మెయిన్ ఫీచర్

నూతన స్వేచ్ఛాశకానికి నాంది నేను ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓస్, అంతేనా! అయితే మా సినగాగు మీ సినగాగు కన్నా చాలా గొప్పది. ఎందుకంటే, సాధారణంగా ప్రతి సినగాగులో స్ర్తిపురుషుల మధ్య వారి సరదాలకు పరదా అడ్డుగా ఉంటుంది. దానిని మా సినగాగులో తొలగించి నూతన స్వేచ్ఛాశకానికి నేను నాంది పలికాను. మా సినగాగులో ఎవరు ఎవరితోనైనా యథేచ్ఛగా శృంగార కలాపాలు- ముద్దులు, కౌగిలింతలు- ఏదైనా చేసుకోవచ్చు. మీరు మీ భార్యతో వచ్చినా, మరొకరి భార్యతో వచ్చినా, ప్రియురాలితో వచ్చినా మేము పట్టించుకోము. కావాలంటే మా సినగాగుకు వచ్చి చూడండి. నేను ధర్మోపదేశాలు చేస్తున్నప్పుడు అందరూ హాయిగా తాగి తండదనా లాడుతూ ఉంటారు. అయినా నా ధర్మోపదేశాలు కొనసాగుతునే ఉంటాయి. స్వేచ్ఛ అంటే అలా ఉండాలి’’అన్నాడు రెండవ రబ్బీ.
వెంటనే ‘‘మా సినగాగు మీ సినగాగుల కన్నా చాలా ముందంజలో ఉంది. మీ సినగాగులలో స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉన్నా మీరు ధర్మోపదేశాలు చెప్పాల్సిందే, వాటిని అందరూ విధిగా వినాల్సిందే. కానీ, మా సినగాగులో అలా ఉండదు. కావాలంటే మా సినగాగుకు వచ్చి చూడండి. ‘‘ప్రతి యూదుల శెలవుదినంలో సినగాగు మూయబడును’’అని రాసి ఉన్న పలక మా సినగాగు ముందు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే, కనీసం శెలవు దినంలో అయినా ధర్మోపదేశాల గోల లేకుండా అందరూ అందుబాటులో ఉన్న అన్ని సరదాలను హాయిగా, యథేచ్ఛగా అనుభవించాలి కదా!’’ అన్నాడు మూడవ రబ్బీ.
కానీ, అవన్నీ స్వేచ్ఛలు కావు. వారు ఇంకా యూదులుగానే ఉన్నారు. కాబట్టి, మీరు మీ మత- హిందు, యూదు, జైన, మహమ్మదీయ, క్రైస్తవ- తత్వాల నుంచి, మరణించిన వారి ఆధిపత్యాలనుంచి, గడచిన గతంనుంచి, తెలియని భవిష్యత్తునుంచి పూర్తిగా బయటపడనంత వరకు మీకు స్వేచ్ఛ లేనట్లే. నిన్న, రేపు లేని, ఇప్పుడు ఇక్కడ, ఈ క్షణంలో ఉండేదే అసలైన స్వేచ్ఛ.
అవగాహన కలిగిన వ్యక్తి తన బరువును తానే దించుకుంటాడు. అందువల్ల హృదయానికి భారమనిపించే బంధనాలన్నీ- అవి అతనికి అలవాటైన బరువులే అయినప్పటికీ- అదృశ్యమవుతాయి. ఈ విషయాన్ని నేను మీకు స్వానుభవంతో కూడిన సంపూర్ణ్ధాకారంతో చెప్తున్నాను. మీ బంధనాలు తెగిన వెంటనే హాయిగా ఎగిరేందుకు మీకు రెక్కలొస్తాయి. అప్పుడు ఆకాశం, నక్షత్రాలు, అన్నీ మీవే.
కానీ, గుర్తుంచుకోండి: స్వేచ్ఛకోసం ఆరాటపడితే అది కూడా మీకు ఒక బంధమే అవుతుంది. ఎందుకంటే, మీ కోరికలన్నీ మిమ్మల్ని బంధించేవే. ఈ విషయంలో స్వేచ్ఛకు ఎలాంటి మినహాయింపు లేదు. ఎందుకంటే, కోరికలన్నీ భవిష్యత్తులో జీవిస్తాయి.
అసలైన స్వేచ్ఛాపరునికి తన స్వేచ్ఛను ఆనందించడం తప్ప బానిసత్వం, స్వేచ్ఛల గురించి ఏమీతెలియదు. అదే అతని లక్షణం. లక్ష్యాలన్నీ భవిష్యత్తుకు సంబంధించినవే. భవిష్యత్తులో నెరవేరే కోరికలన్నీ మీ వర్తమాన దుఃఖాలకు వేసిన ముసుగులే.
మీ ‘‘రేపు’’ మీతో ‘‘ఈ ఒక్కరోజు గడిస్తే చాలు. రేపటినుంచి మీకు పూర్తి స్వేచ్ఛ’’అంటుంది. ఇలా అది మీకు అనేక వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. కానీ, ఇంతవరకు ‘‘రేపు’’ఎప్పుడూ ‘‘రేపు’’గా మీ దగ్గరకు రాలేదు, ఇకముందు రాదు కూడా. కాబట్టి, మీరు ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేరు.
‘‘రేపు’’అనేది కేవలం ఒక ఓదార్పు మాత్రమే. స్వేచ్ఛకు బదులు అది మీకు మరణాన్ని తీసుకొస్తుంది. అందువల్ల మీరు బతికున్నన్ని రోజులు బానిసగానే జీవిస్తారు. ఎందుకంటే, వర్తమానం వృథా అవుతోందని మీరు ఎప్పుడూ బాధపడరు.
గతం మీ జ్ఞాపకం. భవిష్యత్తు మీ ఊహ. వాటికి ఉనికి లేదు. కేవలం వర్తమానం మాత్రమే మీ ముందున్న వాస్తవం. అలాంటి వర్తమానంలో మీరు పూర్తిగా అప్రమత్తతతో ఉంటూ, మీ చైతన్యాన్ని గతం, భవిష్యత్తులనుంచి సేకరించి ఆ వర్తమానంలో కేంద్రీకరించడమే ‘‘స్వేచ్ఛ రుచి’’ తెలుసుకోవడమంటే.
కనీసం ఆకాశంలో ఎగిరే పక్షులకు, అడవిలో తిరిగే జంతువులకున్న స్వేచ్ఛ కూడా మనిషికి లేదు. అతని చుట్టూ అతనే అంగీకరించిన అనేక సంకెళ్ళున్నాయి. పాపం, మనిషి ఎలాంటి ఉచ్చులో పడిపోయాడా అనిపిస్తుంది.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్