మెయిన్ ఫీచర్

అష్టావక్రగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ముని బాలకునివలె కామనారహితుడై సర్వక్రియారంభములయందు చరించునో అటువంటి పరిశుద్ధ స్వరూపునకు కర్మ చేయబడుచున్నది అయినప్పటికీ లోపము కలుగదు.
ఎవడు చూచుచు, వినుచు, తాకుచు, వాసన చూచుచు, తినుచు సమస్త భావములయందును సముడై ఆశారహితుడో వాడే ధన్యుడు, ఆత్మజ్ఞుడు.
ఎల్లప్పుడు ఆకాశమువలె సంకల్పరహితుడగు ధీరుడగు జ్ఞానికి సంసారము ఎక్కడ? దాని యొక్క భావము ఎక్కడ? సాధనములైన యజ్ఞాదులు ఎక్కడ?
ఎవనికి స్వాభావికమైన సమాధి పూర్ణ స్వరూపమునందు ఉంటున్నదో అటువంటి అర్థయుక్తుడగు సర్వసంగ పరిత్యాగి, పూర్ణానంద స్వరూపుడగు జ్ఞాని సర్వోత్కృష్టుడగుచున్నాడు.
ఈ విషయమై పెక్కు విధములుగా చెప్పుట చేత ఏమి ప్రయోజనము, తత్త్వము నెరింగినట్టియు, భోగ మోక్షముల ఆశను విడిచిపెట్టినటువంటి జ్ఞాని ఎల్లప్పుడు ఎల్లయెడల రాగద్వేష రహితుడై ఉంటున్నాడు.
మహత్మ్యము మొదలగు ద్వైత జగత్తు నామమాత్ర భిన్నమై యున్నది. దానిలో కల్పనను విడిచిపెట్టి శుద్ధ బుద్ధ స్వరూపునికి ఏమి కర్తవ్యము మిగులుచున్నది.
ఈ సమస్త ప్రపంచము, భ్రాంతి మూలము కొంచెమైనను లేనిది ఈ ప్రకారమగు నిశ్చయము కలిగినటువంటిన్ని, పరిశుద్ధుడైనటువంటిన్ని చైతన్యాత్మానుభవము గల జ్ఞాని స్వాభావికముగనే శాంతిని పొందుచున్నాడు.
దృశ్యభావమును చూడనటువంటి శుద్ధ స్ఫురణ, శుద్ధ ప్రకాశ స్వరూపుడు అగు జ్ఞానికి విహిత కర్మానుష్ఠాన రూపనిధి ఎక్కడ? వైరాగ్యం ఎక్కడ? త్యాగం ఎక్కడ? శమము ఎక్కడ?
అనంత రూపములతో ప్రకాశించు చున్నప్పటికీ మాయను జయించునటువంటి జ్ఞానికి బంధము ఎక్కడ? మోక్షము ఎక్కడ? సంతోషము ఎక్కడ? దుఃఖము ఎక్కడ? బుద్ధిపర్యంత సంసారము నందు మాయా విశిష్టమగు చైతన్యము ప్రపంచమును కల్పన చేయుచున్నది. జ్ఞాని మమతారహితుడను, అహంకార రహితుడును, కామరహితుడునై ప్రకాశించుచున్నాడు.
నాశరహితమైనటువంటిన్ని సంతాప రహితమైనటువంటి ఆత్మను చూచుచున్నటువంటి మునికి శాస్తమ్రు ఎక్కడ? ప్రపంచము ఎక్కడ? దేహము ఎక్కడ? నేను, నాది అనెడి భావము ఎక్కడ?
అజ్ఞాని చిత్తనిరోధము మొదలగు కర్మలను విడిచిపెట్టుచున్నవాడు అయినప్పటికీ కొంతసేపటికి కోరికలను సంభాషణలను చేయుటకు ప్రవృత్తుడగుచున్నాడు. మూర్ఖుడు ఆ ఆత్మ వస్తువును వినినప్పటికినీ మూఢత్వమును విడిచిపెట్టడు. వెలుపటిదైన యత్నమువలన సంకల్పరహితుడు కాని లోపల విషయలాలసుడు అగుచున్నాడు. ఎవడు జ్ఞానమువలన నష్టమైన కర్మలు గలవాడై లోకదృష్టికి కర్మ చేయుచున్నవానివలె వున్నాడో అట్టివాడు కొంచెమై కూడా చేయుటకు గాని, మాట్లాడుటకు గాని అవసరమును పొందడు. ఎల్లప్పుడు వికారరహితుడును, సంతాపభయాది రహితుడును నగు జ్ఞానికి తమస్సు ఎక్కడ? ప్రకాశము ఎక్కడ? త్యాగము (విడిచిపెట్టదగినది) కొంచెము కూడా లేదు. అనిర్వాచ్య స్వభావము కలిగినటువంటిన్ని, స్వభావ రహితుడైనటువంటి యోగికి ధీరత ఎక్కడ? వివేకత్వము ఎక్కడ? నిర్భయత్వము కూడా ఎక్కడ?

-గెంటేల వెంకటరమణ