మెయిన్ ఫీచర్

ఆత్మబలమే ఇంధనం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు బాగా చదవటానికి అవసరమయ్యే ఇంధనం ఒక్కటే- అదే ఆత్మబలం. విజయం సాధించాలంటే ఆత్మబలం అవసరం. లక్ష్యాన్ని చేరాలంటే అడ్డంకులను తొలగించుకోవాలి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం మీకు కలగాలి. మనం మన కోసం చదువుతున్నాం తప్ప తల్లిదండ్రుల కోసం కాదు అనుకున్నవారు సమయాన్ని చక్కగా వినియోగించుకో గలుగుతారు. జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ఏకైక సాధనం ఏమిటంటే ‘నాకు జ్ఞాపకశక్తి లేదు’ అనుకోవటం మాని ‘ఈ మధ్య జ్ఞాపకశక్తి పెరుగుతుంది’ అని సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకోవటమే. చదువు విషయానికొస్తే పాఠాలను రివిజన్ చేస్తూండాలి. ఒంటరిగా కూర్చున్నపుడు ఆ పాఠాలను నెమరువేసుకోవాలి. ఆరోగ్యం ఇతర జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోకండి. విజయాలు సాధించినవారిని కలవండి. వారేం చేశారో తెలుసుకొని అవసరమైతే రోల్‌మోడల్‌గా ఊహించుకొని ఎదగాలి. చదువులో విజయం సాధించాలంటే ఏకాగ్రత చాలా అవసరం. అది సాధించాలంటే కొన్ని సందర్భాలలో డేగలాగా ప్రవర్తించాలి. ఏకాగ్రత విషయంలో డేగను మించిన పక్షి లేదు. మీరు కూడా అలాగే పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకొని సమయాన్ని బట్టి వాటిని సాధించాలి. సమస్యలు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. కొంతకాలం సాధన చేస్తే మీకు అది అలవాటయిపోతుంది. భయపడకండి, చదువుకోసం కావలసినంత మెమరి స్ట్రెస్ మీకు ఉంది. కృత్రిమ కొరతను సృష్టించకండి. మీరు చేయగలరని నమ్మండి. జ్ఞాపకం పెట్టుకోవడమే అలవాటు మన పంచేంద్రియాలకు ఎప్పటినుంచో వుంది. ఈ పంచేంద్రియాలు అనుభవాన్ని అలవాటుచేసుకున్నాయి. ప్రతి విద్యార్థి తనకున్న సమయాన్ని డబ్బుకన్నా ఎక్కువగా భావించి భవిష్యత్ ప్రణాళికను రచించుకోవాలి. ప్రణాళికతోపాటు తను తీసుకున్న నియమాలను, నిబంధనలను విధించుకోవాలి. లక్ష్యం నెరవేరేదాకా వాటిని విధిగా నిర్వహించాలి. ఎవరైనా సరే చక్కని ప్లానింగ్ చేసుకోగలిగితే పరీక్షల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఉత్తమమైనది శ్రద్ధగా వినటం, చదువుకునే సమయంలో పాఠం శ్రద్ధగా వినాలి. సహజంగా ఇంట్లో పెద్దల మాటలు శ్రద్ధగా వినేవారందరూ పాఠశాలలో కూడా అలాగే వింటారు. తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. వినే సమయంలో టీచరు కేసి చూస్తూంటే పాఠం బుర్రకెక్కుతుంది. అర్థంకాని చదువు వ్యర్థము. చదివిన ప్రతి వాక్యం మననం చేసుకోవాలి. దాని గురించి ఆలోచించి ప్రశ్నించుకోవాలి.
- మూడ్ తెచ్చుకోవటం అనేది ఏ పనికైనా ముఖ్యమే. ఒక రచన చేయాలన్నా, చివరకు సినిమా చూడాలన్నా మనసు దానికి అంగీకరించాలి.
- ఆకర్షణలకు దూరంగా ఉండటం మరో ప్రక్రియ.
- ముఖ్యమైన ప్రక్రియ నోట్సు తయారుచేసుకోవడం.
- టైమ్ మేనేజ్‌మెంట్ పాటించడం చాలా అవసరం. మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అతి ముఖ్యమైన పనులు ముందుగా చేయాలి. ప్రాధాన్యతను బట్టి మిగతావి తరువాత చేయాలి.
- రివిజన్ ఐదవది. అంటే, చదివిన పాఠాలను మళ్లీ మళ్లీ చదవాలి. పరీక్షలు దగ్గరపడినప్పుడు కొత్త పాఠాలు చదవడం కన్నా పాత పాఠాలను పదే పదే పలు కోణాల్లోంచి చదివితే మనసులో ముద్రపడిపోతాయి.
- చివరిది, అతి ముఖ్యమైనది ఆటో సజెషన్స్. అంటే ఒక విధంగా హిప్నాటిజం లాంటిదే. దీనికొరకు కొన్ని మంచి సూచనలు రాసుకొని మనసులో అవి వల్లెవేయాలి. ‘‘నేను బాగా చదివాను. తప్పక పాసవుతాను. మంచి ర్యాంకు తెచ్చుకోగలను. నాకు పరీక్షలంటే భయం లేదు’’ అని రాసుకోవాలి. విజయం సాధించాలంటే ఇదీ అసలైన మంత్రం.
తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి కొంత శ్రమ తీసుకొని పరీక్షలకు ఒక రోజు ముందుగా పరీక్ష సెంటర్ ఎక్కడుందో చూసి రావాలి. పరీక్ష రోజు ముందుగా వెళ్లేలా ప్లాసు చేసుకోవాలి. పరీక్ష హాలు చేరాక అక్కడ గబా గబా పేజీలు తిప్పుతూ చదివేయవద్దు. ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే కళ్ళు మూసుకొని ఏదో ఒక ప్రశ్నకు సమాధానం విజువలైజేషన్ చేసుకోవాలి. డౌట్ వస్తే పుస్తకం తెరచి ఆ ఒక్కటీ చూసి మళ్లీ ఊహలోకి వెళ్లాలి. ఆఖరిక్షణంలో చదివేసినంత మాత్రాన వస్తుందనుకోకూడదు.
పాజిటివ్ దృక్పథంవలన ఒత్తిడి తగ్గుతుంది. అర్థంలేని భయాలు వుండవు. భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుంది. ముందు మీలోని భయాలను గుర్తించి పేపరుమీద రాయండి. అలాగే ఫ్రెండ్స్‌లోని బలాలను గుర్తించండి. పాజిటివ్‌గా ఉండటం అసాధ్యమైన విషయమేమీ కాదు. సాధన చేస్తే సమకూరుతుంది.
విజయాలు సాధించడానికి ఆరు ప్లానులు చేపట్టాలి.
1. కట్టుబడి ఉండటం
2. నిజాయితీగా ఉండటం
3. అవసరానికి అనుగుణంగా మీ వైఖరిని ఎప్పటికప్పుడు మార్చుకోగలగడం
4. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలగడం
5. సరైన లక్ష్యాలను ఎన్నుకొని ముందుకు సాగడం
6. భావోద్రేకాలను అదుపులో ఉంచుకోవడం.
మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా దానికి తగిన కృషి, దీక్ష, పట్టుదల ఉండాలి.

- సి.నాగేశ్వరరావు 9642300824