మెయిన్ ఫీచర్

భోగి పండుగ విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి మూడు రోజుల పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలిరోజును ‘్భగి’గా, రెండో రోజు ‘మకర సంక్రాంతి’గా, మూడో రోజు ‘కనుమ’గా, నాలుగో రోజు ‘ముక్కనుమ’గా పిలుస్తారు. ఇందులో తొలిరోజును భోగిపండుగగా జరుపుకుంటారు. ‘్భగ’ అనే పదం నుండి భోగి అనే మాట వచ్చింది. ‘్భగ’ అంటే వేడి లేదా మంట అని అర్థం. దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను బోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావహ దృక్పథానికి సంకేతం.
భోగి మంట
భోగిరోజున తెల్లవారక ముందే లేచి భోగిమంటలు వేస్తారు. ఆవు పేడ పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల అవశేషాలు, తాటాకులు, అప్పటికే కోసిన పంటల ఎండు అవశేషాలు వేసి రాజేసి ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్పగా చెప్పుకుంటారు. తెల్లవారుజామున వణికించే ఆ చలిలో చిన్నా పెద్దా అంతా చేరి చలిమంటలు కాచుకుంటారు. పనికిరాని చెడు, పాత ఆలోచనలను వదిలించుకుని కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును సిద్ధం చేయడమే భోగి మంట వెనకున్న పరమార్థం. అయితే ప్రస్తుతకాలంలో పాత సామానుకు బదులు పాత టైర్లు, కిరోసిన్, ప్లాస్టిక్ వస్తువులను వేస్తున్నారు. ఫలితంగా పర్యావరణంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో హానికరం.
నలుగు
భోగిమంటలు పూర్తికాగానే తలకి, ఒంటికి నువ్వుల నూనెను పట్టించి మర్దన చేసుకుని కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల చలి వాతావరణం కారణంగా ఒంట్లో చేరిన కఫ దోషాలు తొలగిపోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. అంతేకాదు.. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం.
పులగం
భోగినాడు కొత్త బియ్యంతో చేసిన పులగం తినడం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచికేగాక పోషకాల పరంగానూ ఎంతో మేలైనది. చలికాలంలో జీర్ణశక్తిని పెంచే ఈ పులగాన్ని భోగినాడు తప్పక తినాలని పెద్దలు చెబుతారు.
భోగి పులక
కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర నీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్లీ పంటకోసం సాగుభూమిలో నీరు పారించడానికి పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగిరోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.
బొమ్మల కొలువు
భోగినాటి సాయంత్రం చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను క్రమ పద్ధతిలో ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేవీ దేవతల పాటలు పాడి వారి ఆశీస్సులు కోరుకుంటారు.
భోగి పండ్లు
భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగు పళ్లు పోస్తారు. భోగిపండ్లు కోసం రేగుపళ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను కలుపుతారు. కొంతమంది శనగలు కూడా కలుపుతారు. రేగు పళ్లను పిల్లల తలపై పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు భావిస్తారు. భోగిపండ్లు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పళ్లను బదరీఫలాలు అని కూడా పిలుస్తారు. శివుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రటం రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్క్ఫలం అనే పేరు కూడా వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా భోగిపండ్లను పోస్తారు. కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 సంవత్సరాల లోపు చిన్నారుల తలపై భోగిపండ్లను పోస్తారు. *