మెయిన్ ఫీచర్

స్ర్తిలకు స్వేచ్ఛ, సమానత్వం ఏ మేరకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలోని స్ర్తిలు ఏ దేశంలోని విధంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం మనువు రాసిన మను సిద్ధాంతం కారణంగా స్ర్తిలు ప్రతి విషయంలో అణచివేయబడుతూ వస్తున్నారు. మను ఒక స్ర్తికి పుట్టిన విషయాన్ని మరచి, స్ర్తిలను నీచంగా, హీనంగా వారిని అవమానం చేసేవిధంగా తన పురుష ఆధిపత్యాన్ని చూపించడం జరిగింది. స్ర్తి యొక్క పరిమితులు, వారి హక్కులను కాలరాస్తూ వంటింటికే పరిమితం చేయడం తన యొక్క పురుష ఆధిపత్యాన్ని వ్యక్తపరచడం తన నీచబుద్ధికి నిదర్శనం. సనాతన ధర్మం అని చెప్పి అటువంటి స్వాములు అమ్మతనాన్ని స్ర్తి యొక్క గొప్పతనాన్ని మరిచి కట్టుబానిసగా చేయడం జరుగుతోంది. అలాంటి విషయాలను పక్కన పెట్టి అందరూ సమానమే అని పైకి గొప్పలు చెప్పే అటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మనువు తన గ్రంథంలో దళితులను ఎంతో హీనంగా చూపుతూ వ్రాశాడో అదేవిధంగా స్తల్రను కూడా చూడడం జరిగింది. పూర్వంలో మాతృస్వామ్య కుటుంబాలు ఉండి అందులో తమ కుటుంబం యొక్క ఆలనా పాలనా చూసేదిగా ఉండేది. మనువు నీచబుద్ధితో మాతృస్వామ్య కుటుంబాలు కాస్తా పితృస్వామ్య కుటుంబాలుగా ఏర్పడి స్ర్తిలను బానిసలుగా చిత్రీకరించడం జరిగింది.
భారతదేశంలో ఇతిహాసాలను పురుషులే వ్రాశారుగనుక స్ర్తిలను స్వేచ్ఛ, సమానత్వానికి దూరం చేసి వారి ఆధిపత్య అహంకారాన్ని చూపించడం ద్వారా, వాటిని నమ్మినవారు సమాజంలోని స్ర్తిలను నీచంగా చూడడం జరుగుతోంది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి దేవుళ్లను భారతదేశంలో సృష్టించడం జరిగింది. స్ర్తిను మడికట్టుకోవడం, చదువును అభ్యసించే అవకాశాలను కల్పించకపోవడం, ఒకవేళ చదివితే మహాపాపంగా అభివర్ణించడం హిందూ ధర్మంలో చూపించే అటువంటివారు ‘‘అదే ధర్మం సతీసహగమనం చేయడం, అది అమలుపరచడం జరిగేది కాని, అదే పురుషులు తమ భార్య చనిపోతే సతీసహగమనం చేయలేదు’’. కాని భర్త చనిపోతే భర్తతో ఆమె కూడా తన తనువును చాలించుకోవాలి. అలా చేయడం మనువు యొక్క సిద్ధాంతమును మత గొప్పలు చెప్పుకొని బ్రాహ్మణులు అముచేయడం, దాని ద్వారా ఆధిపత్యాన్ని వారి చేతుల్లోకి తీసుకొని వాటిని కొనసాగిస్తూ వచ్చారు. దళితులు చదువుకుంటే ఎక్కడ తెలివిమీరిపోతారో, తమ దురహంకారమైన ఆలోచనలు తెలుసుకుంటారని చదివినవారి నాలుకలను కోసి, విన్నవారి చెవుల్లో సీసం పోసినట్టుగా స్ర్తి చదివితే సంఘ బహిష్కరణ చేయడం పురు ఆధిపత్యంలో భాగమైవారిని దూరం చేశారు. అందుకు వారు ఏమీ చేయలేక పురుషుల చేతుల్లో అనుక్షణం నరకాన్ని చూస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రపంచీకరణ జరిగి భారతదేశం శాస్త్ర సాంకేతికరంగాల్లో ఎంతో పురోగాభివృద్ధి చెందుతున్నా మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు అదే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. అలా పురుషులు ఆధిపత్యం కోసం వాటిని నమ్మిన స్ర్తిలను అగౌరవపరుస్తూ స్ర్తిలను చులకనగా చూడటం జరుగుతోంది. కొన్ని మతాల్లో స్ర్తిలను గుడిలోకి రానివ్వకపోవడం, కొందరు దళితులను రానివ్వకపోవడం, స్ర్తిలకు సమానత్వం, స్చేవ్ఛ లేకుండా చేయడం ద్వారా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు.
స్ర్తిలను ప్రతి విషయంలోనూ వారి యొక్క ఋతుక్రమాన్ని హీనంగా చూస్తూ కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంచడం జరుగుతోంది. అందులో భాగంగానే స్ర్తిలను కొన్ని దేవాలయాలలో ప్రవేశం నేరంగా మహాపాపంగా చెప్పడం జరుగుతోంది. ఈమధ్యకాలంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం స్ర్తిల ప్రవేశాన్ని కల్పిస్తూ శబరిమల ఆలయంలోకి ప్రవేశం చేయవచ్చునని, దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని తీర్పు చెప్పడం జరిగింది. అందుకు కొంతమంది దేవాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకొంటే మనువాదులు దానిని తప్పుగా చూడటం, అదే పెద్ద మహానేరంగా పరిగణిస్తూ వారిని అడ్డుకొంటూ ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే భౌతిక దాడులు, మానభంగాలకు వెనుకాడబోమని బహిరంగంగానే వారి రాక్షస సనాతన ధర్మాన్ని అందులోని మార్గాన్ని బయటపెడుతున్న పరిస్థితి. స్ర్తి తన ప్రాణాలను పణంగా పెట్టి జీవం పోసిన స్ర్తిని నిందించడం ఎంత మూర్ఖత్వమో ఈ మనువాదులకు తెలియదా?
భారతదేశంలోని మనువాదులు స్ర్తి జీవితం అనుభవిస్తే కానీ అర్థంకావు. కాని మనువు రాసిన సిద్ధాంతాలు తన తల్లిని దృష్టిలో పెట్టుకుని వుంటే అలా రాసేవాడుకాదు. ఈ రోజు ఇంత దారుణమైన సంఘటనలు పునరావృతం అయ్యేవి కావు. కాని స్ర్తి పురుషుల విషయానికి వస్తే మాత్రం వారిని సమానంగా చూడలేరు. అంటే వీరికి పురుష అహంకారం అడ్డు వస్తోంది. ఇలా స్ర్తి అన్ని విషయాలపై దాడులు చేయడం, ప్రతిదానికి అణచివేస్తూ రావడం నేటి సమాజంలో చూడటం జరుగుతోంది. నీచమైన మనువు సిద్ధాంతాన్ని నమ్మి, దానినే అమలు పరుస్తూ ఇదే సనాతన ధర్మం అంటుంటారు స్వాములు, బాబాలు. కాషాయం వేసుకొని కమండలంలో రుద్రాక్ష వేసుకుంటే వారే సాక్షాత్తు భగవంతుని స్వరూపమని చెప్పుకుంటూ కోట్లకు పడగలెత్తినవారికి దాసులుగా స్ర్తిలు మాత్రం కావాలి. ఇదేనా మీ సనాతన ధర్మం?
మనువాదులు చెప్పేటటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తూ స్ర్తి జాతిని సమానంగా, స్వేచ్ఛగా చూడకుండా వారికి ఆ వాతావరణం కల్పించకుండా మను సిద్ధాంతాన్ని అమలుపరిచే ఓ మనువాదుల్లారా ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. స్ర్తిని గౌరవించని పురాణాలను, మను సిద్ధాంతాన్ని కాల్చి బూడిద చేయండి. మగవారకి ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటిని స్ర్తి జాతికి కూడా సమానంగా ఉండే విధంగా చూడాలి. అది అందరి బాధ్యత. ‘మేకిన్ ఇండియా’ అని గొప్పలు చెప్పుకోండా అన్నిదేశాలకంటే భారతదేశంలోని స్ర్తిలకు ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం, స్వేచ్ఛలతో దేశ అభివృద్ధిలో మమేకం అవుతున్నామని సగర్వంగా చెప్పుకుంటూ స్ర్తిలను గౌరవించుకుందాం. స్ర్తి గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుకుందాం!

-మధుకర్ కేతపాక