మెయన్ ఫీచర్

చరిత్ర అధ్యయనం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వం ఇతివృత్తంగా ఉండే సినిమాలు, కథలలో మనకు తరచుగా తారసపడే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఎదుటి మనిషి బాధను, అది జరిగినపుడు వెంటనే అర్థం చేసుకోలేనివారు తర్వాత అటువంటి బాధే తమకు కలిగినపుడు అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇద్దరూ పరస్పరం ఎదురవుతే ఒకరినొకరు కౌగిలించుకుని కలిసి ఏడుస్తారు.‘‘అప్పుడు నాకు తెలిసిరాలేదన్నా’’ అంటే ఇవతలి మనిషి, ‘‘జరిగిందేదో జరిపోయిందిలే. నేను మరిచిపోయాను, నువ్వూ మరిచిపో. నీకు ఈ కష్టం ఎల్లకాలం ఉండేదికాదులె’’మ్మని ఓదార్చుతాడు అవతలి మనిషి. సినిమాలు, కథల్లో ఎదురయ్యే ఈ దృశ్యాలు నిత్య జీవితం నుంచి వచ్చేవే.
అటువంటిదే ఒకదానిని వర్తమాన చరిత్రలో తెలుగువారి జీవితాలలో చూడవచ్చు. తెలంగాణవారు కొన్ని దశాబ్దాలపాటు ము ల్కీ ఉల్లంఘనల బాధను అనుభవించారు. ఆ భాధ అప్పటి సీమాంధ్ర ప్రాంతీయులకు బోధపడలేదు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా బాధకు గురవుతున్నారు. పే ర్లు వేరు కావచ్చు. కాని సారాంశంలో రెం డు బాధలకు సారూప్యాలున్నాయి. అది తె లంగాణ వారికి అర్థమైంది. హోదా అంశం ఇటీవల రాజ్యసభలో చర్చకు వచ్చినపుడు తెలంగాణ అధికాపక్షమైన టిఆర్‌ఎస్‌తో పా టు, అక్కడి ప్రతిపక్షమైన కాంగ్రెస్ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని బేషరతుగా మద్దతునిచ్చారు. అందులో వారికి స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు. ఆం ధ్రప్రదేశ్ వలెనే హోదా కోరుతున్న కొన్ని ఇ తర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలవారు, ఆం ధ్రకు ఆ స్థాయి లభిస్తే ఆ వెంటనే తాము కూడా పట్టుబట్టవచ్చునన్న ఆలోచనతో మ ద్దతునిచ్చారు. ఈ మాటను సాక్షాత్తు మంత్రి వెంకయ్యనాయుడు సభలో చర్చ సందర్భంగా పరోక్షంగా సూచించారు కూడా. కాని తెలంగాణకు అటువంటి ఆలోచన లేదు. ఆమాట కొంతకాలం యథాలాపంగా అన్నప్పటికీ కేంద్రాన్ని లాంఛనంగా కోరలేదు. రాజధాని నగరం లేకుండా ఏర్పడి, లోటు రెవెన్యూతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సత్వరాభివృద్ధి అవకాశాలు లభించాలన్నదే తెలంగాణవారి కోరిక. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు సో దరులపట్ల వారికి గల ప్రేమభావాలు ఈరోజున ఎవరిని కదిలించినా కనిపిస్తాయి. హోదా బిల్లుకు సమర్థన అందుకు తార్కాణం వంటిది. కనుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి చంద్రబాబు సైతం తెలంగాణ సమర్థనను ఒకటికి రెండుసార్లు విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు.
పైన పేర్కొన్న సన్నివేశం వంటిది పూర్తిరూపం తీసుకోవలసిన సమయం ఇదేననాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఈరోజున ప్రత్యేక హోదా ఎంత అసరమైనటువంటిదో, ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి ముల్కీ నిబంధనలు, 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం మొదలుకొని తర్వాతి కాలంలో లభించిన మరికొన్ని హామీలు, జీ వోలు, కోర్టు ఉత్తర్వులు కూడా అంతే అవసరమైనటువంటివి. హోదా హామీ ఉల్లంఘన ఈరోజున ఆంధ్రప్రదేశ్ వాసులను ఎంత తీవ్రమైన బాధకు గురిచేస్తున్నదో, ఎంతటి ఆగ్రహాన్ని వారికి కలిగిస్తున్నదో, ఆయా ఉల్లంఘనలు తెలంగాణ ప్రజలకు కూడా దశాబ్దాలపాటు అటువంటి వేదనను, ఆగ్రహానే్న కలిగించాయి. ఇంకా చెప్పాలంటే అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ. ఎందుకంటే, హోదా అన్నది ఇంకా నోటిమాటగానే అన్న విషయం. అప్పటి ప్రధానమంత్రి పార్లమెంటులో చేసిన లిఖితపూర్వ ప్రకటనగా, భవిష్యత్తులో ప్రధానమంత్రి కానున్న మరొకరు ఎన్నికల సభలో ఆమేరకు విస్పష్ట ప్రకటన చేసి తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చినదిగా ఆ మాటకు ఎనలేని విలువ ఉంటుంది. ఇదే సమయంలో అది ఇంకా చట్టరూపం దాల్చలేదన్నది వాస్తవం. అదేవిధంగా ఈ మొత్తం మాటలు, చర్చల వయస్సు కొన్నినెలలు మాత్రమే.
అందుకు భిన్నంగా తెలంగాణకు చెప్పినవి చట్టరూపం తీసుకున్నాయి. ఆ వ్యవహా రం దశాబ్దాల తరబడి సాగింది. బాధలు ఆందోళనలు, ఆత్మాహుతుల దశకు చేరా యి. కనుక రెండు స్థితులకు మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తించడం తేలిక. ఏది ఏమైనా రాష్ట్ర విభజనతో ఒక స్థితి ముగిసిపోయింది. తెలంగాణ వేదనకు ఆ స్థితి కొనసాగుతుండిన దశలో అర్థం చేసుకున్న అప్పటి సీమాంధ్రులు మరీ ఎక్కువేమీ కాదు. ఆలోచనాపరులలో, రాజకీయ వాదులలో, రచయితలలో, ప్రజాస్వామిక వాదులలో, సాధారణ ప్రజలలో అంతటా కనిపించారు వారు. సాహసించి బాహాటంగా సమర్థించిన వారూ ఉన్నారు. మరొకవైపు ఉద్యమకాలంలో జనసామాన్యంలో భావోద్వేగాలు తలెత్తిన మాట కూడా నిజం. అవి అధికభాగం కొందరు తప్పుడు ప్రచారాలతో రేకెత్తించినవన్నది తెలంగాణ ప్రజలకు కలిగిన అభిప్రాయం.
మొత్తంమీద అవన్నీ ఇప్పుడు సమసిపోయాయి. అంతవరకు సంతోషించదగిన విషయం. ఇటువంటి భావనలు సమసిపోవడమంటే చారిత్రకంగా జరిగిన లోటుపాట్లు దిద్దుబాటు అయ్యేందుకు మొదటి అడుగు పడటమన్నమాట. ఇపుడు దిద్దుబాటన్నది వస్తురూపేణా(మెటీరియల్‌గా) జరగవలసిందేమీ లేదు. కాని పరస్పర అవగాహనల పరంగా జరగాలి. అదే చరిత్ర దిద్దుబాటవుతుంది. సోదరుల మధ్య అది అవసరం. అక్కడినుంచి ఆరంభించి కొత్త చరిత్రను రచించే అవకాశం ఏర్పడుతుంది.
జాతి భావనలు నిజానికి చాలా బలమైనవి. ఆధునిక జాతీయతలు రూపుతీసుకోవడానికి ముందు యుగాలలో అవి భిన్న రూపాలలో ఉండేవి. తర్వాత ఆధునిక రూపం తీసుకున్నప్పటికీ ఒక జాతివారు భౌగోళికంగా విడివడి ఉండినప్పుడు జాతి నిర్మాణాలు ఏకరూపంలో సాగలేదు. తెలుగువారి విషయంలో జరిగిందేమిటో తెలిసిందే. చారిత్రక పరిస్థితుల కారణంగా సీమాంధ్ర ప్రాంతం బ్రిటిష్ వలస పాలనలో, తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో శతాబ్దాలపాటు ఉండిపోయాయి. రెంటింటి కలయికల ఆలోచనలు యూరోపియన్ జాతీయవాద భావజాలాలు ఇటువైపున ఆధునిక శక్తులను జాతీయ స్థాయిలో ప్రభావితం చేయడం, అక్కడినుంచి తెలు గు సీమలకు వ్యాపించటంతో మొదలయ్యా యి. తొలిదశలో ఆలోచనా పరుల మధ్య స్వచ్ఛమైన రూపంలో ఉండిన ఈ ఆలోచనలు సీమాంధ్రకు చెందిన ఆర్థిక- రాజకీయ శక్తులు క్రమంగా బలపడుతూ, తెలుగుజాతి అన్నదానికన్నా తమ స్వప్రయోజనాల దృష్టిలో ఆలోచించడం పెరిగినకొద్దీ జాతి భావనలు కలుషితమయ్యాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడం, మరుసటి సంవత్సరం నిజాం పాలన అంతరించడం అనే పరిణామాలతో, రెండు భూభాగాలలోని తెలుగువారు ఏకజాతిగా ఆవిష్కారం అయ్యేందుకు వీలైన మలుపును చరిత్ర తీసుకుంది.
కాని సమస్యకూడా అప్పుడే మొదలైంది. ఐక్యతకు భూమిక కావలసింది స్వచ్ఛమైన పరస్పర జాతి భావనలు కాగా, సీమాంధ్ర ప్రాంతపు ధనికవర్గాలు ఆర్థిక-రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఆలోచనలు అయ్యాయి. ఇది సీమాంధ్రకు చెందిన సా ధారణ ప్రజలతో నిమిత్తం లేని వ్యూహం. అప్పటినుంచి మొదలుకొని ఆ వ్యూహం, వైరుధ్యం 1956 నుంచి ఎన్ని దశాబ్దాలు గడిచినా ఆగకపోగా బలపడి కొనసాగుతూనే పోయాయి. మధ్యలో ప్రమాద హెచ్చరికలు పదేపదే కనిపించాయి. కాని స్వప్రయోజన వర్గాలు వాటిని లెక్కచేయలేదు. చివరకు తెలుగుజాతి ఏకీకృత నిర్మాణక్రమం పలుమార్లు నేలకు పడి క్షతగాత్ర అవుతూ చివరకు 2014లో ఆ శక్తులకు బలైపోయింది.
ఈ చరిత్రను అందరూ ముఖ్యంగా ఆం ధ్రప్రదేశ్ ప్రజలు, చారిత్రక వాస్తవాల రూ పంలో అధ్యయనం చేయడం అవసరం. నిర్వికారంగా చేయవలసిన ఆవశ్యకత ఉం ది. ఆధిపత్య వర్గాలు ఎప్పుడూ ఉంటాయి. అవి ఎల్లప్పుడూ తమ ప్రయోజనాలకోసం పనిచేస్తాయి. వారికి తాము సత్యం కాగా ప్రజలు మిథ్య. ప్రజల మనోభావాలు, ఆదర్శాలు, ఆకాంక్షలు, అదే రీతిలో తెలుగు జాతి భావనలు అన్నీ మిథ్య మాత్రమే. అవి తమ ప్రయోజనాలకు ఉపయోగపడినంతవరకు సత్యం. ఆ వెనుక నిష్ప్రయోజనకరమైన మిథ్యమాత్రమే. అటువంటి వైఖరివల్ల ప్రజలకు జాతి నిర్మాణ భావనలకు, ఎటువంటి నష్టాలు వాటిల్లినా వారికి చింతలేదు. ఇది తార్కిక స్థితి మాత్రమే కాదు, వాస్తవంగా జరిగినటువంటిది.
కొత్త చరిత్ర ఇక్కడినుంచి మొదలు కావలసి ఉంది. చరిత్ర వాస్తవాల అధ్యయనం అందులో భాగం కావాలి. అది జరిగినప్పు డు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలు తెలంగాణలోని తెలుగు ప్రజలతో ‘‘అప్పుడు నా కు తెలిసిరాలేదన్నా’’ అని మనసు విప్పి అనగలరు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. నేను మరచిపోయాను, నువ్వూ మరచిపో’’ అని తెలంగాణ ప్రజలు తమ ఆంధ్రప్రదేశ్ సోదరులతో అంటూ మనసు విప్పి చెప్పగలరు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఏడ్వగలరు. కలిసి పాడి ఆడగలరు. ఇది సినిమాలు, కథలు జీవితాలలో ఎదురయ్యే సన్నివేశమే కాదు. చరిత్రలో పరుచుకుని ఉన్న అనుభవాలు అనేకం ఉన్నాయి ఇటువంటివి. ఆ చరిత్రలో ఒక పుటను రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కలిసి రచించవలసి ఉంది.
విడిన ప్రాంతాలు తిరిగి కలవగల అవకాశం లేదు. ఎందుకన్నది సుదీర్ఘమైన చర్చ. అవకాశం ఉందనే ఆశాజీవులు కొందరు ఉండవచ్చు గాక. వారిని తప్పుపట్టవలసిన పనిలేదు. కాని అనేకానేక వాస్తవ స్థితిగతు లు అందుకు అనుకూలంగా లేవు. కాని ఏక త్వ భావనకు సరిహద్దులు అడ్డురానక్కరలేదు. కాలేవు కూడా. అందుకు కావలసిన ఒకే ఒక షరతు ఇరువురి బాధలను, వాస్తవ చరిత్రను సోదర భావంతో అర్థం చేసుకోవ డం. అర్థం చేసుకునేందుకు ఆస్కారం కలిగించే సందర్భం ఒకటి ఇపుడు ప్రత్యేక హో దా హామీ ఉల్లంఘనతో ఏర్పడింది. అది, గతకాలపు తెలంగాణ బాధలను కూడ అర్థం చేసుకొమ్మంటున్నది. రెండు బాధలు సృ ష్టించే అవగాహన నుంచి పరస్పర ఆర్ద్రత లు ఏర్పడగలవు. అపుడు భౌగోళిక విభజన లు, నిర్నిమిత్తమవుతాయి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)