మెయిన్ ఫీచర్

రోబోటిక్ బాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యాంత్రిక యుగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు ‘బహువిధి / మల్టీటాస్కింగ్ / సృజనాత్మకత / క్రియేటివిటీ’. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా ఈ నైపుణ్యాలు చాలా కీలకం అయినాయి. కానీ నేటికాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చదువుల వరకే పరిమితం చేసి ఇంజనీర్‌గానో, డాక్టర్‌గానో చేస్తే చాలని అనుకుంటున్నారు. ఇందువల్ల భవిష్యత్తులో ఈ పిల్లలు ఇబ్బందులను ఎదుర్కొనే శక్తీ కోల్పోతున్నారు.
బోడుప్పలో నివశించే తొమ్మిదో తరగతి చదువుతున్న నకుల్ వర్షిత్ ఇందుకు భిన్నంగా పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ సమయపాలనకి, పట్టుదలకు, లక్ష్యాలను చేధించడానికి అలవాటుపడి అందరి పిల్లలకూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బుడిబుడి వయసు నుంచీ స్కేటింగ్‌ను సరదాగా ప్రారంభించి నేడు రాష్ట్ర స్థాయిలో మెరిసి, జాతీయస్థాయిలో తన సత్తా చూపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. లండన్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ నుంచి గ్రేడ్ - 2 పరీక్షలు డిస్టింక్షన్ మార్కులతో ఉత్తీర్ణుడై తదుపరి పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి నుండి హిందీలో విశారద పూర్తిచేసి భాషా ప్రవీణ దిశగా పయనిస్తున్నాడు.
చాలామంది పిల్లలు ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వారిలో నేర్చుకునేటప్పుడు ముందు వున్న ఉత్సాహం, ఆసక్తి ఉండదు. లేదా అసంపూర్తిగా వదిలేస్తారు. కానీ నకుల్ వర్షిత్ బాల్యాన్ని ఆస్వాదిస్తూనే, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చకచకా ముందుకు సాగిపోతున్నాడు. ప్రతి వేసవి సెలవుల్లో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం.. తరువాత అందులో పరిణితి సాధించేవరకు పోరాడటం.. వర్షిత్ నైజం. ఉదాహరణకి వేసవి సెలవుల్లో పొట్టిశ్రీరాములు యూనివర్శిటీలో ఇంద్రజాలం నేర్చుకుని, ఇప్పటికి పది రంగస్థల ప్రదర్శనలు ఇచ్చి బాల ఇంద్రజాలికుడు అనిపించుకున్నాడు. ఇలాగే ఒక వేసవి సెలవుల్లో చెస్ నేర్చుకుని, నిరంతర సాధన చేస్తూ వివిధ పోటీల్లో బహుమతులు సాధించి చెస్ ఫైడ్ రేటింగ్ కొరకు మరింత సాధన చేస్తున్నాడు. ఒక వేసవి సెలవుల్లో డాన్స్, నటన నేర్చుకుని వివో ఐపీ యల్ పాటకు డాన్స్ కట్టి యూట్యూబ్‌లో వాహ్ అనిపించుకున్నాడు. మనవాడు కొన్ని యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌లోనూ నటించి ఔరా అనిపించుకున్నాడు.
మహాకవి వేమన చెప్పినట్టు ‘సాధనమున పనులు సమకూరు ధరలోన..’ అన్నట్లు శ్రద్ధ, సాధన, పట్టుదల ఉంటే లక్షసాధన అనేది సాధ్యం అని నిరూపిస్తున్నాడు నకుల వర్షిత్. సారధి స్కూల్లో చదువుతున్న వర్షిత్‌కి ఏడో తరగతి నుండి తాను కూడా స్కూల్ కాబినెట్‌లో చోటు సంపాదించాలన్న కోరిక ఉండేది. దాన్ని లక్ష్యంగా చేసుకుని నేడు తొమ్మిదో తరగతిలో టాప్ త్రీలో ఒకడిగా మిగిలాడు. వర్షిత్‌లోని ప్రతిభను గుర్తించిన స్కూల్ యాజమాన్యంవారు అతనిని సహాయ సాంస్కృతిక కార్యదర్శిని చెయ్యటమే కాకుండా, పాఠశాల కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా నియమించారు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇన్ని విద్యలు ఎలా నేర్పగలిగారు అని వాళ్ళ అమ్మ లావణ్యని అడిగితే ‘వాడి పట్టుదలకు, లక్ష్యసాధనకి మేం ఫిదా అయిపోయాం’ అని నవ్వుతుంది. హైదరాబాద్ సిటీకి దూరంగా ఉన్నా, చిన్నప్పటి నుండి ద్విచక్ర వాహనంపై ఉదయం నాలుగు గంటలకి సాధనాలకు తీసుకువెళ్లడం ఆమెకి ఇప్పుడు సాధారణం అయిపోయింది.
ఇటీవలే నేషనల్ ఇన్నొవేటివ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఇగ్నైట్ 2018 పోటీలకు, తన మూడు సృజనాత్మక ప్రతిపాదనలు పంపాడు. అందులో విజయం సాధించాక పోయిన 2019 పోటీలలో విజయం సాధించి రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.
పిల్లలకు ఇన్ని నేర్పాలంటే అది ఒక్క ధనవంతులకు మాత్రమే సాధ్యం అనుకుంటే అది అక్షరాలా పొరబాటే.. వర్షిత్ తండ్రి బాలకృష్ణ ఓ ప్రైవేటు కంపెనీలో సాధారణ ఉద్యోగి. ‘డబ్బుల కంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు తమ కాలాన్ని కొంతైనా పిల్లలకు పంచడమే కాకుండా తమ వినోదాలను తగ్గిస్తే ప్రతి ఇంట్లో ఇలాంటి రోబోటిక్ పిల్లలు ఉంటారు’ అంటారు బాలకృష్ణ. వర్షిత్‌ని ఇన్ని విషయాలు ఎలా నేర్చుకుంటావు అంటే ‘ ఇష్టంగా నేర్చుకున్నది ఏదీ కష్టం కాదు. అయినా నేను పెద్దయ్యాక రోబోటిక్ ఇంజనీర్ అవుదామనుకుంటున్నాను. మరి ఇలాంటివన్నీ ముందుగానే నేర్చుకోవాలి కదా’ అంటాడు అమాయకంగా. వర్షిత్ అమ్మ లావణ్య మాట్లాడుతూ ‘పిల్లలకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చిన్నప్పటి నుండి అలవాటు చెయ్యాలి. ఇన్ని నేర్చుకుని ప్రతీ దాంట్లో విజయం సాధించాలనుకున్న వర్షిత్‌కి, జీవితంలోనూ పోటీ పడాలన్న సత్యం అర్థమవడమేకాక గెలుపోటములకు అతీతంగా ప్రతి అడుగూ ఓ సంఘర్షనే అన్న నిజం స్వీయ అనుభవాలతో తెలుసుకున్నాడు’ అంటుంది.
వర్షిత్‌ను ముందు ముందు ప్రణాళికలు ఏమిటి అంటే ‘2019 బాలల దినోత్సవం నాటికి స్కూల్లో టాప్ 3 నుండి నెంబర్ వన్ స్థానాన్ని పొందడం, కీబోర్డ్ నందు గ్రాడ్ 5 పూర్తిచేయడం, స్కేటింగ్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం, చెస్‌లో ఫైడ్ ర్యాంకింగ్ పొందడం, హిందీలో ‘్భషాప్రవీణ’ పూర్తిచేసి ‘్భషాప్రవీణ నకుల వర్షిత్’గా పేరు సాధించడం.. ఇలా వీటన్నింటికీ మించి ఓ గిన్నిస్ రికార్డు సాధించడం’ అంటాడు నవ్వుతూ..
ఇన్ని సులక్షణాలున్న ఈ చిన్నారి అనుకున్న విజయతీరాలకు చేరాలని మనమూ ఆశీర్వదిస్తూ.. ఆల్ ద బెస్ట్ నకుల్..

- పాలపర్తి సంధ్య