మెయిన్ ఫీచర్

సామర్థ్యమే మేలు ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు నాలుగువందల సంవత్సరాల బానిసత్వంలో మగ్గినప్పుడు కూడా ఎవరూ అంత యాతన పడలేదు. కానీ, స్వతంత్రమొచ్చిన కొన్ని దశాబ్దాలలోనే ఆ దేశాల పరిస్థితి అంత దారుణంగా తయారవడం అందరికీ ఆశ్చర్యం కలిగించడమేకాక, అసలు ‘‘స్వతంత్ర పోరాటం ఎందుకు చేసామా?’’అని వారికి అనిపిస్తోంది. ఒకవేళ అదే ‘స్వేచ్ఛ’అయితే, బానిసత్వమే అంతకన్నా మెరుగైనది.
నిజానికి, బానిసత్వం ఎప్పటికీ మంచిది కాదు. కానీ, ‘‘స్వతంత్ర పోరాటం’’ పేరుతో వారు సాధించినది కేవలం ‘‘సగం స్వేచ్ఛ’’ మాత్రమే అని వారు తెలుసుకోలేక పోతున్నారు. మిగిలిన సగం స్వేచ్చను మనం సాధించగలం. కానీ, అలాంటి విప్లవకారులతో మాత్రం కాదు. దానిని సాధించేందుకు ప్రత్యేకమైన తెలివితేటలతో కూడిన జ్ఞానం అవసరం. అంతేకానీ, హత్యలు, బాంబుదాడులు చేసిన నాశనకారకులైన విప్లవకారులు ఇప్పుడు మనకు అవసరం లేదు.
విప్లవాలు చాలావరకు జీవశక్తి తప్ప జీవితానుభవం ఏమాత్రం లేని యువకులు, విద్యార్థుల నాయకత్వంలోనే నడిచాయి. స్వతంత్రమొస్తే హాయిగా, స్వేచ్ఛగా ఉండొచ్చనే కాల్పనిక భావన వారిలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, తమ శక్తిని ఎలా వినియోగించాలో కూడా వారికి తెలియదు. అందుకే వారు పెత్తందార్లను, రాజకీయ నాయకులు మారణాయుధాలతో మట్టుపెట్టిన ఆనందంలో జైలుపాలయ్యారు. విప్లవం విజయవంతమై అధికారం దక్కడంతో దేశాలు కూడా తాత్కాలికంగా ఆనందించాయి. కానీ, ఆ అధికారంకోసం అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇదంతా జైలునుంచి విడుదలైన యువకులు, విద్యార్థుల కంటబడడంతో తమ శక్తిని ఎలా వినియోగించాలో తమకు తెలియలేదని వారు బాధపడ్డారు.
విప్లవం ఎప్పుడూ ఒక రకమైన వ్యక్తుల ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అందుకే అధికారం ఎప్పుడూ వారికే దక్కుతుంది. అదెప్పుడూ అంతే. అదే విప్లవానికున్న అసలు సమస్య. అధికార వ్యామోహం మనిషి బలహీనత కాబట్టి, విప్లవకారులు తమకు దక్కిన అధికారాన్ని ఇతరులకు ఇచ్చేందుకు ఇష్టపడరు. కానీ, అది వారి చేతుల్లో ఉండకూడదు. సృజనాత్మకమైన తెలివితేటలతో కూడిన విజ్ఞానవంతులకు అధికారమిస్తే దేశానికి అన్నిరకాలుగా మేలు జరుగుతుంది. ఎందుకంటే, వారు అన్ని రకాలుగా నూతన సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు అందేలా చేసి, ప్రపంచ పెట్టుబడుల ప్రవాహం దేశంలోకి ప్రవేశించేందుకు ద్వారాలు తెరుస్తారు. కానీ, దీనికి వ్యతిరేకంగానే అంతా జరిగింది భారతదేశంలో. అందుకే దేశంలో రోజురోజుకి క్షీణించడం ప్రారంభించింది. అసమర్థుల చేతిలో అధికారం ఉండడమే అందుకు కారణమని చెప్పగల మగాడు ఒక్కడూ లేడు.
విప్లవకారులకు అనేక బహుమతులిచ్చి గౌరవించండి. సువర్ణాక్షరాలతో లిఖించిన బంగారు పతకాలిచ్చి సన్మానించండి, అంతేకానీ, అధికారాన్ని ఎప్పటికీ వారి చేతుల్లో పెట్టకండి. అన్ని విప్లవాల ఘోర వైఫల్యాల పరిస్థితులను గమినించిన తరువాతే నేను వ్యక్తిగతమైన తిరుగుబాటు గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకంటే, అటువంటి వ్యక్తి ఎటువంటి ఎంపిక లేని తన ఎరుకలో వినాశకర, సృజనాత్మక శక్తులను ఒకటిగా సమన్వయం చెయ్యగల సామర్థ్యం కలిగి ఉంటాడు. ఒకవేళ అనేక మంది అతనిలా నూతన మానవునిగా పరిణామం చెంది, స్వీయ నిబద్ధీకరణలను వ్యతిరేకిస్తూ, ఎవరికీ వ్యతిరేకంకాకుండా తిరుగుబాటు చెయ్యగలిగితే సమస్యను పరిష్కరించడం పెద్ద కష్టమేమీకాదు. విప్లవాలకు కాలం చెల్లాలి.
ఘర్షణలు, పోరాటాల ద్వారా ప్రపంచ పరిస్థితిని రూపుమాపగలరని మీరు భావిస్తున్నారా? మీరు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వారిలాగే మీరుకూడా తయారవుతారనేది జీవిత సత్యం. కాబట్టి, చాలాజాగ్రత్తగా మీరు మీ శత్రువులను తెలుసుకోవాలి. ఎందుకంటే, మీరు వారితో పోరాడవలసి వస్తుంది. అప్పుడు మీరుకూడా వారిలాగే ఎత్తుకు పై ఎత్తులు వెయ్యాలి.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్