మెయిన్ ఫీచర్

శాంతమే రక్షణవలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమతి శతకకారుడు బద్దెన ‘‘తన శాంతమె తనకు రక్ష’’ అని అనడంలో శాంతగుణమే మానవులను కాపాడుతుందని చెప్పాడు. వాగ్గేయకారుడు, నాదబ్రహ్మ అయిన త్యాగరాజు తన కీర్తనలో ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అనీ అన్నారు. శాంతం వల్లనే సర్వ సుఖాలకు మూలాధారం శాంతగుణమే అని తెలుస్తోంది. భూదేవి అంత ఓర్పు స్ర్తిలకు ఉంటుందని అంటారు. అయతే సముద్రమంత సహనం, ఉదారగుణం ప్రతివారికీ అవసరమే. ఆ రెండు ఉన్నాపుడే శాంతి కలుగుతుంది.
శాంత గుణానికి ప్రతీక ధర్మరాజు. ధర్మరాజును కౌరవ సభకు ఆహ్వానించి అతనిని మాయాజూదంలో ఓడించి దుర్యోధనాదులు దురాగతాలు చేశారు. భీమార్జునులు సహించలేక అక్కడికక్కడే ఎదిరించి అడ్డుకోవడానికి ఉద్యుక్తులయ్యారు. ఆవేశంతో ఊగిపోయారు. శాంత స్వభావుడైన ధర్మరాజు అది గమనించి తన సోదరులను వారించి శాంతపరచాడు. లేకుంటే కురుసభ రణరంగంగా మారి ఉండేది. ధర్మరాజు యొక్క శాంతగుణమే పాండవులకు రక్షణగా నిలిచింది.
శాంతగుణం కలిగి ఉండడం మానవుల బలహీనతగా అనుకోకూఢదు. చేతగానితనంఅని అసలు అనుకోకూడదు. శాంతంగా ఉండటానికి కూడా ఒక హద్దు ఉంటాయ. మితిమీరిన ఆగడాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే సహనం నశించి శాంతగుణం స్థానంలో కోపం వచ్చి చేరే అవకాశముంటుంది.
ఇంద్రప్రస్థపురంలో మయసభా నిర్మాణానంతరం పాండవులు శ్రీకృష్ణునికి రాజసూయయాగంలో అగ్రసనాధిపత్యం కట్టబెట్టారు. అది గిట్టని శిశుపాలుడు సభలోనే అందరి ఎదుటా శ్రీకృష్ణుని దూషించడం చేస్తాడు. ఆ దూషణాలనన్నిటినీ శ్రీకృష్ణుడు శాంతగుణంతో సహిస్తాడు. వంద దూషణలు దాటిన తరువాత శాంతగుణం స్థానాన్ని కోపం ఆవహిస్తుంది. దుష్టశిశుపాల మస్తకాన్ని సుదర్శన చక్ర ప్రయోగంతో ఖండిస్తాడు శ్రీకృష్ణుడు.
ఎదుటివారు తప్పు చేసినా వూరుకున్నారు అంటే మనలని క్షమించారు అనుకోవాలి కాని మరేం ఫర్వాలేదు అని ముందుకు పోతే బోర్లాపడుతారు.
దుష్టశిక్షణ సమయంలో కాస్తంత ఆవేశం వస్తుంది. ఆవేశం ఎంతైనా అనర్థదాయకమే. ఆవేశం తెచ్చుకున్నావరు, ఆవేశం ఎవరిపైన చూపితేవారు ఇద్దరూ నష్టపోతారు. ఒక్కోసారి తన కోపమే తనకు శిక్ష అన్నట్టుగా కోపం వస్తే మనిషి శరీరం అనేక వ్యాధులకు గురి అవుతుంది. చేస్తున్న పని ఆగిపోతుంది. అన్నీ నష్టాలే జరుగుతాయ. కోపం నియంత్రణలో ఉండడమే ఎప్పటికైనా మేలు.
ఓసారి విష్ణ్భుక్తుడైన అంబరీషుని ఏకాదశవ్రత చేస్తున్నాడు. ద్వాదశి గడియలు వచ్చాయ. వ్రతాన్ని పారణ చేసే సందర్భంగా జలపానం చేశాడనే నెపంతో శపింపబూనాడు దుర్వాసుడు. అంబరీషుడు మహా విష్ణువును ప్రార్థించాడు. అంతే విష్ణుచక్రం దుర్వాసునిమీదకు విష్ణుమూర్తి పంపించాడు. ఆ విష్ణుచక్రం దుర్వాసుని వెంబడించింది.ఇక చేసేది లేక నా కోపం నాకే ముప్పు తెచ్చిందనుకుని అంబరీషుని శరణువేడాడు. చూశారా. విషయం ఏమిటి అన్నది లేకుండా కోపం తెచ్చుకుంటే ఏలాభం?
శ్రీరామచంద్రుడు ఆవేశం లేకుండా నే 14వేలమంది రాక్షసులను సంహరించాడు. మంచి మాట చెప్పిన విభీషణుని తిస్కరించి అవమానించి చివరకు రావణుడు రామునిచేతిలో సంహరించబడ్డాడు. కోపం వచ్చినా దాన్ని నియంత్రించుకునే శక్తి ఆంజనే యునికి ఉంది కనుక గొప్ప వీరాధివీరునిగా పేరుతెచ్చుకున్నాడు.
కోపం రావచ్చు. కాని అదిధర్మాగ్రహమై ఉండాలి. కోపం రాని మనిషి ఉండడుకదా. శాంత గుణాన్ని ప్రతివారూ అలవరచుకొంటే సర్వవేళలా సుఖ సంతోషాలతో జీవించవచ్చు.

- చివుకుల రామమోహన్