మెయిన్ ఫీచర్

సమానంగా పెంచాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా పెళ్లయిన దంపతులు ఒక సంవత్సరం తిరిగే లోపు పిల్లలకు జన్మనిస్తే ఆ బిడ్డను చూసుకోవడం ఎంతో కష్టతరంగా ఉంటుంది కదూ. అలాంటిది కవలలు జన్మిస్తే పుట్టిన తర్వాత కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఒకేసారి పుడితే ఆ కన్న తల్లిదండ్రుల ఆనందం రెండింతలుగా మారుతుంది. ఈ ఆనందంతోపాటుగా కవల పిల్లలతో సమస్యలుకూడా రెండింతలు అవుతాయి. ఒక బిడ్డను సంరక్షించాలంటే ఎంత శ్రద్ధ చూపించాలో అంతకు రెండింతలు శ్రద్ధ కవలల సంరక్షణ విషయంలో చూపించాల్సిన అవసరం ఉంది.
కవలల పెంపకంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పాత్ర పెద్దది. పిల్లల విషయంలో కలిగే అవసరాలు ఏదైనాసరే రెండు అవసరమవుతాయి. కవలల అవసరాలు తీర్చడం కొంత కష్టమైనా అసాధ్యమైన పనేమీ కాదు. కవలల అవసరాలు తీర్చడంలో ఎప్పటికప్పుడూ ముందస్తు ప్రత్యేక ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అయితే గనక కవల పిల్లల సంరక్షణలో తాతయ్య, నానమ్మ, బాబాయిల సహకారం లభిస్తుంది. ఒకవేళ చిన్న కుటుంబం అయతే ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు పెద్దగా అయ్యేంతవరకు పనిమనిషి సహాయం తీసుకోవాలి. లేదా పెద్దవారు ఎవరైనా ఉంటే వారి సహాయం తీసుకోవాలి.
కవలల సంరక్షణలో తల్లి పాత్ర అమోఘమైనది. ఇద్దరు పిల్లలకూ తల్లి పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకు అవసరమైనమేర పాలను ఉత్పత్తిచేసే సామర్థ్యం తల్లి శరీరానికి ఉంటుంది. తల్లి పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. తల్లి తీసుకునే ఆహారంతోనే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. తల్లి సరిపడు సమయం విశ్రాంతి తీసుకుంటూ ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుందో పిల్లలు కూడా ఆనందంగా పెరుగుతారు. పిల్లలు రాత్రిళ్లు సరిగా నిద్రపోనివ్వని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిద్రకోసం దొరికే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల కాలకృత్యాలు తీర్చడంలో, స్నానం చేయించడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇబ్బందులను అధిగమించే విధంగా సరైన సంసిద్ధతను కలిగి ఉండాలి. పిల్లలు కొద్దిగా పెరిగి పెద్దైనకొద్దీ పని సులభతరం అవుతుంది. గతంలో చేసిన పనికి ప్రస్తుతం అదే పనికి మూడింతల సమయం కేటాయించుకోవాలి.
వ్యక్తిత్వ వికాసం ..
కవలలు పుట్టిన మరుక్షణంనుండే వారు ఇద్దరిని ఒకేలా చూడాలనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు ఏ వస్తువుకొన్నా ఇద్దరికీ తీసుకుంటారు. దుస్తుల విషయంలో కూడా ఒకే రకమైన దుస్తులు తీసుకుంటారు. దీనితో పుట్టిన మొదటినుండే వారిలో ఒకే రకమైన వ్యక్తిత్వ వికాసం జరుగవచ్చు. కవల పిల్లలైనప్పటికీ వారి వ్యక్తిగత ప్రాధాన్యతను కూడా తల్లిదండ్రులు గుర్తించాలి. కవలలు ఇద్దరికి ఒకే రకమైనవి ఇష్టంగా ఉండవచ్చు. ఉండకపోవచ్చు. వారిలో వ్యక్తిగత నైపుణ్యాలు, సామర్థ్యాలు వేరుగా ఉంటాయి. అటువంటివారి యొక్క నైపుణ్యాలను, సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారి యొక్క ఎదుగుదల బాగుంటుంది.
కవల పిల్లల ఎదుగుదలతోబాటుగా నైతిక విలువల ప్రాధాన్యతను పెంపొందించాలి. పెద్దల పట్ల గౌరవభావం, వృద్ధుల పట్ల ప్రేమ అనురాగం విలువలను గుర్తించేలా పిల్లల పెంపకం ఉండాలి. బాల్యం అంటే ఎంతో మధురమైనది. పాఠశాల మధురానుభవాలు జీవితాంతం మనతోపాటు పెనవేసుకున్న మరువలేని బంధాలు. ఒకప్పుడు పిల్లలు ఆడుతూపాడుతూ చదివేవారు. ఐదేళ్లు వచ్చాకనే పెద్దబాలశిక్షతో పిల్లల చదువు మొదలయ్యేది. అక్షరాలు, గుణింతాలు, ఎక్కాలు, సుమతీ శతకాలు, పంచతంత్రం కథలు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, భాగవత పద్యాలతో నైతిక విలువలే పునాదులుగా పిల్లల చదువులు మొదలయ్యేవి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఐదో తరగతి వరకూ ఒక్కొక్క పాఠశాలలో ఒక్కోరకమైన సిలబస్‌తో పిల్లల చదువులు గుదిబండలా మారాయి. ఉపాధ్యాయుల ప్రాధాన్యత తగ్గి ఎలక్ట్రానిక్ వస్తువులతో పిల్లల అనుబంధం పెరిగిపోతోంది. విలువల మాటే అసలు పాఠశాలలో రావడమే లేదు. ప్రస్తుతం పిల్లల ఫీజునుచూస్తే నర్సరీ పిల్లలకే లక్షలలో పాఠశాలలకు చెల్లించాల్సిన పరిస్థితి. ఇకపోతే పుస్తకాల బరువుమోతతో పిల్లల నడుములు వంగిపోతున్నాయి.
కవల పిల్లలకు ఒకరికిఒకరు ప్రాణంగా చూసుకునే విధంగా, ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా పెంచాలి. ప్రస్తుత పిల్లలు పెద్దల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. వ్యక్తిత్వ వికాసం ద్వారా కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం పట్ల గౌరవాన్ని కలిగించడం మరియు వారి బాధ్యతను తెలియచేస్తూ ఉండాలి. తనకు తానుగా పరిశుభ్రంగా ఉండటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఇతరులను, పెద్దలను గౌరవించడం పిల్లలు బాధ్యతగా గుర్తించాలి. జీవితం అంటే ఏమిటో, సమయం విలువ, మంచిగా మనిషిగా జీవించాల్సిన ఆవశ్యకత, భావవ్యక్తీకరణ, క్రమశిక్షణ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు, నాయకత్వం, మనిషి ప్రవర్తనలు మొదలైన అంశాల పట్ల బాల్యదశలోనే అవగాహన కల్పించాలి. విలువల ద్వారా పెద్దల మాటలను గౌరవించడం, ఉన్నతంగా జీవించడం మానవత విలువలను గుర్తించడం కావల్సిన జ్ఞానాన్ని బాల్య దశలోనే అందించాలి.

- డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321