మెయిన్ ఫీచర్

గోదావరి అనుభవం.. కృష్ణ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి. సురేంద్రకుమార్
విజయవాడ: కృష్ణా పుష్కరాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న దుర్ఘటనతోపాటు, గత ఏడాది గోదావరి పుష్కరాల్లో విషాద ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని అలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా భద్రతాపరమైన ఏర్పాట్లు ఒక ఎత్తయితే.. సమాచార వ్యవస్థ అత్యంత కీలకమైంది. పోలీసు, రెవిన్యూశాఖలు తమపరంగా పటిష్ట సమాచార ప్రణాళికను రూపొందించుకుంటూనే.. ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థకు కృష్ణా పుష్కరాల్లో పెద్ద పీట వేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కొలువు తీరి పర్యవేక్షించే ప్రదేశంలోనే ఈ వ్యవస్థ ఏర్పాటైంది. దీనే్న ‘సీఎం క్యాంపు ఇన్ కంట్రోల్ అండ్ కమాండ్’ అని పిలుస్తారు. అమ్మవారు కొలువు తీరిన ఇంద్రకీలాద్రి దిగువున కృష్ణమ్మ చెంత దుర్గాఘాట్‌లో ఈ ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థకు రూపకల్పన చేశారు. ప్రకృతి వైపరిత్యాలు, విధ్వంసకర చర్యలు చోటు చేసుకుని సమాచార వ్యవస్థ కుప్పకూలిన సమయంలో ఈ ప్రత్యామ్నయ సమాచార వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న రిపీటర్, స్వంత యాంటీనాల ద్వారా సమాచారాన్ని ఒడిసిపట్టుకుని యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే లక్ష్యం. అయితే ఈ ప్రత్యామ్నయ సమాచార వ్యవస్థ అవసరాన్ని గోదావరి పుష్కరాల్లో చోటు చేసుకున్న విషాద ఉదంతం ద్వారా గుణపాఠం నేర్పిందని నిపుణుల విశే్లషణ. దీంతో మేల్కొన్న ప్రభుత్వం కృష్ణా పుష్కరాల్లో కళ్ళు తెరిచి ‘ప్రత్యామ్నయ సమాచార వ్యవస్థ’కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం దుర్గాఘాట్‌లో సుమారు 3కోట్ల రూపాయలు బడ్జెట్‌తో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇంకా నిర్మాణ పనులు మాత్ర కొలిక్కి రాలేదు. కింద అంతస్తులో సమాచార వ్యవస్థను నెలకొల్పారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ‘అకాడమి ఆఫ్ హామ్ రేడియో’ ఈ బాధ్యతలను భుజానకెత్తుకుంది.
సంస్థ చీఫ్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ అర్జా రమేష్‌బాబు నేతృత్వంలో సుమారు 50మంది సిబ్బంది పని చేస్తున్నారు. పుష్కారాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమేరాలు, డ్రోన్ కెమేరాల ద్వారా దృశ్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్ట్రీన్‌లపై తిలకిస్తూ అప్పటికప్పుడు పరిస్ధితిని అంచనా వేయడం జరుగుతుంది. పై అంతస్తులో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ యంత్రాంగం కొలువు తీరి నేరుగా కృష్ణా పుష్కర తీరాన్ని వీక్షిస్తూ సమీక్షించేందుకు అనువుగా తీర్చి దిద్దారు. ఈ రెండు అంతస్తులు అద్దాలతో కోజ్డ్ సర్క్యూట్ చేసి, వీటి పైఅంతస్తులో ఓపెన్‌గా తీర్చి దిద్దారు. ఇక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి నేరుగా పరిస్థితిని వీక్షిస్తారు. గత గోదావరి పుష్కరాల్లోని విషాద ఉదంతం నేర్పిన పాఠం ఫలితమే ప్రత్యామ్నయ సమాచార వ్యవస్థగా రూపుదిద్దుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ అవతారమెత్తింది.
విజయవాడలో 99 రైళ్ల దారిమళ్లింపు
విజయవాడ: ఏడాది క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. 99 రైళ్లను విజయవాడ నగరంలోకి రాకుండా బయట మార్గం గుండా తరలించడం ద్వారా కొంత వరకు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం అమలు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల నిమిత్తం దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి 626 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో 480 ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. అయితే, అసలు విషయానికొస్తే విజయవాడ స్టేషన్‌కు సంబంధం లేకుండా 99 ప్యాసింజర్ రైళ్లను ఊరిబయట నుంచి నడుపుతున్నారు.

చిత్రాలు..ఇంద్రకీలాద్రి దిగువున వున్న దుర్గాఘాట్‌లో ఏర్పాటు చేసిన ‘కమాండ్ ఇన్ కంట్రోల్ సెంటర్’
సమాచార వ్యవస్థ... ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు