మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తదనుసారము సమీప గ్రామమందలి రామచంద్ర ముఖోపాధ్యాయుని కుమార్తెయగు శారదామణీదేవియను నైదేండ్ల బాలికను శ్రీరామకృష్ణునకు ఇచ్చి పెండ్లిచేసిరి. కాని యాతని పిచ్చి మాత్రము కుదరలేదు. అది దివ్యోన్మాదముగదా! అనతికాలముననే 1860-వ సంవత్సరమున తిరిగి దక్షిణేశ్వరము వచ్చినంతనే భగవదున్మాదమున మునిగిపోయెను.
ఇంతవఱకును శ్రీరామకృష్ణుడు తన భక్తిసాధనలను ఏ గురు సాహాయ్యమును లేకయే స్వయముగా సాగించుచుండెనని చెప్పనగును. ఇంతటి నుండియు దై వనిమంత్రితులై గురువులాతని వెదకికొనుచు రాసాగారి. పూవు వికసించినంతనే మధుపము దానిని వెదకికొనుచు రాకుండునా? శ్రీరామకృష్ణుడా గురువరేణ్యుల సాయమును గొని శాస్త్రోక్తముగా వివిధ సాధనల నభ్యసింపసాగెను.
బ్రహ్మానుభవమున నితరసాధకులకును శ్రీరామకృష్ణునకును రెండు విషయములలో విస్పష్టమగు భేదముగాన్పించును. ఏ సాధన నవలంబించినను ఆతడతి శీఘ్రముగా సిద్ధినిబొందుట మొదటి విషయము. ఆతని సత్యానే్వషణమునందలి తీవ్రతయే- ఆతని యనిర్వచనీయ భగవత్పరితాపమే- ఇందులకు కారణమని చెప్పనొప్పును. మానవ కోటి మత చరిత్రలో నింతకుముందు కనివిని యెఱుంగని వివిధ సాధనల నాత డభ్యసించుట రెండవ విషయము. ఆతని జీవితము బ్రహ్మానందానుభవ నందనవనమై, సర్వమత సామరస్య నిలయమై దీపించుటకిదియే హేతువ.*
శ్రీరామకృష్ణుని ప్రథమ గురువు భైరవీ బ్రాహ్మణియను యోగినీమణి. ఈమె విశేష విద్యావంతురాలు, తాంత్రిక సాధనలయం దఖండ విజయమును బడసిన మహనీయురాలు.
* (‘బ్రహ్మానంద తేజము బహువిధములుగా ప్రకాశితమై శ్రీరామ కృష్ణుని దివ్య జీవితమున సామరస్య దేవాలయమును నిర్మించియున్న’దనియు ‘ఆ దేవళమున కివే నా ప్రణతు’అనియు కవి చంద్రుడు రవీంద్రుడు నుడివి యున్నాడు.)
అరువది నాలుగు శాక్తేయ తంత్రములందునుగల ప్రధాన సాధనలనన్నిటిని శ్రీరామకృష్ణుడీమె శిక్షణమున జయప్రదముగా నభ్యసించెను. దైవమును జగజ్జననిగా భావించి సాగింపవలసిన యోగసాధనలలో ననేకము కష్టాత్కష్టతరములు,

ఇంకావుంది...

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి