మెయిన్ ఫీచర్

నరక బాధ నివారిణి నరక చతుర్దశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతుర్దశి నాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమ తర్పణం వల్ల మానవులు తమకు నరకబాధలు లేకుండా చేసుకుంటారో దానిని ‘‘నరక చతుర్దశి’’ అంటారు. నరక చతుర్దశి ‘ప్రేత చతుర్దశి’ అని పర్యాయనామం కలిగి, ఈనాడు నరక ముక్తి కోసం యమ ధర్మరాజును ఉద్దేశించి దీప దానం చేయాలని వ్రత చూడామణి చెపుతున్నది. గుజరాతీయులు నరక చతుర్దశిని ‘‘కాలచౌదశ్’’ అంటారు. సంస్కృతంలో ‘‘కాళ చతుర్దశి’’. నరకలోక వాసులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించ చేసే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే కార్యకలాప దినమని, నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘‘చతుర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం. చీకటి ఉండగా స్నానం చేయనివారు నరకకూపంలో పడతారని, అందుకే తెలవారకుండా ఈరోజు అభ్యంగన స్నానం చేయాలని నిర్దేశం. ప్రతీమాసంలోనూ బహుళ చతుర్దశి మాస శివరాత్రి. ఆనాడు కాని, మరునాడు కాని తెల్లవారకుండా అభ్యంగన స్నానం చేయకూడదనే నిషేధం హిందూ సమాజంలో ఉంది. అయితే ఆశ్వయుజ బహుళ చతుర్దశికి అమావాస్య లేదు. పైగా ఈనాడు అభ్యంగన స్నానం విధిగా చేయాలని వ్రత చూడామణి మున్నగు గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. స్నానం చేస్తుండగా తలచుట్టూ దీపం తిప్పడం, టపాసులు కాల్చడం ముఖ్య ఆచారం. వధకు పూర్వం నరకాసురుడు శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడని తెలుసుకుని, పరమాత్ముని క్షమాభిక్ష కోరాడు. ఆ పరంధాముడు మన్నించాడు. క్షమాభిక్ష కారణంగానే నరకుడు తనకూ, తన మరణ దినం నాడు స్నానం చేసే వారికీ పాప విముక్తి సంపాదించుకున్నాడు. వేకువ జామునే తైలాభ్యంగన స్నానం చేసి, యమ తర్పణం చేసే వారికి యమ దర్శనం లేదని శాస్త్రం వివరిస్తున్నది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్దశి తిథుల మధ్య కాలంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ దినాన పండువ జరుపుకోవడం ఆచారమైనది.
స్నాన సమయం
బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది గడియలకు అవుతుంది. అప్పటికి ఒక గంట మాత్రమే రాత్రి మిగిలి ఉంటుంది. చంద్రుడు ఉండగానే తెల్లవారుజామున తలంటి పోసుకోవాలి. తిలతైలంలో లక్ష్మీదేవి ఉంటుందనే భావనతో చతుర్దశినాడు నువ్వుల నూనెతో తలంటుకోవడం సంప్రదాయం.
స్నాన జలం
ఈనాడు జలమందు గంగాదేవి కళలు సమాహితమై ఉంటాయని శాస్త్ర వచనం. అభ్యంగన స్నానమునకు వలయు నీటిని పూర్వదిన రాత్రియందే పాత్రలందు నింపి, ఆ నీటిలోనికి జలాధి దేవతను ఆహ్వానించి, సకల మహానదీ దివ్య తీర్థ సాన్నిద్ధ్యమును కలుగజేసి, పూజించి, ఆ నీటినే ఉదయాత్పూర్వము స్నానమాచరించాలని వివరించబడింది.
ఇతర విధులు
స్నాన సందర్భంలో మరికొన్ని విధులు నిర్దేశితాలు. స్నానానికి ఉత్తరేణి, తుమ్మి, తగిరిస చెట్ల కొమ్మలతో కలియబెట్టి, కదిపిన జలంలో విద్యుత్ ఉత్పాదనం అవుతుంది కనుక ఓషధుల సమ్మిళితమైన సదరు నీరు ఆరోగ్యకరం కనుక అలా వినియోగించాలి. నరకబాధ తప్పించేందుకు ఉత్తరేణి ఆకులను తలపై ఉంచుకుని, దక్షిణాభిముఖంగా కూర్చుని, 14నామాలతో యమధర్మరాజుకు తర్పణం చేయాలి. ఈదినం తిలలతో చేసిన పిండి వంటలను తప్పక తినాలి. ప్రదోష కాలమందు దీప దానం చేయాలి. దేవాలయాలలో, మఠాలలో దీప పంక్తులుంచాలి.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494