మెయిన్ ఫీచర్

ధ్యానపూర్వకమైన మనసు లేని వ్యక్తిని చూడలేదు (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవే మీ ఆత్మను బంధించే అసలైన బంధనాలు. మీరు వర్తమానంలో జీవించేందుకు అవి మిమ్మల్ని ఎప్పటికీ అనుమతించవు. నాకు తెలిసినంత వరకు, ధ్యాన పూర్వకమైన మనసు లేకుండా స్వేచ్ఛగా ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు.
పాశ్చాత్యులు స్వర్గాన్ని ‘పేరడైజ్’ అంటారు. దానినే భారతదేశంలో ‘మోక్షం’అంటారు. ‘మోక్షం’అంటే ‘స్వేచ్ఛ’కానీ, ‘పేరడైజ్’ అంటే స్వేచ్ఛ కాదు. ‘పేరడైజ్’ అనే పదం ‘్ఫరదౌస్’అనే పర్షియన్ మూల పదం నుంచి వచ్చింది. ‘్ఫరదౌస్’అంటే ‘చుట్టూ గోడ ఉన్న తోట’అని అర్థం. అది తోట అయినా, దానిచుట్టూ గోడ ఉందని మర్చిపోకండి. అంటే అది కూడా ఒక రకమైన కారాగారమే.
‘‘తన మాట వినలేదన్న కోపంతో దేవుడు ఆదాము, అవ్వలను ‘‘ఈడెన్ పూదోట’’నుంచి బయటకు గెంటేశాడు’’అని బైబిల్ చెప్తుంది. బయటకు అంటే ఎక్కడికి? ఎందులోకి?
నన్నడిగితే, అది ఒక శాపం. ఎందుకంటే, మహోన్నతమైన స్వేచ్ఛను, ఆశీర్వాదాన్ని అదే ఇంతవరకు అక్కడ దాచిపెట్టింది. ఇప్పుడు ఆదాము, అవ్వలు ఆ జైలునుంచి బయటపడ్డారు. అదే మానవాళి మహోదయానికి ఆరంభం. ఇప్పుడు ఈ భూమి, ఈ ఆకాశం, అన్నీ వారివే. వాటితో ఏం చెయ్యలనేది పూర్తిగా వారిష్టం. కానీ, దురదృష్టమేమంటే వారు స్వేచ్ఛా ప్రపంచాన్ని సృష్టించలేకపోయారు. ప్రతి దేశం, చుట్టూ గోడ ఉన్న జైలులా తయారైందే కానీ, కనీసం చుట్టూ గోడ ఉన్న తోటలా అవలేదు.
దేవుడు మనిషిని శిక్షించాడని క్రైస్తవమతం భావిస్తుంది. ‘‘ఈడెన్ పూదోట’’నుంచి ఆదాము, అవ్వలను బయటకు గెంటిన దేవుడు ‘‘వారిని బాగా శిక్షించాను’’అని భావించవచ్చు. కానీ, వాస్తవానికి ఆ దేవుడే చుట్టూ గోడ ఉన్న తోటలో బందీగా ఉన్నాడు. అతని ఉద్దేశం మంచిది కాకపోయినా అదే ఆశీర్వాదంగామారి మనిషికి స్వేచ్ఛ కల్పించి మానవాళి మహోదయానికి నాంది పలికింది. ఒకవేళ జరగవలసినంత వేగంగా పరిణామం జరగకపోతే మళ్ళీ అన్ని మతాల దేవుళ్ళ పూజారులు దాన్ని అడ్డుకుంటూనే ఉంటారు.
చూసేందుకు సూర్యుడు భూమిచుట్టూ తిరుగుతున్నట్లు కనిపించినా అది నిజంకాదని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని అన్నిరకాల శాస్ర్తియ ఆధారాలతో తన సిద్ధాంత గ్రంథంలో సూత్రీకరించాడు మృత్యుముఖంలో మంచంపై ఉన్న దాదాపు ఎనభై ఏళ్ళ వృద్ధుడైన గెలీలియో.
విషయం తెలుసుకున్న పోప్ ఆజ్ఞానుసారం ఆ స్థితిలో ఉన్న గెలీలియోను పోప్ న్యాయస్థానానికి ఈడ్చుకొచ్చింది క్రైస్తవ ప్రేమ.
‘‘నువ్వెంత ఘరమైన నేరం చేశావో తెలుసా? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని దేవుడు రాసిన అతి పవిత్ర గ్రంథమైన బైబిల్‌లో ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. దానిని మార్చి రాసేందుకు నువ్వెవరు? వెంటనే నీ అభిప్రాయాన్ని మార్చుకుని బైబిల్‌లో ఉన్నట్లుగా నీ సిద్ధాంత గ్రంథంలో మార్చి రాయి. లేకపోతే, క్రైస్తవ చట్టాల ప్రకారం నీకు మరణ దండన విధించాల్సి వస్తుంది’’అన్నాడు గెలీలియోతో పోప్.
‘‘మృత్యుముఖంలో ఉన్న నాకు మరణమంటే భయం లేదు. ఒకవేళ మీరు చెప్పినట్లు నేను మార్చిరాసినా అవి ఎప్పటిలాగే యధావిథిగా పయనిస్తూనే ఉంటాయి. అంతేకానీ, వాటి తీరులో ఎలాంటి మార్పు ఉండదు. అయినా మీరు చెప్పినట్లే చేస్తాను’’అన్నాడు గెలీలియో.
పోప్‌కు ఇచ్చిన మాట ప్రకారం గెలీలియో తన సిద్ధాంత గ్రంథంలో ‘‘బైబిల్‌లో ఉన్నట్లుగా, పోప్‌తోపాటు అందరూ అనుకుంటున్నట్లుగానే సూర్యుడు భూమిచుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది’’అని రాశాడు.
‘‘కానీ, అది వాస్తవం కాదు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇదే నిజం. కాబట్టి, బైబిల్‌లో ఉన్నట్లుగా నడుచుకోండని భూమిని, సూర్యుడిని నేను ఒప్పించలేను. ఒకవేళ ఒప్పించేందుకు నేను ప్రయత్నించినా అవి నా మాట వినవు. ఎందుకంటే, అవి క్రైస్తవులు కావు. అందుకే ఈ విషయంలో నేనేమీ చెయ్యలేను’’అని కింద ఇచ్చిన గమనికను ఎవరూ గమనించలేదు. ఒకవేళ గమనించి ఉంటే, జీసస్‌ను శిలువవేసిన విషయంపై అదే పనిగా పెద్ద రాద్ధాంతంచేస్తున్న గెలీలియోను కూడా క్రైస్తవులు శిలువ వేసేవారు.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్