మెయిన్ ఫీచర్

భగవద్గీత - శరణాగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రేయన్ ద్రవ్యమియాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే
బద్ధ జీవితానికి అజ్ఞానం కారణం కనుక దానిని తొలగించే శ్రేష్టమైన యజ్ఞం జ్ఞాన యజ్ఞమేనని, పై శ్లోకం కర్మసాధనగానూ, జ్ఞానము సాధ్యంగానూ నిరూపిస్తోంది. ‘నేను దేహాన్నికాను నేను జీవాత్మను..’ ఈ భౌతిక బంధనంనుండి విముక్తిపొందటమే నా జీవితలక్ష్యం అని గ్రహించటమే జ్ఞానప్రాప్తికి తొలిమెట్టు.
ఇట్టి జ్ఞానాన్ని ఎలా పొందగలమో ఆ ఉపాయాన్నికూడా ఇలా తెలియచేస్తున్నారు కృష్ణపరమాత్మ.
‘తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశే్ననసేవయో
ఉపదేశక్య్రనితే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శిన్‌ః’
అట్టి జ్ఞానమును తత్త్వవేత్తయగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సాష్టాంగ నమస్కారమాచరించి- సమయము చూచి వినయ పూర్వకంగా ప్రశ్నించి, సేవించి గ్రహించు. ఆత్మసాక్షాత్కారం పొందినవారు సత్యాన్ని దర్శించినవారు కనుక వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు.
జ్ఞానసిద్ధి నిమిత్తం ఆధ్యాత్మిక క్షేత్రమున పురోగమించుటకు గురువు యొక్క సహాయము అత్యవసరమని పై శ్లోకం తెలియచేస్తోంది గురుకుల వాసమందు శిష్యుడు ప్రవర్తించవలసిన పద్ధతికూడా చక్కగా చెప్పబడింది. దేనిని తెలుసుకుని మరల ఇట్టి మోహమునకు లోనుకావో- దేనిచే సమస్త ప్రాణులను నీయందునుకూడా చూడగలవో అటువంటి జ్ఞానాన్ని తత్త్వవేత్తల నాశ్రయించి తెలుసుకోమన్నాడు.
భగవద్గీత ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుని కేవల మిత్రునిగా భావించి మాట్లాడినా తన సమస్యకు పరిష్కారం లభించనప్పుడు కృపణత్వమనే దోషమునిండిన స్వభావం కలవాడు. ధర్మవిషయమున సందేహ మనస్కుడు అయిన అర్జునుడు యబ్భ్రేయస్స్యాన్నిశ్చితం బ్రహితనే్మ శ్రేష్యస్నేహం శాధి మాంత్వాం ప్రసన్నమ్ ధర్మ విషయమున సందేహముతో నిన్ను అడుగుతున్నాను. ఏది నిశ్చయముగా శ్రేయస్కరమో దానిని నాకు చెప్పు. నేను నీకు శిష్యుడను నీ శరణుపొందాను. నన్ను శాసించు’అని అహంకారాన్ని పారద్రోలి శ్రీకృష్ణపరమాత్మ పాదాక్రాంతుడయ్యాడు పారమార్థిక క్షేత్రంలో పురోగతి పొందగలిగే మార్గం శరణాగతియే.
‘మనుష్యాణాం సహస్రేషు
కశ్చద్యతత సిద్ధయే
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్వత్‌’
అనేక వేల మంది మనుష్యులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే ముముక్షువులలో కూడా అనేకులలో ఏ ఒక్కడో మాత్రమే యదార్థంగా నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.
మనిషి ఈ లోకంలో అనేక విధాలైన అభిమాన, మమకార, అహంకార దంభాలకై-్ధన, కనక, వస్తువాహనాలకై ఎవరో ఒకరిని ఆశ్రయించి శరణువేడుకున్నాడని కానీ సర్వాధారుడైన సర్వేశ్వరుని ఆశ్రయించటమే నిజమైన శరణాగతి ‘తలైవాహం, మమైవత్వసి తత్వమే వాహమితి ‘త్రేధా’అని మూడువిధాలైన శరణాగతి చెప్పబడింది. నేను నీవాడను అనే తవైవాహం పరమాత్మ సర్వస్వతంత్రుడుగాను భక్తుడాయన ఆధీనుడిగానూ భావించి ఆశ్రయించేవిధం. రెండవదైన తమైపిత్వం భగవంతుని పరతంత్రునిగా భక్తుని స్వతంత్రుడుగా సూచిస్తోంది. ఈ దశలో భగవంతుని తన హృదయంతో కట్టివేసుకోగలడు భక్తుడు. అంతటి మహనీయ భక్తిపరవశుడైన భక్తుని యోగక్షేమాలు తనవిగానే భావిస్తాడు భగవంతుడు. ‘యోగక్షేమం వహామ్యహం’ అని ప్రతిజ్ఞ చేసాడు- నిరూపించడు కృష్ణపరమాత్మ. మూడవ ‘త్వమేవాహం’అనేది నువ్వేనేను అనే అవిభక్తమైన భక్తి. ఇది అద్వైత శరణాగతి ‘వాసుదేవ సర్వమితి’. జీవాభిమానం కలిగివున్నంతవరకూ భగవంతుడు పూర్ణుడు. భక్తుడు అంశం ఉపాధుల అభిమానం వదిలి స్వరూప స్థితిలో నిలిచినప్పుడు భగవంతుడే భక్తుడు. భక్తుడే భగవంతుడు ఇద్దరూ ఒక్కటే! రామాయణంలో ఈ మూడు అవస్థలను హనుమంతుడు రామునివలన పొందాడు
అన్యథా శరణంనాస్తి త్వమే శరణం మమ’అని శరణుజొచ్చిన భక్తుడు ధన్యుడు తరించిపోగలడు. గజేంద్రమోక్షంలో గజేంద్రుడు, మహాభారంతలో ద్రౌపది ఈ స్థితికి వచ్చాకే అనుగ్రహింపబడ్డారు. అర్జునుని నిమిత్తంగా వుంచుకుని ‘సుధీ‘ జనులకు, గుణవంతులై పరితపించు వారికి ఉపనిషత్సారమైన క్షీరామృతం- గీతామృతం అందించాడు పరమాత్మ.తస్మాదేతం సమభ్యసేత్‌ సర్వదేవీ దేవతల స్వరూపం సర్వశాస్త్రాల రూపం. సకల ధర్మాలూ ఇందులో వున్నాయి. కనుక భగవద్గీతను సవ్యంగా- సవ్యంగా అభ్యసించాలి.

- యర్రమిల్లి విజయలక్ష్మి