మెయిన్ ఫీచర్

పర్యావరణ ప్రేమికురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు ఫర్వీజా ఫర్హాన్.. అడవిని కాపాడేందుకు ఆమె శాయశక్తులా కృషిచేస్తోంది.. వన్యప్రాణులకు మద్దతుగా ఎ వ్వరూ మాట్లాడటం లేదని, తానే ఆ బాధ్యతను తీసుకుంది.. వివరాల్లోకి వెళితే..
ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఒరాంగుటాన్‌లు, ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు కలిసి జీవించే ప్రదేశం ఒకే ఒక్కటి మిగిలి ఉంది. అది సుమత్రాలోని ల్యూజర్ ఎకోసిస్టమ్. అక్కడి పర్యావరణ కార్యకర్త ఫర్వీజా ఫర్హాన్ ఆ వ్యవస్థను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. 2012లో ఆమె తన స్వచ్ఛంద సంస్థ ‘యయాసన్ హాకా’ తరపున ఒక కంపెనీ అక్రమంగా పొందిన పర్మిట్‌తో ఆ అడవిని కొట్టేయడంపై కేసు వేసింది. ఇటీవలే ఆమె స్థానికుల సాయంతో ఈ ప్రాంత రహదారులు, డ్యామ్‌ల నిర్మాణం, పామ్ ఆయిల్ చెట్ల పెంపకానికి ఇస్తున్న రాయితీలకు వ్యతిరేకంగా ఓ కేసు దాఖలు చేసింది. వన్యప్రాణులకు మద్దతుగా ఎవరూ మాట్లాడటం లేదని, అందుకే దీన్ని అన్యాయంగా భావించి తాను పోరాటం చేస్తున్నానని అంటారు ఆమె.
ల్యూజర్ ఎకోసిస్టమ్ ఉన్న అడవుల్లో అద్భుతమైన పక్షి, జంతుసంపద కనిపిస్తుంది. అవన్నీ వాటి వాటి ప్రదేశాల్లో అక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ తల్లి, పిల్ల ఒరాంగుటాన్‌లు ఒక చెట్టు మీది నుండి మరో చెట్టుపైకి ఊడలను పట్టుకుని స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. కొన్నిసార్లు అత్యంత నిశ్శబ్దంగా ఉండే ఈ అడవులు, మరికొన్నిసార్లు జంతువుల అరుపులతో, పక్షుల కిలకిలారావాలతో కళకళలాడుతుంటాయి. అలాంటి అడవుల్లో ఇప్పుడు రంపాల శబ్దం వినిపిస్తోందని, అది వినాశనానికి సూచన అనీ, అందువల్లే అడవులను రక్షించడానికి పోరాడాలని నిర్ణయించుకుంది ఫర్హాన్.
చిన్నప్పటి నుండీ బ్లూ ప్లానెట్ కార్యక్రమాలు చూసే ఫర్హాన్ రానురాను పర్యావరణ ప్రేమికురాలిగా మారిపోయింది. చిన్నప్పటి నుండీ సముద్రం, దానిలోని ఆల్చిప్పలంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే వాటితో ప్రేమలో పడింది. అప్పటి నుంచే ఆమె తన జీవితాన్ని అడవుల్లో గడపాలని నిర్ణయించుకుందట. పెద్దయ్యాక మెరైన్ బయాలజీ పూర్తిచేశాక తను చిన్నప్పుడు కలలు కన్న ప్రాంతాన్ని అనే్వషించింది. తీరా ఈ ప్రాంతానికి వచ్చాక ఇక్కడంతా ధ్వసమై ఉండటం ఆమె గమనించింది. దీంతో ఆమె చాలా ఆవేదన చెందింది. అప్పుడే ఆమె ఈ అడవులను ఎలాగైనా పరిరక్షించాలనుకుందట. కానీ అది అంత సులభం కాలేదు. ఈ ప్రాంతంలోని పర్యావరణ విధ్వంసానికి ప్రధాన కారణం అడవులను విచక్షణారహితంగా కొట్టిపారేయడం, సుస్థిరత కాని అభివృద్ధి విధానాలు అని తెలుసుకుంది ఫర్హాన్.
ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన పంటల్లో ఆయిల్‌పామ్ ఒకటి. అనేక పెద్ద పెద్ద కంపెనీలు అడవుల్లో ఆ చెట్లను పెంచాలనుకున్నాయి. ప్రభుత్వం కూడా ఆ చెట్లను పెంచే కంపెనీలకు రాయితీలు ఇస్తోంది. కానీ దానివల్ల ఈ ప్రాంతంలో పర్యావరణం నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. అలాగని పామాయిల్ వాడకానే్న నిలిపేయమని నేను చెప్పడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దాని వాడకం పెరగడంతో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. కానీ వాళ్లు దాన్ని చవకగా పొందాలనుకున్నారట. దాంతో విచ్చలవిడిగా ఆయిల్ పామ్ చెట్ల పెంపకాన్ని అక్కడ చేపడుతున్నారని తెలుసుకుంది ఫర్హాన్.
ముఖ్యంగా సుమత్రా, అమెజాన్, మడగాస్కర్ వంటి ప్రాంతాల్లో విపరీతమైన విధ్వంసం జరుగుతోందని తెలుసుకుంది ఫర్హాన్. ఈ ప్రదేశాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయో గమనించి.. అడవులు, పర్యావరణ విధ్వంసం ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకుంది ఫర్హాన్. వెంటనే దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసింది. ఫర్హాన్ కృషి ఫలితంగా.. ఆ ప్రాంతంలో ఆయిల్ పామ్ చెట్లను పెంచుతున్న సంస్థ స్థానికులకు రూ. 187 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఫర్హాన్ పర్యావరణం కోసం ఎంతో పాటు పడుతోంది. పర్యావరణంపై చేసిన కృషికి గాను ఫర్వీజా ఫర్హాన్ 2016లో విట్లే అవార్డు పొందారు. *