మెయిన్ ఫీచర్

ప్యాచ్‌తో ఫ్యాషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటితరం అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందంగా, ఫ్యాషన్‌గా, సౌకర్యంగా ఉండే డ్రెస్ ఏది? అనగానే ముక్తకంఠంతో జీన్స్..2 అనేస్తారు. చిన్నవయస్సు నుంచి పెద్దవారి వరకు చాలా కంఫర్ట్‌గా టాప్ ఏదైనా ట్రెండీగా కనిపించేది జీనే్స.. ఏ తరానికైనా బోరుకొట్టని ఫ్యాషన్ ఏదైనా ఉందంటే అది జీనే్స.. షర్ట్, స్కర్ట్, ప్యాంట్, బెల్టు, బ్యాగు.. ఇలా ఏదైనా జీన్స్ అయితే ఓకే.. అందుకే ఈ జీన్స్‌లో బోలెడు ట్రెండ్స్.. ఈ జీన్స్‌లోనే రకరకాలు..జీన్స్ రంగు వెలిస్తే ఫ్యాషన్.. ఇది మొన్నమొన్నటిమాట అనుకోండి.. జీన్స్ చిరిగితే సూపర్ ఫ్యాషన్.. ఇది నిన్నటిమాట. జీన్స్‌కు అతుకులేస్తే సూపర్ బంపర్ ఫ్యాషన్.. ఇదీ నేటి మాట.. వాటినే ప్యాచ్ అప్ జీన్స్ అంటారు. ఇదే నేటితరం నయా ఫ్యాషన్ ట్రెండ్.. జీన్స్‌పైన రకరకాల లోగోల ప్యాచ్‌లను కుట్టేస్తూ అదే ఫ్యాషన్ అంటున్నారు డిజైనర్లు.. అందుకు స్వాగతం పలుకుతోంది యువతరం. సాధారణంగా జీన్స్‌పాంటుపైనో, చొక్కాపైనో చిన్న చిన్న లోగోలను ప్యాచ్‌లుగా కుడతారు. పాంటుకైతే జేబుల దగ్గర, చొక్కాకైతే జేబు దగ్గరో, కాలర్ దగ్గరో ఈ లోగోలను కుడతారు. కానీ ఈ ప్యాచ్‌లు ఎన్నుంటే అంత ఫ్యాషన్. ఒకచోట అని కాదు ఎక్కడ పడితే అక్కడ. దాంతో కంపెనీలు రకరకాల ప్యాచ్‌ల్ని రూపొందించే పనిలో పడ్డాయి. లోగోల నంబర్లు, పుర్రెలు, ఎముకలు, ఫంకీ బొమ్మలు, బుల్లి పదాలు, పదబంధాలు, బొమ్మలు, ట్రెండీ స్టైల్స్.. ఇలా ఎన్నో రకాలు.. వీటిని క్రమపద్ధతిలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తూ సరికొత్త జీన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. కాస్త ఫ్యాషన్ స్పృహ ఉన్నవాళ్లయితే ఆ ప్యాచ్‌లేవో మనమే కుట్టుకుంటే పోలా అనీ అంటున్నారు. అలా అనడమే కాదు. విడివిడిగా రకరకాల ప్యాచ్‌లను కొనుక్కుని తమకు నచ్చినట్లు కుట్టుకుని కొత్త ఫ్యాషన్స్‌ని ఫాలో అయిపోతున్నారు.
నిజానికి ఈ ఫ్యాషన్ మరీ కొత్తదేం కాదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జాకెట్లు, స్కౌట్ యూనిఫామ్‌లపై ప్యాచ్‌లను కుట్టేవారట. అందుకోసం ప్యాచ్‌లను సేకరించి పెట్టుకునేవారట. క్రమేణా అది అంతరించిపోయింది. ఒకటో రెండో లోగోల్ని మాత్రం జేబుల దగ్గర కుట్టే పద్ధతి మాత్రం మిగిలింది. ఆ పాత ఫ్యాషనే వెలుగులోకి వచ్చింది. ఈ ప్యాచ్‌ల జీన్స్‌లను వేసుకుంటూ కుర్రతరం తెగ హల్‌చల్ చేస్తోంది.