మెయిన్ ఫీచర్

కుండలినీ శక్తి ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు
H.No. 7-8-51,Plot No.. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
===============================================================
ఈ శక్తి మూలాధారమునందు వెలుగొందే గొప్ప ఆధ్యాత్మికతతో కూడిన జీవశక్తి. కుండలినియనగా చుట్టలుచుట్టు కొని ఉన్నదని అర్థం. మేరుదండానికి (వెన్నుపూస) చివర మూలాధార చక్రంవద్ద మూడున్నర చుట్టుకొని, వున్న సర్పాకారముతో, తోకతో ముఖమును కప్పుకుని ఉన్నదని జ్ఞానులు చెబుతున్నారు. అందువల్లనే ఈ శక్తిని, సర్పశక్తి, అవధూత శక్తి, కుటిలాంగి, భుజంగి, శక్తి ఈశ్వరి, అరుంధతి, కుండలి అని కూడా అంటారు. ఈ కుండలిని శక్తియే, సర్వ విజ్ఞానానికి ప్రజ్ఞతో కూడిన, మానవాతీత మహిమలకు ఆధారమైయున్నది.
ప్రతి జీవి తల్లి గర్భమునందున్నప్పుడు కుండలిని జాగృతమైయుండి పూర్వజన్మ జ్ఞానము కలిగియుండును. తల్లి గర్భము నుండి బయటపడిన బిడ్డ (బొడ్డుకోసి విడదీయబడుతుంది) యొక్క కుండలిని మూలాధారమందు నిద్రావస్థను పొందుతుంది, అప్పుడు పూర్వజన్మ జ్ఞానమును కోల్పోవునని పెద్దలు చెప్తారు. ఈ శక్తి యొక్క వినియోగము, ప్రయోజనము తెలిసి, దీనిని జాగృతము చేయనంతకాలము, ఇది మన మూలాధారమునందు, నిద్రావస్థలోనే ఉంటుంది.
అట్లుకాక సాధకుడు మిక్కిలి ధ్యాననిష్ఠతో, గురుకటాక్షముతో, ఈ శక్తిని జాగృతము కావించినచో, ఇది ఊర్ధ్వముఖ పయనముతో సుషుమ్నానాడి ద్వారా సహస్రారమును చేరి అక్కడవున్న శివునితో చేరి సాధకుణ్ణి జీవన్ముక్తుణ్ణి చేస్తుంది. ఈ కుండలినీ శక్తి షట్చక్రముల ద్వారా ర్ధ్వగమనము చేయునపుడు ఆయా చక్రస్థాయిలకు సంబంధించిన విజ్ఞానం కలుగుతుంది. ఈ శక్తిని రెండు రకాలుగా భావించవచ్చును.
ఒకటి వ్యక్తిలోని కుండలిని శక్తి దీనిని వ్యష్ఠి కుండలిని అంటారు. దీనికి సుబ్రహ్మణ్యస్వామిని అధిపతిగా చెబుతారు. రెండవది బ్రహ్మానందమందలి కుండలినీ శక్తి. దీనికి ఆదిశేషుడు లేక అనంతుడ్ని అధిదేవతగా చెబుతారు. అనంత వాసుకి, తక్షక కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహా పద్మ, అను 8 రకముల సర్పములను శంకరుడు ఆభరణాలుగా ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు అనంతుడు లేక ఆదిశేషునిపై శయనిస్తాడు. అందుకే ‘‘శివశ్చ హృదయం విష్ణుః’’ ‘‘విష్ణు శ్చ హృదయం శివః’’ అంటారు. ఈ కుండలినీ శక్తి అగ్ని బీజ ప్రధానమైనదిగా చెప్పబడింది కుండలిని శక్తి ప్రవహించే, సుషుమ్నానాడి కూడా అగ్నితత్త్వం కలిగిందే, కుండలినీ శక్తిని వాక్కుకు సంబంధించిన మూలశక్తిగా చెబుతారు. వాగ్ధేవత అయిన సరస్వతిదేవి బీజాక్షరం ‘ఐం’. ‘ఐం’ బీజాక్షరాన్ని విశే్లషిస్తే ఆ+ఎ+మ్=ఐం, మరల ఎ అనే అచ్చును విడదీస్తే అ+ఇ=ఎ అవుతుంది. కాబట్టి ‘ఐమ్’లో అ,ఇ,అ,మ్ అనే అక్షరాలున్నాయి. వీటిలో మూడు అక్షరాలు పూర్తిగాను, చివరి అక్షరం ‘‘మ్’’ సగమే ఉన్నందున ఈ కుండలినీ శక్తి మూడున్నర చుట్లుచుట్టుకుని ఉందని కొందరి వ్యాఖ్య. మంత్ర శాస్త్ర సంబంధమైన సమన్వయం చేస్తూ మానవజన్మకు ముందు జీవి ఖనిజస్థితి (జశళ్ఘూ ఒఆ్ఘఆళ) వృక్షస్థితి (-్ఘశఆ ఒఆ్ఘఆళ) జంతుస్థితి (శజ్ఘౄ ఒఆ్ఘఆళ) అను కక్ష్యలను దాటిందని ఆ విధంగా మూడు చుట్లు పూర్తయ్యాయని, మానవజన్మ ఎత్తితే సరిపోదని, మనిషి తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును పూర్తిచేసుకోవాలనీ అపుడు నాలుగు కక్ష్యలు (చుట్లు) పూర్తయి మనిషి జీవన్ముక్తుడౌతాడని, ఈ విషయాన్ని తెలియచేయడానికే మానవ దశలో, ఈ కుండలినీ శక్తి మూడున్నర చుట్లుగా ఉన్నదని కొందరు పెద్దలు వ్యాఖ్యానించారు.
విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణార్థం శ్రీరామ లక్ష్మణులను తనతో తీసుకొని వెళ్ళినప్పుడు వారికి బల, అతిబల, అనువిద్యలను నేర్పినట్లు శ్రీమద్ రామాయణము ద్వారా మనము విని వున్నాము. ఆహారములేకుండ జీవించుట ‘‘బల’’యనెడు విద్యయనియు, మంచినీరు త్రాగకుండ జీవించగలగడం ‘‘అతిబల’’ యనెడు విద్యగాను చెప్పబడింది. అంగుడి యందు అనగా పిట్యూటరీ గ్రంధి పై మనోశక్తిని ఏకాగ్రతతో నిలిపి, క్రింద తెలిపిన మంత్రాన్ని అభ్యసం చేస్తే, ఆహార పానీయములు లేకుండ జీవించగల శక్తి లభిస్తుందని ఇట్టి అభ్యాసమునందు కృతకృత్యుడైన సాధకుడు, గాలి, వెలుతురు నుండి ఆహారాన్ని గ్రహించగలడని చెప్పబడింది. కాని అట్టి అతి సూక్ష్మమైన అతీంద్రియ శక్తిని పొందటానికి ‘‘కుండలిని శక్తి’’ జాగృతమై ఉండాలి.
బలాతి బలయోః విరాట్ పురుష ఋషిః
గాయత్రీ దేవతా- గాయత్రీ ఛందః
అకార ఉకార మకారా బీజాద్యాః
క్షుధాది నిరసనే వినియోగః క్లామిత్యాది షడంగన్యాసః
ధ్యానం:-
అమృతకర తలార్ద్రౌ సర్వసంజీవనాధ్యా వఘహరణ సుదక్షౌ
వేదసారే మయూఖే ప్రణవమయ వికారౌ
భాస్కరాకార దేహౌ సతతమనుభవే అహం తౌ
బలాతి బలేశా ఓం హ్రీం బలే మహాదేవి
హ్రీం మహాబలే క్లీం చతుర్విధ పురుషార్థ సిద్ధిప్రదే
తత్సవితుః వదాత్మికే హ్రీం వరేణ్యం భర్గోదేవస్య వదాత్మికే
అతిబలే సర్వక్షుత్ భ్రమ ఉపనాశినీ
ధీమహి ధియోయోనర్జాతే
ప్రచుర్యా ప్రచోదయాత్మికే ప్రణవ
శిరస్కాత్మికే హుం ఫట్ స్వాహా.
ఏవం విద్వాన్ కృత కృత్యభవతి
సావిత్య్రాయేవ సలోకతాం జయతి
ఇత్యుపనిషత్ ఆప్యాయన్త ఇతి శాంతిః
(రిఫరెన్స్: భృశాశ్వస్యతు దేవర్షేః దేవ ప్రహణాస్సుతాః- విష్ణు పురాణము- 1-15)
(్భృశాశ్యుడనే దేవర్షి సృష్టించిన మంత్రాలు ఇవి) ఇట్టి యోగశక్తి కలవారు కోటికొకరుంటారో లేదో! అటువంటి అతీంద్రియ స్థితిని తెలుసుకొని అనుభూతి పొందటం వరకే కాని, జీవితమంతా ఆ విధంగా ఉండటానికి కాదు.
ఇంకా ఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014