మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

114.పేరుప్రతిష్ఠలకై దేవులాడు వారు భ్రాంతిలో పడి కొట్టుకొనుచున్నారు. విధాతయే లేక సర్వేశ్వరుడే సమస్తము నియమించుచున్నాడనియు, అన్నిటికిని అతడే కర్త అనియు గమనింపజాలరు. వారు పాపము! ‘‘సర్వేశ్వరా! అన్నిటికిని నీవే కర్తవు, నీవే నియామకుడవు’’ అని బుద్ధిమంతుడు భావించును. పామరులును భ్రాంతిమతులను ‘నేను, నేను’ అని ప్రలాపింతురు.
పక్వాహంకారము - అపక్వాహంకారము
115.అహంకారము రెండు విధములుగానున్నది. ఒకటి- పక్వము, రెండవది అపక్వము. ‘నాదేమియు లేదు, నేనేమి చూచినను, చేసినను, అనుభవించినను, వేయేల- ఈ శరీరము సైతము నాది కాదు; నేను నిత్య ముక్త బుద్ధస్వరూపుడను’’ -ఇట్ట్భివములతో గూడినది పక్వమైన అహంకాము. ‘ఇది నా యిల్లు, నా బిడ్డ, నా భార్య, నా తనువు’ -ఈ విధమైన భావన కలుగజేయునది అపక్వమైన అహంకారము.
116.‘నేను భగవంతుని సేవకుడను’ అని భావించుట భక్తుని అహంకారమునకు లక్షణము. ఇట్టిది విద్యాహంకారము. ఇదియే పక్వాహంకారమనియు జెప్పబడును.
117.‘‘తంటాలమారి అహంత’’ అనగా ఎటువంటిది? ‘‘ఏమి! వారు ననె్నరుగరా? నేనింత ధనవంతుడను గదా, నన్ను మించిన ధనికులెవరు? నాకంటె అధికులెవరు?’’ అని మిట్టిపడు నహంతయే ‘తంటాల మారి అహంత’, హానికరమైన అహంత.
118.నరుని లౌకికునిగను కామినీ కాంచనములకు దాసునిగను జేయు నహంకారమే హానికరమగు నహంకారము. జీవాత్మకును పరమాత్మకును నడుమ ఈ అహంకారము వచ్చి పడుట చేతనే వారిరువురును వేరుపడుచున్నారు. నీటిమీద కఱ్ఱను వేసినయెడల ఆ నీరు విభాగమైనట్లు కన్పించును. అహంకారమే రుూ కఱ్ఱ. దీనిని తొలగించితివా, నీరు మరలా అభిన్నమై కాన్పించును.
అహంకారమును జయించుటెట్లు?
119. ‘నేను’ అను దానిని గూర్చి దాని ఆనుపానులను గని పట్టవలయునుని ప్రయత్నించియెడల అది కేవలము అహంకారమునకు సంజ్ఞ అని తెలియవచ్చును. కాని దానిని తొలగించుకొనుట కడు దుర్లభము. కావున సాధకుడిట్లు భావింపవలయును. ‘ఓ పాపిష్టమైన అహంకారమా! ఏ విధముగను నీవు నన్ను విడువకున్న యెడల భగవంతుని దాసురాలవై యుండుము’’. భగవంతుని సేవకుడనని భావించు నహంకారమునే పక్వాహంకారమందురు.
120.శంకరాచార్యులను ఒక శిష్యుడు చిరకాలము సేవించుచుండెను. కాని వారాతని కేమియుపదేశము చేసి యుండలేదు. శంకరులొకప్పుడు ఒంటరిగా గూర్చుండి యుండ వెనుకనుండి ఎవ్వరో వచ్చుచున్నటుల కాలి చప్పుడు విననయ్యెను. ఆచార్యులు, ‘ఎవరక్కడ?’ అనిరి. ‘నేనే’ అని ఆ శిష్యుడు పలికెను. శంకరాచార్యులు అప్పుడాతనికిట్లు బోధించిరి- ఈ ‘నేను’ అనునది నీకంత ప్రియమైన యెడల దానిని అనంతముగా పెంచుము. (అనగా విశ్వమంతయు నీవేయని గ్రహింపుము) లేదా, దానిని పూర్తిగా విడిచిపెట్టుము.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి