మెయన్ ఫీచర్

నిరుపయోగమవుతున్న స్వాతంత్య్ర ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల కోసం ఎవరెన్ని చిత్రవిచిత్ర విన్యాసాలు చేసినా తమ మూలాలను విస్మరించకూడదు. ఒక్కొక్క తరానికి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి తనదైన ఒక్కొక్క నినాదం ఉంటుంది. దాని సాఫల్యం కోసం వారు జన్మతః అహరహరం శ్రమిస్తుంటారు. నరేంద్ర మోదీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రధాన నినాదం ‘సబ్‌కా భలా సబ్‌కా వికాస్’. నిజానికి భాజపాకు ఒక స్పష్టమైన ఎజెండా ఉంది. కశ్మీరుకు సంబంధించి 370వ అధికరణను రద్దు చేయడం, గోహత్య నిరోధానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధలను అమ లు చేయడం, సంస్కృతి, సంస్కృతాన్ని వ్యా ప్తి చేయడం, కామన్ సివిల్‌కోడ్, సాంస్కృతిక ఏకాత్మమానవాతావాదం, ఇలాంటివి భాజపా ఎజెండాలోని ప్రధాన అంశాలు. ఐతే వీటన్నింటిని పక్కన పెటి ట‘సబ్‌కా భలా సబ్‌కా వికాస్’ అనే నూతన నినాదంతో నరేంద్ర మోదీ ఘనవిజయాలు సాధించడం గమనార్హం. ఈ వికా సం గుజరాత్ తరహాలో ఉంటుందని చెప్పా రు. జలవసతి లేని కచ్ ప్రాంతంలో ఎడారిలో మామిడిపండ్లు కాయించారు. సూరత్, ఆనం ద్ వంటి ప్రాంతాల్లో మనం తిరుగుతుంటే మనం ఇండియాలో ఉన్నామా లేక వాషింగ్టన్‌లో ఉన్నామా అనే భ్రాంతి కలుగుతుంది. ఇది కార్పొరేట్ డెవలప్‌మెంట్ అని వామపక్షీయులు విమర్శించినా గుజరాత్ మాత్రం దే శంలో అగ్రశ్రేణి రాష్ట్రం. అంటే నరేంద్ర మోదీ ఆర్థిక వికాసం మీద దృష్టి పెట్టారు. ఇందులో తప్పేంటి?
భారత స్వతంత్ర ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ నినాదం ‘‘సోషలిస్టు ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ’’. ఈ ‘ప్యాటర్న్’ అనే పదానికి రాజకీయ విశే్లషకులు చాలా భాష్యాలు చెప్పా రు. భారీ పరిశ్రమల స్థాపన నెహ్రూ ఎజెండా. లాల్‌బహదూర్ శాస్ర్తీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం జాతీయ ఎజెండాగా మారింది. 1962లో చైనా చేతిలో భారత దేశం ఓడిపోయింది. ఆ దుస్థితి మళ్లీ పట్టకూడదు అని శాస్ర్తీగారు ‘జై జవాన్’ అనే నినాదం ఇచ్చారు. ఇది సఫలీకృతమయింది. 1966 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఇందిరాగాంధీ ‘గరీబీ హాటావో’ అనే నినాదం ఇచ్చా రు. అందుకు ఆమె ఇరవై సూత్రాల పథకం అని ఒక ఎజెండా రూపొందించారు. 14 ప్రధా న బ్యాంకుల జాతీరుూకరించారు. రాజభరణాల రద్దు వంటివి ఆమె చేయడానికి కారణం వామపక్షీయుల మద్దతును తన ప్రభుత్వానికి సాధించుకోవాలన్న తాపత్రయమే. వామపక్ష మూల సిద్ధాంతం ప్రకారం ప్రైవేటు సెక్టారును గౌరవించరు. వ్యక్తులకు స్వంత ఆస్తి ఉండకూడదు.
అలాగే 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంలో 94 వేలమంది పాక్ సైనికులు బందీలుగా భారత్‌కు చిక్కారు. ఆక్రమిత కాశ్మీరు నుండి ఖాళీచేసి వెళితే ఈ బందీలను విడిచిపెడతాం. అని షరతు విధించినట్లయితే కశ్మీరు సమస్య 1971లోనే పరిష్కారమయ్యేది. కానీ ఇందిరాగాంధీ ఆపని చేయలే దు. రాజకీయ చర్చలు సిమ్లా ఒడంబడిక వర కే పరిమితమైనాయి. ఐతే రాజ్యాంగంపై 1975లో అత్యాచారం జరిగింది. ప్రజల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయి. పత్రికలు స్వేచ్ఛను కోల్పోయాయి. ఇక రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ‘జై విజ్ఞాన్’ అనే నినాదం తెరమీదకు వచ్చింది. దీని అర్థం ఏమంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, టివీలు, కంప్యూటర్లు సెల్‌ఫోన్లు సామాన్యునికి అందుబాటులోకి వచ్చాయి.
పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ‘సరళీకృత ఆర్థిక విధానం’ అనే సంస్కణాత్మక ధోరణి మొదలైంది. చంద్రశేఖర్ హయాంలో జబ్బునపడ్డ భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించిన ఘనత పివికి దక్కుతుంది. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఆర్థిక ఎజెండాలో ఆమెరికన్ కంపెనీలకు తలుపులు తెరచి ‘రూపాయలు చెట్లకు కాయవు’ అని వ్యాఖ్యానించినా ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ఆయన పదవీకాలంలో విశ్వరూపం దాల్చిన అవినీతే కారణం! నరేం ద్రమోదీ అధికారంలోకి రావడానకి ప్రత్యక్ష కారణం కూడా ఇదే. ప్రజలు కుంభకోణాల కాంగ్రెస్ నుంచి విముక్తి పొందాలని ఆశించారు. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోదీ ‘సబ్‌కా వికాస్’ అనే స్వీయమంత్రాన్ని పఠించసాగారు. మరో విషయ మేమంటే సాంస్కృతిక జాతీయవాదం అనే ఎల్‌కె అద్వానీగారి నినాదం వెనుకబడి, ‘సామాజిక సమరసత’ అనే నినాదం మోదీగారి కాలంలో ఊపందుకోవడం. ఇది కాలం తెచ్చిన మార్పు. ఆమాటకొస్తే 2002 నాటి నరేంద్ర మోదీ వేరు, 2016 నాటి నరేంద్రమోదీ వేరు. ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరు కా దు. 1947 నాటి కాంగ్రెస్ 2016 నాటి కాం గ్రె స్ ఒకటనేనని చరిత్రకారులు అంగీకరించలేరు.
మోదీ అధికారంలోకి వచ్చాక గంగా ప్రక్షాళన కార్యక్రమం ఊపందుకుంది. నిజానికి రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గంగా ప్రక్షాళనోద్యమం మొదలైంది. ఐతే ఆ కార్యక్రమం ఉత్తరప్రదేశ్ ఎన్నికల రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చేసిన పని. తక్కిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే, యుపిలో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ. వారి ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి. అందుకని మాయావతితో సహా అన్ని రాజకీయ పక్షాలు బ్రాహ్మణ వర్గా న్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించడం, అభ్యర్థులుగా బ్రాహ్మణులకు టికెట్లు ఇవ్వడం గమనార్హం. సారాంశం ఏమంటే కుమారి ఉమాభారతి గంగా ప్రక్షాళన బాధ్యతలు స్వీ కరించడానికి ముందే ఈ ప్రక్షాళనోద్యమాలు మొదలైనా అది చిత్తశుద్ధితో కాక రాజకీయ ప్రయోజనాలకోసమేని తాత్పర్యం. ప్రతి భారతీయుడు తన జీవనకాలంలో ఒక్కసారైనా కాశిని చూడాలని గంగలో స్నానం చేయాలని కోరుకుంటాడు. అనేకానేక కారణాలవల్ల గంగానది కలుషితమయింది. ఒకప్పుడు సరస్వతి అనే నది ఉండేది. ఈ నదికి సంబంధించిన వర్ణనలు ఋగ్వేదంలో చాలాచోట్ల కనిపిస్తాయి. నేడు ఆ నది అంతర్థానమైంది. గంగానదికి ఆ దుస్థితి పట్టే అవకాశం ఉంది.
ఇక గోవు విషయానికి వస్తే గత నూరు సం వత్సరాలుగా భారత రాజకీయాలు గోవు చుట్టూ తిరుగుతున్నాయన్నది చరిత్ర విద్యార్థులకు తెలుసు. మహాత్మాగాంధీ, దయానంద సరస్వతి తాము గోరక్షుకులమని ప్రకటించారు. దయానంద సరస్వతి గోహత్యా నిషేధంపై ఒక పుస్తకం రచించారు. 1955 నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఆర్‌ఎస్‌ఎస్ గో హత్యా నిరసనోద్యమం జరిపింది. హైదరాబాద్ సమీపంలోని అల్ కబీర్ అనే గోహంతక యంత్రశాలను మూసివేయించడం కోసం ఆలె నరేంద్ర వంటివారు సత్యాగ్రహా లు చేశారు. ఫలితంగా ఆ యంత్రాగారం తె లంగాణ నుంచి తరలిపోయింది. 2016, ఆగ స్టు 14న విశ్వహిందూ పరిషత్ అధినేత ప్రవీణ్ తొగాడియా, అంతకు ముందు ప్రధా ని నరేంద్ర మోదీ నకిలీ గోసంరక్షకులపై చేసి న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇది చాలా సం చలనం సృష్టించింది.
ప్రకాశ్ జవదేకర్ విద్యామంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, 2016, ఆగస్టు 13న హైదరాబాదు వచ్చి ఐఐటిల్లో మాతృభాషలో ఉపన్యాసాలిప్పించాలని ప్రతిపాదించారు. అలాగే సంస్కృతాన్ని ఐచ్ఛికంగా ప్రకటించాలని సూచించారు. ఈ ప్రతిపాదన వెనుక భాజపా సైద్ధాంతిక భూమిక ఉన్నది. 2016, ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం తిరంగా యాత్రను మొదలుపెట్టింది. దీని అంతరార్థం జెఎన్‌యు వంటి సంస్థలలో విద్యార్థుల మనస్సులలో జాతీయతను పాదుగొల్పాలని. 1947కు ముందు దేశభక్తి కవిత్వానికి ప్రాధాన్యతనిచ్చింది. విద్వత్తును విద్యుత్తును గౌరవించేవారు. ఆ తర్వాత అరాజకశక్తులు సాహి త్య రంగాలను స్వాధీనం చేసుకున్నాయి. నన్నయ, తిక్కన, పోతనలకు గౌరవం లేని తరుణం వచ్చింది. ఎవార్డు వాపసీని గత సం వత్సరం సూడో సెక్యులరిస్టులు ఒక ఉద్యమంగా నడిపారు. కారణం నరేంద్ర మోదీ అ ధికారంలోకి వచ్చాడన్న కోపం. ఇది ఈ డెబ్బ యి సంవత్సరాలలో కళా సాంస్కృతిక రంగాలలో వచ్చిన పరిణామాలు.
అమెరికా అభివృద్ధికి ప్రధాన కారణం వర్క్ కల్చర్. చైనా అభివృద్ధికి సైనిక నియంతృత్వం కారణం. భారత్‌లో ఈ రెండూ లేవు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు వంటి కొద్దిమందిని మినహాయిస్తే తక్కిన వారిలో తక్కు వ సమయంలో ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోవాలనే మనస్తత్వం తప్ప పనిచేసే మనస్తత్వం లేదు. మరి దేశం ఎలా పురోగతి చెందుతుంది? స్వతంత్ర వీరసావర్కార్ ఒక వ్యాసంలో ఇలా అన్నారు. భారత జాతి పతనానికి రెండు ప్రధాన కారణాలు. అవి కాలం చెల్లిన ఆయుధాలు. అంటే శత్రువులు ఫిరంగులతో యుద్ధానికి వచ్చినప్పుడు మధ్యయుగాల్లో మనవాళ్లు విల్లంబులతో ఎదిరించారు. రెండవది శత్రువు చేతికి చిక్కినప్పుడు బుజ్జగించి పంపారు. ఇప్పటికీ ఈ విధానాన్ని అనుసరించడం వల్లనే మనచుట్టూ ఉన్న చి న్న దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌లు సైతం మనపట్ల శత్రుత్వం వహిస్తున్నాయి. ఈనగాచి నక్కల పా లు చేశారన్నది తెలుగు సామెత. మహాపురుషుల బలిదానాలతో లభించిన స్వాతంత్య్రఫలాలు ఏడు దశాబ్దాలుగా నిరుపయోగమయ్యాయి. మాఫియాగ్యాంగ్ లీడర్లకు మాన్య త లభించింది. ములాయంసింగ్ యాదవ్ జన్మదినోత్సవానికి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నిధులు సమకూర్చడం నిజమేనా? వీళ్లా మన పాలకులు?
గాంధీ, నేతాజీ, స్వామి రామానంద తీర్థ, టంగుటూరి ప్రకాశం వంటి వారి పేర్లు ఎక్కడా వినిపించడం లేదేమిటి? ఒకనాడు మహాత్మాగాంధీ పేరు భారతదేశమంతటా మారుమ్రోగుతూ ఉండేది. నేడు విగ్రహాలు కూడా కనిపించడం లేదు. ఇది ఏడు దశాబ్దాల పరిణామం. ఓట్లు తెచ్చిపెట్టలేని విగ్రహాల జోలికి రాజకీయ నాయకులు పోరు. భారతదేశం ఆత్మ ఆధ్యాత్మికత్వం. బ్రిటన్, అక్కడినుండి వలసవెళ్లిన అమెరికన్ల ఆత్మ వ్యాపారం. ఆరేబియా ఆత్మ మతం. వాటి వ్యాప్తికోసం ఆయా జాతులు పరితపిస్తాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఋషిప్రోక్తమైన ఒక సాంస్కృతిక ధార ఉంది. దాని పరిరక్షణకోసం ఈ జాతి ఎన్నో బలిదానాలు చేసింది. సంస్కృతి గోవు, గంగ, గాయ త్రి, గోపాలుడు..వీరికోసం భారత జాతి అంకితమైపోయింది. భారత్ ప్రధానంగా వ్యవసాయదేశం. అందుకనే నాగలి పట్టిన బ లరాముడు దశావతారాల్లో ఒకడైనాడు. దర్మరక్షకులకు నేడు రక్షణ లేకపోవడం విషాదం.

- ముదిగొండ శివప్రసాద్