మెయిన్ ఫీచర్

రెట్టింపవుతోన్న కడుపు‘కోత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళకు కాన్పు మరోజన్మతో సమానమంటారు. నొప్పులు రావడం మొదలైనప్పటినుంచీ కాన్పు జరిగిన ఐదు రోజుల వరకు ఆడవారికి గండమే.. కొంతమంది నొప్పులను తట్టుకోలేక ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటారు. కొంతమంది డాక్టర్లు ఒప్పుకోరు కానీ.. కొంతమంది డాక్టర్లు మాత్రం ఈ బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అలా నేడు సిజేరియన్‌ల శాతం బాగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో భారతదేశంలో సిజేరియన్ జననాల శాతం రెట్టింపైంది. 2005-06లో ఈ జననాలు తొమ్మిది శాతంగా ఉండేవని, 2015-16 నాటికి ఇవి 18.5 శాతానికి పెరిగాయని ప్రముఖ వైద్య పత్రిక ‘ద లానె్సట్’లో ప్రచురితమైన అధ్యయనం తెలుపుతోంది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 169 దేశాల గణాంకాలను సేకరించి విశే్లషించారు. భారతదేశంలో సిజేరియన్ శస్తచ్రికిత్సలు అత్యధికంగా జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2000వ సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాల్లో సిజేరియన్ జననాల శాతం దాదాపు రెట్టింపైందని ద లానె్సట్ పత్రిక పేర్కొంది. దీని ప్రకారం సిజేరియన్ జననాల సంఖ్య 2000వ సంవత్సరంలో సుమారు 1.6 కోట్లు కాగా, 2015 నాటికి ఈ సంఖ్య దాదాపు 2.97 కోట్లకు చేరింది. 2000 సంవత్సరం మొత్తం జననాల్లో 12 శాతంగా ఉన్న ఈ జననాలు 2015 నాటికి 21 శాతానికి పెరిగాయి. కొన్ని దేశాల్లో అయితే సిజేరియన్ల జననాల శాతం ఆందోళనకరస్థాయికి చేరిందని ఈ అధ్యయన సారాంశం.
డబ్ల్యూహెచ్‌వో
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా డొమినికన్ రిపబ్లిక్‌లో 58.1 శాతం సిజేరియన్ జననాలు నమోదవుతున్నాయి. డొమినికన్ రిపబ్లిక్‌తోపాటు బ్రెజిల్, ఈజిప్ట్, టర్కీ దేశాల్లో ఈ జననాలు 50 శాతానికి పైకి ఉన్నాయి. సిజేరియన్ ప్రసవాల శాతాన్ని తగ్గించేందుకు బ్రెజిల్ 2015లో ఒక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. చాలా సందర్భాల్లో అవసరం లేకున్నా సిజేరియన్ చేస్తున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్ జననాలు 15 శాతం దాటితే ఈ శస్తచ్రికిత్సలు ఎక్కువగా చేస్తున్నట్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల చెప్పింది. ప్రాణాలను నిలబెట్టగల సిజేరియన్ శస్తచ్రికిత్సను అవసరమైన సందర్భాల్లోనే చేయాలని తెలిపింది. ఈ శస్తచ్రికిత్సను ఎవరూ అనవసరంగా చేయకూడదని, దీనివల్ల తల్లీబిడ్డకు తలెత్తగల సమస్యలను నివారించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. సిజేరియన్ శస్తచ్రికిత్సల విషయంలో పేద, ధనిక దేశాల మధ్య చాలా అంతరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సిజేరియన్ శస్తచ్రికిత్స తప్పనిసరైన పరిస్థితుల్లో కూడా జరగడం లేదు. సబ్-సహారన్ ప్రాంతాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. 2015లో పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతంలో కేవలం నాలుగు శాతం కేసుల్లోనే ఈ శస్తచ్రికిత్సలు చేయగా, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో 44 శాతం కేసుల్లో ఇవి జరిగాయి. పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో పదిరెట్లు ఎక్కువ సిజేరియన్‌లు జరిగాయట. వైద్య కారణాల దృష్ట్యా అవసరమైనప్పుడు మాత్రమే సిజేరియన్ శస్తచ్రికిత్సకు మొగ్గు చూపాలని వైద్యులకు, మహిళలకు, కుటుంబాలకు ఈ అధ్యయనం చెబుతోంది. దీనితో పాటు బిడ్డ జననానికి సంబంధించి అవగాహన పెంచాల్సి ఉందని చెబుతోంది.
ముప్పు
వైద్యం పరంగా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సిజేరియన్ ద్వారా తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడొచ్చు. ఈ శస్తచ్రికిత్సలతో తల్లీబిడ్డ ఇద్దరికీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవచ్చని ఈ అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ జేన్ శాండల్ చెబుతోంది. ఈమె కింగ్స్ కాలేజ్ లండన్‌లో సామాజిక శాస్త్రాలు, మహిళల ఆరోగ్య విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. జేన్ శాండల్ చెబుతున్న దాని ప్రకారం ‘సిజేరియన్ శస్తచ్రికిత్సలో గర్భాశయానికి కోత పెడతారు. దీనివల్ల లోపల మచ్చ ఏర్పడుతుంది. దీని కారణంగా, మళ్లీ గర్భం దాల్చినప్పుడు రక్తస్రావం జరగడం, మాయ సరిగా ఏర్పడటకపోవడం, అండవాహికల్లో పిండం ఏర్పడటం, శిశువు గర్భంలోనే చనిపోవడం లేదా నెలల నిండకముందే జన్మించడం వంటి సమస్యలు రావొచ్చు. అంతేకాదు శస్తచ్రికిత్స చేయించుకున్న ప్రతీసారి ఈ ముప్పు తీవ్రత పెరుగూ పోతుందని, ఇవి చూడటానికి చిన్నవే కానీ తీవ్రమైన సమస్యలు..’ అని సారాంశం.
సిజేరియన్ శస్తచ్రికిత్స ద్వారా పుట్టే శిశువుల రోగనిరోధకశక్తి వృద్ధిలో మార్పులు ఉండొచ్చు. దీనివల్ల శిశువులకు అలర్జీలు, ఆస్తమా ముప్పు పెరగొచ్చు. పేగుల్లో ఉండే బాక్టీరియాల్లో మార్పులు రావొచ్చు. ఇవి స్వల్పకాలిక సమస్యలు. దీర్ఘకాలిక సమస్యలపై ఇంకా లోతైన అధ్యయనం జరుగుతోంది. సహజ కాన్పుతో పోలిస్తే, సిజేరియన్ కాన్పులు ఎక్కువగా జరిగినప్పుడు తర్వాతి కాన్పులో తల్లి ప్రాణాలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అవసరం లేని సందర్భాల్లోనూ సిజేరియన్ చేయడానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు కారణాలు ఉన్నాయి. గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడటం, సమస్య ఏర్పడితే సకాలంలో గుర్తించడం అవసరం. కానీ మొత్తం మీద సిజేరియన్లు ఎక్కువగా జరగడానికి కారణం మాత్రం వైద్యుల ఆర్థిక ప్రయోజనాలు, మెడికో-లీగల్ అంశాలే..