మెయిన్ ఫీచర్

మతం వద్దంటే మరణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లాం మతాన్ని, స్వదేశాన్ని, అయినవాళ్లను విడిచి దూరంగా వెళుతూ.. బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన 18 ఏళ్ల సౌదీ యువతి రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్ ఎట్టకేలకు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ఆశ్రయాన్ని పొందింది. వివరాల్లోకి వెళితే..
రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్ సౌదీ యువతి. సౌదీ అరేబియా చట్టం ప్రకారం మహిళలు పురుషుల సంరక్షణలో ఉండాలి. మహిళ ఉద్యోగం చేయాలన్నా, ప్రయాణించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, చివరికి బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా కుటుంబానికి చెందిన పురుషుల అనుమతి కావాల్సిందే.. అయితే రహాఫ్‌కు చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరిక.. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. వెంటనే రహానా సోషల్ మీడియా ద్వారా 3నాకు స్వేచ్ఛ కావాలి. నేను నా దేశంలో నాకిష్టం వచ్చిన చదువు చదువుకోలేను. ఉద్యోగం చేయలేను. అందుకే నేను దేశం విడిచి వెళ్లాలనుకున్నాను. మా నాన్న నాపై కోపంతో ఉన్నారు. అందుకే నేను నా విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాను2 అని తెలిపింది. తన పరిస్థితి గురించి రహాఫ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడిస్తుండడంతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌదీలో మతమార్పిడికి అవకాశం లేదు. అది నేరంతో సమానం. ఆ నేరానికి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. రహాఫ్ ఒకసారి జుట్టు కత్తిరించుకుంది. అందుకుని ఆమె కుటుంబం రహాఫ్‌ను ఇంట్లోనే ఆరునెలలపాటు బంధించింది. అందుకే రహాఫ్ తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ ఆమె ప్రపంచంలోని అనేక దేశాలకు విజ్ఞప్తి చేసింది. చివరకు రహానా ఆస్ట్రేలియాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం థాయ్‌ల్యాండ్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు తనతో పాటు విమానంలో వస్తున్న సౌదీ దౌత్యవేత్త తన పాస్‌పోర్టును లాక్కున్నాడని రహాఫ్ ఆరోపించింది. థాయ్‌ల్యాండ్ ఇమిగ్రేషన్ అధికారులు రహాఫ్ దగ్గర సరైన పత్రాలు లేవని కారణాలు చెప్పి.. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆమె కుటుంబం చెంతకు తిప్పి పంపేందుకు ప్రయత్నించారు. రహాఫ్ మాత్రం తనకు సౌదీకి తిరిగివెళ్లే ఉద్దేశ్యం లేదని చెప్పింది. అయినా వినకుండా ఆమెను జనవరి 7వ తేదీన సౌదీకి వెళ్లేందుకు టికెట్లు తీశారు. కానీ సౌదీ విమానం ఎక్కడానికి నిరాకరించిన రహాఫ్ తనను తాను ఎయిర్‌పోర్టులోని హోటల్ రూంలో బంధించుకుంది. 3నేను ఇస్లాం మతాన్ని వదిలేశాను. కాబట్టి నా కుటుంబానికి నేనంటే పగ. వారు నన్ను చంపేయడానికి చూస్తున్నారు. కాబట్టి నా జీవితం ప్రమాదంలో ఉంది2 అంటూ ఆందోళన వ్యక్తం చేసింది రహాఫ్. థాయ్‌ల్యాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను థాయ్‌లోనే ఉండమన్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థతో పాటు, మానవ హక్కుల సంస్థలు రహాఫ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం రహాఫ్ పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ సంఘటనలతో దిగొచ్చిన థాయ్ ఇమిగ్రేషన్ అధికారులు రహాఫ్‌ను థాయ్‌ల్యాండ్‌లోనే ఉండేందుకు అనుమతించారు. కానీ ఆమె ఐక్యరాజ్యసమితి ఆశ్రయం లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. థాయ్‌ల్యాండ్ ఐక్యరాజ్యసమితి శరణార్థి ఒప్పందంలో భాగస్వామి కాదు. శరణార్థులకు ఆ దేశం న్యాయపరమైన రక్షణ కల్పించదు. అంతకుముందు థాయ్ న్యాయవాదులు కొందరు ఆమెను స్వదేశానికి పంపే ప్రయత్నాలను ఆపాలని కోర్టును ఆశ్రయించినా, కోర్టు దాన్ని తోసిపుచ్చింది. కానీ రహాఫ్ ఎట్టకేలకు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ఆశ్రయం పొందింది. సౌదీ నుంచి పారిపోవాలనుకున్న మహిళల్లో రహాఫ్ మొదటి మహిళ కాదు. గతంలో కూడా ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. 24 ఏళ్ల దినా అలీ లస్లూమ్ కూడా సౌదీ నుండి ఆస్ట్రేలియా వెళుతుండగా ఆమెను మనీలా ఎయిర్‌పోర్ట్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. అంతకు మునుపే ఆమె తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది. సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లిన లస్లూమ్ పరిస్థితి ఏమిటో.. ఆమె ఎలా ఉందో? ఇప్పటివరకుతెలియలేదు.