మెయిన్ ఫీచర్

సంరంభం.. ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రావణ శుక్రవారం సందడి

* పుష్కర భక్తులు తాకిడి తక్కువే

* మహబూబ్‌నగర్‌లో కళకళ

* నల్గొండ జిల్లాలో వెలవెల

పుష్కర సంరంభం మొదలైంది. కృష్ణాతీరం అంతా ఆధ్యాత్మిక శోభ అలుముకుంది. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి ఊహించినంతగా లేదు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని గొందిమళ్ల ఘాట్‌వద్ద ముఖ్యమంత్రి తెల్లవారుఝామున పుష్కరాలను ప్రారంభించారు. ఉదయం ఓ గంటసేపు సోమశిల, అలంపూర్, బీచుపల్లి ఘాట్‌లవద్ద జనం తాకిడి ఉన్నా ఆ తరువాత తగ్గిపోయింది. మళ్లీ మధ్యాహ్నం పుంజుకుంది. శని, ఆదివారాల్లో జనం పోటెత్తే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో బీచుపల్లిలో కాస్త జనం ఎక్కువగా వచ్చారు. వాడపల్లి సహా నల్గొండ ఘాట్‌లు వెలవెలబోయాయి. నీళ్లు ఎక్కువగా ఉండని నల్గొండ ఛాయాసోమేశ్వర ఆలయ ఘాట్‌ను కృష్ణమ్మ కరుణించింది. పుష్కలంగా నీరు రాగా భక్తులూ పెద్దసంఖ్యలోనే తరలివచ్చారు. సాగర్ ఘాట్‌వద్ద అర్చకులు, పురోహితులు ధర్నా చేశారు. మంటుటెండలో కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడం, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటిరోజు 3 లక్షలమంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా నల్గొండ జిల్లాలో లక్షలోపు పుణ్యస్నానాలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ జిల్లాలో చాలాఘాట్లకు భక్తులు రానేలేదు.

చిత్రం... అలంపూర్‌లోని గొందిమళ్ల ఘాట్‌వద్ద పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తుల పవిత్రస్నానం,
హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్ (ఇన్‌సెట్)

చిత్రం... బీచుపల్లి వద్ద కృష్ణవేణికి హారతి ఇస్తున్న దృశ్యం, ఘాట్‌వద్ద
భక్తజన సందోహం.