మెయిన్ ఫీచర్

చట్టసభల్లో కొందరికేనా గుర్తింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత అర్ధ శతాబ్దకాలం నుండి పరిశీలిస్తే కొన్ని రంగాలలో మహిళా సాధికారత జరిగిందని చెప్పక తప్పదు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు మాకెవ్వరు సాటిలేరు, మాకు మేమే సాటి అనే రీతిలో వున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. మగవారితో పోటీపడుతూ, వారికన్నా మేమేమీ తక్కువని అన్ని రంగాలలో ముందంజలో పయనిస్తున్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలో (ప్రభుత్వ, ప్రభుత్వేతర) పనిచేసే ఉపాధ్యాయులలో ఎక్కువగా మహిళలే ఉన్నారంటే అనుమానం అక్కర్లేదు. మునుపటి నీచమైన కొన్ని ఆచార వ్యవహారాలు ప్రక్కకుబెట్టి, అక్కరకు రాని సాంప్రదాయాల జోలికి వెళ్లకుండా నేడు అన్నిరకాల పనులను చేస్తూ కుటుంబాన్ని నడిపే స్థాయిలో వున్నారు.
గతంలో అన్ని కుటుంబాలలో పురుషాధిక్యత కనిపించేది. కానీ నేడు ఎక్కువ సంఖ్యల కుటుంబాలలో మహిళలే కుటుంబాన్ని చక్కదిద్దుతున్నారంటే నమ్మక తప్పని పరిస్థితి. ప్రతి మగాడి విజయం వెనుకాల ఒక మహిళ వుంటుందంటారు, అంటే విజయానికి వారు అందించే ప్రోత్సహం ఎలాంటిదో తెలియకనే తెలుస్తుంది. అన్నిరకాల ఉద్యోగాలు చేస్తూ, శాస్తవ్రేత్తలుగా మారుతూ, అంతరిక్షయానంలోకి ప్రవేశిస్తూ, అన్నిరకాల ఆటలు సైతం మేము ఆడగలమని నిరూపిస్తూన్నారు.
గతంలో ఇందిరాగాంధీ దేశానికి ప్రధానిగా చేసి, మహిళల పాలనలో కూడా రాణించగలరని నిరూపించింది. ఆమె అడుగుజాడల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మహిళలు ముఖ్యమంత్రులుగా విజయవంతమైన పాలననందించారు. 1980లలో దేశంలో ప్రవేశపెట్టిన చట్టాలు-1.తల్లిదండ్రుల ఆస్తులమీద వారి పిల్లలందరికీ ఆడ, మగ అని తేడా లేకుండా హక్కు ఉండటం. 2.విద్యా, ఉపాధి అవకాశాలలో అమ్మాయిలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం లాంటి చట్టాలను సమర్థవంతంగా అమలుజరిపిన మన రాష్ట్రం, చట్టసభలలో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది దేనికి నిదర్శనం? అంటే ఇక్కడ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఒకటి ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా వారికి అవకాశం కల్పించకపోవడం అయితే రెండవది రాజకీయాలపట్ల మక్కువ తక్కువగా ఉండటం. కానీ నేడు కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలపై జరిగే దాడులకు నిరసనగా, వ్యతిరేకంగా పోరాడటానికి వారు చేపట్టే కార్యక్రమాలు వారి నాయకత్వ పటిమతోపాటు ధైర్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి. కానీ తెలంగాణలో దాదాపు 50 శాతం వున్న మహిళలు మొన్న జరిగిన ఎన్నికలలో కేవలం 3.36 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే, వీరి విషయంలో ఎక్కడ లోపం జరుగుతోంది?
దేశంలో రాజకీయ విభాగంలో సోనియా గాంధీ, సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్, మమతా బెనర్జి, మాయావతి, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందిబెన్, ప్రతిభాపాటిల్, మీరాకుమారి లాంటి మహిళా రాజకీయ నాయకురాళ్లను ఆదర్శంగా తీసుకొని తమ హక్కులను తాము నెరవేర్చుకోవాల్సిన బాధ్యత లేకపోలేదు.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎక్కడైనా ఎవరి కుటుంబంలోనైనా ఇంట్లో ఇల్లాలు ఆదర్శంగా నిలుస్తూ, కుటుంబ బాధ్యతలను తీసుకొని తమ కుటుంబ సభ్యుల ఆలోచనలతో, సహకారాలతో బాధ్యతలు చేపడితే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. చాలా గ్రామీణ సమాజాలలో మగవారు మద్యపానానికి బానిసలైనప్పుడు, తాగివచ్చిన భర్తకు తగినబుద్ధి చెబుతూ, తన నియంత్రణలో వుంచుకుంటూ, పిల్లల ఆలనా పాలనా చూస్తూ, అన్నిరకాల పనులు చేస్తూ కుటుంబ భారాన్ని సైతం మోయగలిగే ధైర్యం కలిగి, కుటుంబ పోషణను ముందుండి నడిపించడం చూస్తుంటాము. ఇవన్నీ గమనించిన ప్రభుత్వాలు సైతం ప్రభుత్వ పథకాలను మహిళలకే వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవడం మనం గమనిస్తూనే వుంటాం. కావున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళాలోకం వర్థిల్లాలని, వారికీ తగిన ప్రోత్సాహం లభించాలని, అభివృద్ధిలో భాగం కావాలని ఆశిద్దాం!

-డా॥ పోలం సైదులు