మెయన్ ఫీచర్

వోట్ల జాతర.. తాయిలాల ఎర..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’లో కొన్ని పథకాలు జనాన్ని మెప్పించేలా ఉన్నాయి. ఈ తరహా బడ్జెట్‌ను 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉంటే బాగుండేది. ఉత్తరాదిన కాంగ్రెస్ విజయంతో పాటు, దేశ వ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి రగులుతోందని సంకేతాలు రావడంతో భాజపా తన వ్యూహాన్ని మార్చుకోక తప్పలేదు. అగ్రవర్ణాల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్లతో భాజపా నాయకత్వం తాయిలాల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఏ విపక్ష పార్టీ కూడా ఈ పది శాతం కోటాను విమర్శించడానికి సాహసించలేదు. అందుకే పార్లమెంటు ఉభయ సభల్లో కేవలం రెండు రోజుల వ్యవధిలో కోటా బిల్లును ఆమోదించి చట్టబద్ధత కల్పించాయి.
మోదీ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను- లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో రాజకీయ పక్షం అధికారంలోకి వస్తే అమలు చేస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే. భాజపా గనుక మళ్లీ అధికారంలోకి వస్తే ఈ బడ్జెట్‌కు మరిన్ని మార్పులు చేసి ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ‘ప్రధానమంత్రి కిసాన్ యోజన’ వినూత్నమైంది. రైతులకు పంట పెట్టుబడి కింద నగదు సాయం అందించే ఈ పథకానికి ఆద్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ఆయన గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించి చరిత్రకెక్కారు. వ్యవసాయాన్ని ఆదుకొనేందుకు రుణమాఫీ సంపూర్ణ పరిష్కారం కాదని, రైతులు అప్పుల పాలుకాకుండా వారికి చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ మంచి పథకంగా ప్రశంసలు అందుకుంది. మోదీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కేసీఆర్ బాటలో నడవక తప్పలేదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 12 కోట్ల మంది చిన్న,మధ్యతరహా రైతులకు ఏడాదికి కనీసం రూ.6 వేల కోట్ల ఆదాయం సమకూర్చే అవకాశం ఉంది. మూడు విడతలుగా సొమ్మును రైతుల బ్యాంకుఖాతాల్లో జమ చేస్తారు. బడ్జెట్‌లో దీనికి రూ.75 వేల కోట్లను కేటాయించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు రూ.750 కోట్లను కేటాయించారు. గోసంతతి పెంపు, నిలకడమైన జన్యు అభివృద్ధి కోసం రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. కోటిన్నర మంది మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక మత్స్య శాఖను ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇచ్చే రుణాలను రీ షెడ్యూల్ చేసినప్పుడు పూర్తికాలానికి ఇస్తారు. అసంఘటిత రంగంలో పది కోట్ల మంది కార్మికులకు నెలవారీ పించన్ ఇచ్చేందుకు ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. అరవై ఏళ్లుదాటిన తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికోసం ప్రతి కార్మికుడు తన నెలకు రూ.100 చొప్పున చందా చెల్లించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.60 వేల కోట్లను కేటాయించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం లోటును జాతీయ స్ధూల ఉత్పత్తిలో 3.4 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. 2020-21 నాటికి ఆర్థిక లోటును 3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడేళ్ల క్రితం ఆర్థిక లోటు 6 శాతం ఉండేది. దీనిని గణనీయంగా 3.4 శాతానికి తగ్గించారు. గత సంవత్సరంతో పోల్చినప్పుడు మొత్తం వ్యయం 13 శాతం పెరిగి 2010-20 బడ్జెట్ అంచనాలతో రూ. 27,84,200 కోట్లకు పెరిగింది. 2019-20 బడ్జెట్ అంచనాల్లో పెట్టుబడి వ్యయం రూ.3,36,292 కోట్లు ఉంటుందని అంటచనా. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కేటాయింపులను 2019-20 బడ్జెట్ అంచనాల్లో రూ.3,27,679 కో ట్లకు పెంచాలని ప్రతిపాదించారు. జాతీయ వి ద్యా మిషన్‌కు కేటాయింపులను 20 శాతం పెంచి 2019-20 బడ్జెట్ అంచనాల్లో రూ.38,572 కోట్ల కు పెంచారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద కేటాయింపులను 18 శాతానికి పైగా పెంచి 2019-20 బడ్జెట్ అంచనాల్లో రూ.27,584 కోట్లకు చేర్చారు. ఎస్సీలకు 35.6 శాతం అదనంగా కేటాయింపులను రూ.76,801 కోట్లకు, గిరిజనులకు అదనంగా 28 శాతం అంటే రూ.50,086 కోట్లకు పెంచారు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80 వేల కోట్లు సాధించగలమనే విశ్వాసంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్ అంచనాలను 21 శాతం పెంచి రూ.58,166 కోట్లను కేటాయించారు. తొలిసారిగా మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు రైలు సదుపాయాన్ని కల్పించాలని సంకల్పించారు. బ్రహ్మపుత్ర నదీ జలాల ద్వారా కంటైనర్లలో సరకుల రవాణాను ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా రక్షణ రంగానికి రూ. 3,00,000 కోట్లను కేటాయించారు. రైల్వేలకు రూ. 64,587 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు. మొత్తం పెట్టుబడి వ్యయం రూ.1,58,658 కోట్లు. 2019-20లో రైళ్ల నిర్వహణ 95 శాతం ఉంటుందని అంచనా.
సినిమాల చిత్రీకరణకు కావలసిన అనుమతుల కోసం ఏకగవాక్ష విధానాన్ని ప్రకటించారు. సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కొత్త మార్పులు తెచ్చారు. జీఎస్‌టీ కింద నమోదైన చిన్న, మధ్య తరహా సంస్థలకు కోటి రూపాయల రుణంపై వడ్డీలో 2 శాతం సబ్సిడీని ఇవ్వనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్తువులను, మహిళల యాజమాన్యాలలోని సంస్థల నుంచి 3 నుంచి 25 శాతం వరకు సేకరిస్తారు. అంతర్గత వాణిజ్యంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్పు చేస్తారు. జాతీయ కృత్రిమ మేధ కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు కొత్త పోర్టల్‌ను ఏర్పాటు చేస్తారు.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2013-14లో 11వ స్థానంలో భారత్ ఉండగా, ఈ రోజు 6వ స్థానంలో ఉంది. 2014-19లో మధ్య కాలంలో వార్షిక సగటు జాతీయ స్ధూల ఉత్పత్తుల్లో వృద్ధి 1991 నుంచి ఇంతవరకు అధికారంలో ఉన్న ప్ర భుత్వాలన్నింటి కంటే ఎక్కువ. 2009-14 మ ధ్య కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరచిన ద్రవ్యోల్బణాన్ని ప్రభు త్వం అదుపు చేసింది. సగటు ద్రవ్యోల్బణం 4.6 శాతానికి తగ్గింది. ఇది గత ప్రభుత్వాలన్నింటి కన్నా తక్కువ. 2018 డిసెంబర్‌లో ద్రవ్యోల్బ ణం బాగా తగ్గి 2.19 శాతంగా నమోదైంది. ఏడేళ్ల క్రితం ఆరుశాతం ఉన్న ఆర్థిక లోటు 2018-19లో సవరించిన అంచనాల ప్రకారం 3.4 శాతానికి తగ్గింది. గత ఐదేళ్లలో భారీగా 23,900 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం సరళీకృతం చేసి, స్వయం పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు.
22 పంటలకు కనీస మద్దతు ధర 50 శాతం చెల్లింపునకు హామీ ఇచ్చారు.సౌభాగ్య యోజన కింద ప్రతి గృహానికి ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దాదాపు 50 కోట్ల మంది ప్రజల కోసం ప్రపంచంలో అతి పెద్ద ఆరోగ్య కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ను చేపట్టారు. పేద, మధ్య తరగతి వర్గాల వారికి చౌకధరల్లో ఆహార ధాన్యాల సరఫరాకు రూ.1,70,000 కోట్లను వ్యయం చేశారు. ప్రస్తుతం దేశంలో పని చేస్తున్న 21 అఖిల భారత విజ్ఞాన వైద్య సంస్థలలో (ఎయిమ్స్) 2014 తర్వాత ప్రకటించినవి ఎక్కువ కావడం విశేషం. ఉజ్వల యోజన కింద ఆరు కోట్ల మందికి ఎల్పీజీ వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే ఏడాది నాటికి కనెక్షన్ల సంఖ్య 8 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. ముద్రా రుణాల్లో 70 శాతం మహిళలకు ఇస్తారు. ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచారు. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, వ్యాపారులు కోటి రూపాయల వరకు రుణాలను ఒక గంట లోపల పొందవచ్చు. ఆదాయపు పన్నుకు సంబంధించి వసూళ్లు గత ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. ఐదేళ్లలో పన్ను చెల్లింపుదార్ల సంఖ్యలో 80 శాతం వృద్ధి నమోదైంది. వీరి సంఖ్య 3.79 కోట్ల నుంచి 6.85 కోట్లకు పెరిగింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసిన 24 గంటల్లో రిఫండ్ ఇచ్చేందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థ వృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. పన్ను శ్లాబ్‌ను రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు, పన్ను రేటును పది శాతం నుంచి ఐదుశాతానికి తగ్గించారు. 80సీ సెక్షన్ కింద పొదుపు చేసినప్పుడు ఇచ్చే మినహాయింపును లక్ష నుంచి లక్షన్నర రూపాయలకు పెంచారు. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40వేలుగా నిర్ణయించారు.
జీఎస్‌టీ వల్ల భారత్ ఒక ఉమ్మడి మార్కెట్‌గా మారింది. చిన్న వ్యాపారులకు జీఎస్‌టి నుంచి మినహాయింపు పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచారు. రూ.50 లక్షల టర్నోవర్ దాటని చిన్న సర్వీసు ప్రొవైడర్లు కాంపోజిషన్ స్కీం పెంచుకుని 18 శాతం బదులు కేవలం 6 శాతం పన్నును చెల్లించవచ్చు. వౌలిక సదుపాయాల రంగంలో పౌర విమానయానం యూడీఎఎన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య వందకు మించాయి. ప్రతి రోజూ 27 కి.మీ మేర జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా కోల్‌కొత నుంచి వారణాసి వరకూ అంతర్ దేశీయ జల మార్గంలో సరకు రవాణా కంటైనర్ సర్వీసును ప్రారంభించారు. దేశంలో రూ.6900 కోట్ల విలువైన బినామీ ఆస్తులను జప్తు చేశారు. ప్రత్యక్ష పన్నుల్లో 18 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధులను అందించేందుకు రూ.2.6 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టారు. వచ్చే ఐదేళ్లలో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధంగా ఉందని మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. 2022 నాటికి ఒక భారతీయ రోదసీ యాత్రికుడిని అంతరిక్షంలోకి పంపేలా ఇస్రో ప్రణాళికలను ఖరారు చేసింది. నదులను శుద్ధి చేయడం, సురక్షితమైన మంచినీటిని అందించడం, సూక్ష్మ సేద్యం ద్వారా నీటిని తగు విధంగా వినియోగించుకునేందుకు భారత్ అడుగులు వేస్తోంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097