మెయన్ ఫీచర్

మీడియా మిడిమేలం మామూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛీ..ఇదేం జర్నలిజం? ఇదేం మీడియా? అస లు మీడియా మారాలి! చిన్నారులు, మహిళలపై దాడులను పదేపదే చూపించడమేమిటి? చనిపోయి పుట్టెడు కష్టంలో ఉన్న వారి వద్దకు వె ళ్లి ఎలా ఫీలవుతున్నారని అడగడమేమిటి’?.. ఇదే దో రోజూ చానెళ్లు చూసేందుకు అలవాటుపడిన సామాన్యుడి వ్యాఖ్య కాదు. ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరుడు, విసుగుతో మీడియాను నిలదీసిన వైనమిది! నరసింహన్ సోదరుడు పేలుళ్లలో చనిపోతే మీడియా గొట్టాలు ఆయన దగ్గరకు వె ళ్లి, ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించిన వైనాన్ని, ప్ర థమ పౌరుడు రాఖీ పండుగ రోజు గుర్తు చేసుకున్నారు. అలా బాధితులను ఇబ్బందులు పెట్టే బ దులు వారికి సాయం చేయాలన్నది నరసింహన్ కోరిక. గవర్నరు గారు ఇంకా సత్తెకాలపు రోజుల్లో ఉన్నట్లున్నారు. దొరకక దొరికిన వార్తను, మళ్లీ కొత్త వార్త దొరికేవరకూ ఇరవై నాలుగు గంటలూ చూపించకపోతే చానెళ్లకు తెరవు ఉండదు. అస లు సమాజాన్ని ఉద్ధరించేందుకే తమ చానెళ్లు పు ట్టాయని, గొప్ప గొప్ప వార్తలన్నీ ముందుగా తెరకెక్కించిన ఘనత తమదేనని తమ భుజాలు తామే చరచుకోకపోతే అవి చానెళ్లు ఎందుకవుతా యి? చిన్నారులపై మృగాళ్ల అత్యాచార వార్తలు చూపిస్తే, దాని ప్రభావం సమాజంపై పడుతుందని తెలియని వాళ్లు చానెళ్లలో పనిచేస్తున్నారనుకుంటే తప్పులోకాలేసినట్లే.
చావు బతుకుల్లో ఉన్న మనిషిని ఓబీ వ్యాన్లలో పక్కనే ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా, ఏం జరిగిందని గొట్టాలు పెట్టి హింసించడం బాధ్యతారాహిత్యమని చానెళ్లు నడిపే కొమ్ములు తిరిగిన జర్నలిస్టులకు తెలియదనుకోవడం అమాయకత్వం. మరి అన్నీ తెలిసినా ఈ కిరాతకాలేమిటని అడిగిన వాడే అసలైన అమాయకుడు! అవి చూపించకపోతే చానెళ్ల రేటింగులు పెరగవు మరి. ప్రతి చానెలు తన ముందో వెనుకో ఒక ట్యాగ్‌లైను పెట్టుకుని, సమాజాన్ని వెలిగించేస్తామని భజన చేసుకునేవే. కానీ చిన్నారులు, మహిళలు, దిక్కులేని వారు కూడా ఆ సమాజంలోని వారేనని గుర్తించకపోవడం క్షమార్హం కాదు.
ఇది చాలా ఏళ్ల క్రితం మాట. ఒంగోలులో ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు. అక్కడికి కూతవేటు దూరంలోనే ఆసుపత్రి. వార్త తెలిసిన మీడి యా పండితులంతా అక్కడ వాలిపోయారు. చా వుబతుకుల మధ్య ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయకుండా, ఒక్కొక్కరు ‘ప్రత్యేకం’గా హింసించారు. దానితో బాధితుడు ఆసుపత్రికి వెళ్లకుండానే బాల్చీ తనే్నశాడు. ఆ తర్వాత బాధితుడి మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాధితుడు బతికుండగా తీసిన వీడియోను రోజంతా చూపించారు.
సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సమయంలో జరిగిన మరికొన్ని విన్యాసాలు కూడా చూద్దాం. ఉద్యమం రోజున పట్టుమంది పదిమం ది లేకపోతే, మీడియా ప్రతినిధులే దారిన వెళ్లే దానయ్యలను పోగేసి, వారికి ఏం మాట్లాడాలో చెప్పి, సదరు ఉద్యమానికి భారీ స్పందన వ్యక్తమయిందని గొట్టాల ద్వారా ఆ వార్తను గాల్లో వదిలారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ప్రైవేటు కాలేజీలపై దాడులు చేశారు. ఆ సమయానికి అక్కడికి చేరుకోలేని చానెళ్లు తాము వచ్చాము కాబట్టి, తమకోసం మరోసారి కుర్చీలు పగులగొట్టమని కాలేజీ చిరంజీవులను పురమాయిస్తే, ఓ అదెంత భాగ్యం? అసలు టీవీ ల్లో కనపడేందుకే కదా ఈ పుణ్యకార్యాలని, సద రు చిరంజీవులు మీడియా కోసం మరోసారి తమ ఆగ్రహం ప్రదర్శించారు. ఆ తర్వాత టివి పుటేజీల ఆధారంగా విద్యార్ధులందరిపై కేసులు బనాయించారు. అది వేరే విషయం! అంటే నష్టపోయిందెవరు అనేదానికంటే నష్టం చేసిందెవరన్నదే ప్రశ్న.
సూరి బావ కళ్లలో మెరుపులు చూడాలన్నదే తన లక్ష్యమని మొద్దు శీను ప్రత్యేకించి పిలిపించుకున్న చానెళ్లలో ప్రవచిస్తే, ఆయన ఆనుపానులను పోలీసులకు చెప్పకుండా, మొద్దు శీనును పట్టుకోవడంలో సర్కారు విఫలమయిందని గాల్లోకి మరొక వార్తను వదిలారు. అంటే ఇక్కడ తమకు సామాజిక బాధ్యత అవసరం లేదని, తాము ఈ భూమీద ప్రత్యేకంగా సృష్టించబడిన శక్తులమని చెప్పడమే కదా? బతికుండగానే అనేకమంది ప్రముఖులను చంపేసిన పుణ్యమూర్తులున్న మీడియా మనది.
ఒక జాతీయ ఆంగ్ల వారపత్రిక బతికున్న మోదీకి విగ్రహం పెట్టి, దానికి బీటలు వారినట్లు గ్రాఫిక్స్‌లో చూపించింది. అంటే గుజరాత్‌లో కలహాల వల్ల బిజెపి బలహీనమవుతోందని, మోదీ ప్రతిష్ఠ దెబ్బతిందన్నది కవిభావన. కానీ, విగ్రహాలు జీవించిన వారికి కట్టరన్న ఇంగితం ప్రదర్శించకుండా, ఒక దేశ నేత ఫొటోను ఇష్టారీతిన వాడుకోవడమేనా మీడియా స్వేచ్ఛ పరమార్ధం? గిట్టని వారి వ్యక్తిత్వ హననంతో పైశాచికానందం అనుభవించే మీడియా స్వేచ్ఛ అవసరమా అన్న చర్చ జరిగితే నష్టపోయేది మీడియానే. కాబట్టి, మాననీయ నరసింహన్ గారు మీడియాలో మార్పు రావాలని కోరుకోవడం అత్యాశనే. గవర్నరు గారు ఇంకా దేశోద్ధారక వారి రోజుల్లోనే ఉన్నట్లున్నారు. అప్పటి కథవేరు. ఇప్ప టి మీడియా పరమార్ధం వేరు.
ఏదో ఒక పార్టీని మోయడం, రాజగురువుగా మారడం, అందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టులు, పవర్ ప్రాజెక్టులు, అసెంబ్లీ లైవ్ టెలికాస్టులు, పుష్కర కవరేజీ, ప్రత్యేక సంచికలతో కోట్లకు పడగలెత్తడటమే ఇప్పటి మీడియా వృత్త్ధిర్మమని గవర్నరు గారు ఎప్పుడు తెలుసుకుంటారో? తాము చెప్పినట్లు వినేవారికి పతాకశీర్షికలు, పడనివారిని లోపలి పేజీల్లోకి నిర్దాక్షిణ్యంగా తోసివేయడమే ఇప్పటి జర్నలిజమని ఎప్పటికి తెలుసుకుంటారో మరి! ఏదేమైనా ఆశ మంచిదే. అత్యాశనే పనికిరాదు. అందులోనూ మీడియా విషయంలో!
* * *
ప్రత్యేక హోదా నాటకంలో ఇప్పటివరకూ వౌనంగా ఉన్న కమలదళం నోరు విప్పి తెగించడం కొత్త పరిణామం. బాబు అండ్ కో హోదాపై చేస్తున్న రాజకీయం వెనుక, మోదీని భ్రష్ఠుపట్టించే ఎత్తుగడ ఉందని కమలదళం చాలా ఆలస్యంగా గ్రహించింది. మోదీ మళ్లీ ప్రధాని కావడం బాబుకు ఇష్టం లేనందున, మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ఎత్తుకున్నారన్న కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. కాంగ్రెస్‌తో కలసి బాబు బిజెపి పుట్టి ముంచే కుట్రకు తెరలేపారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి కొత్త కోణంలో బాంబు పేల్చారు. సురేష్‌రెడ్డి పేల్చిన బాంబు తెదేపాకు తగిలితే బా గానే ఉండేది. కానీ తెదేపాకు దెబ్బ తగిలితే, తమ చేతికి కట్టుకట్టించుకునే బిజెపి విభీషణులకే అవి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి.
బిజెపిని అప్రతిష్ఠపాలుచేయడమే తెదేపా అజెండా అని ఏడాది క్రితం విశాఖ కార్యవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన మాటను ఇప్పుడు అందరూ ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. రాష్ట్ర బిజెపిని ముంచాలన్నా, తేల్చాలన్నా అది అందరితో అయ్యే పనికాదు. అలాంటి విద్య అందరికీ రాదు. ఒకరిద్దరితోనే అది సాధ్యం. హోదా అనుభవిస్తోన్న రాష్ట్రాలకు ఏడాదికి 700 కోట్లు మాత్ర మే వస్తుంటే, సుజనాచౌదరి నుంచి బాబు వరకూ హోదా వస్తే వేల కోట్లు వస్తాయని చెబుతుంటే.. సురేష్‌రెడ్డి వంటి అమాయకుడి మాదిరిగా బిజెపి పెద్దతలలు ఖండించకుండా, తెదేపా సుఖం కోరుకునే వౌన మిత్రులున్నంత వరకూ బాబుకు బెంగ ఎందుకు? హోదా ముసుగులో మోదీ పుట్టి ముంచేందుకు తెదేపా రాజకీయం చేస్తోందని సురేష్‌రెడ్డి వంటి నేతలు చాలా ఆలస్యంగా గ్రహించినా, జనాలకు అది ఎప్పుడో తెలిసిన నిజం. బిజెపిని వదిలించుకోవాలని తెదేపా, తెదేపాను వదిలించుకునే మార్గాల కోసం భాజపా సాగిస్తున్న ‘సానుకూల సమరం’లో విజేత ఎవరో ఇంకో ఏడాదిన్నరకు గానీ తెలియదు. అప్పటివరకూ ఈ దోబూచులాట తప్పదేమో?!
* * *
అనుభవమయితే గానీ తత్వం బోధపడదు. ఈ వాస్తవాన్ని కోదండరామ్ సారు ఆలస్యంగా గ్రహించారు. ఆయనకు రెండేళ్ల తర్వాతగానీ తత్వం బోధపడలేదు మరి. తన ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, తెలంగాణ వచ్చినా సమైక్య వా సనలు పోలేదని మాస్టారు వాపోయారు. తెలంగాణ వచ్చి రెండేళ్లయినా ప్రజల ఆకాంక్షలు తీరలేదని, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదంటూ కోదండరాముడు కనె్నర్ర చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం కొనసాగుతుందని శపథం చేశారు.
మరికొందరు తెలంగాణవాదులు ఒకడుగు ముందుకేసి, ఆంధ్ర ఆత్మలే తెలంగాణ ఫాంహౌసులో తిరుగుతున్నాయని, వైఎస్ ఆత్మ తెలంగాణ పాలకులను ఆవహించిందని వాపోతున్నారు. మరోవైపు జోనల్ వ్యవస్థ రద్దు పైనా ఉద్యోగుల్లో వాదనలు వినిపిస్తున్నాయి. సమైక్యపాలనలోనూ జోనల్ వ్యవస్థ వద్దన్న డిమాండ్ ఉండేది. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు జోనల్ వ్యవస్థ మంచిదేనని చెప్పారు అది వేరే విషయం.
ఏళ్లపాటు పౌరహక్కుల ఉద్యమాలను ముం దుండి నడిపించిన కోదండరామ్ మాస్టారుకు రాజ్యలక్షణాలు తెలియకపోవడమే విచిత్రం. ఫోన్లు ట్యాప్ చేయడం కూడా రాజ్యలక్షణంలో భాగమే. ఒకవేళ జయశంకర్ సారు బతికున్నా ఆయనకూ ట్యాపింగ్ బాధ తప్పేదికాదు. ఉద్యమకారుడు పాలకుల అవతారమెత్తినంత మాత్రా న, రాజ్యలక్షణాన్ని విస్మరిస్తారనుకోవడం పొరపాటు. పాలకులెవరైనా వారిని నడిపించేది పోలీసులే. పోలీసు స్వభావం విభజన, వాదాలకు అతీతంగా ఒకే కోణంలో ఉంటుంది. కాకపోతే కోదండ వంటి ‘ప్రజాస్వామ్య విప్లవ మూర్తుల’ కు అది అణచివేతలా కనిపిస్తుంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తాను అరెస్టవుతానని కోదండ బహుశా ఊహించి ఉండరు. మావోయిస్టులే రాజ్యమేలుతున్న నేపాల్‌లోనే రాజ్యలక్షణాలు కనిపిస్తుండగా, తెలంగాణలో కనిపించడంలో వింతేముంది?

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144