?’’ అని వాదించేవాడిని.
కానీ, వారినుంచి నాకు సరియైన సమాధానం రాకపోగా ‘‘ప్రస్తుతం బానిసత్వంనుంచి బయటపడే పనిలో ఉన్నాం. స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలో తరువాత ఆలోచిస్తాం’’ అనేవారు.
వెంటనే నేను ‘‘మీ ఆలోచన ఏమాత్రం శాస్ర్తియంగా లేదు. కొత్త ఇల్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే పాత ఇల్లు కూల్చాలి. లేకపోతే, నిలువ నీడలేక మీరు వీధినపడతారు.

ఇంకావుంది...
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.