మెయిన్ ఫీచర్

ప్యాడ్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుతుస్రావం.. ఈ విషయం గురించి చాలాదేశాల్లో బాహాటంగా మాట్లాడాలంటేనే ఇబ్బంది పడతారు. దీని గురించి ప్రజల్లో అనేక అపోహలు, మూఢనమ్మకాలు నాటుకుపోయాయి. ఈ మూఢనమ్మకాలను దూరం చేసే ఆలోచనతో ఇటీవల న్యూఢిల్లీలో ‘పీరియడ్ ఫెస్ట్’ జరిగింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కలిసి ‘ప్యాడ్ యాత్ర’ను చేశారు. దాదాపు మూడు వేల మంది పిల్లలు ఫెస్ట్‌లో పాల్గొన్నారు. పిల్లలకు నెలసరి ద్వారా వచ్చే రకరకాల సమస్యలకు చక్కటి సమాధానాలను, వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు గైనకాలజిస్ట్ డా. సురభి. రుతుచక్రం గురించి వివిధ కళారూపాలు, ప్రదర్శనల ద్వారా దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ‘నెలసరి ఎందుకొస్తుంది? అమ్మాయిలకు మాత్రమే ఎందుకొస్తుంది? ఆ సమయంలో నొప్పి ఎందుకు ఉంటుంది? వంటి చిన్న చిన్న ప్రశ్నలకు దాటవేయకుండా, వారికి దాని గురించి వివరించే ప్రయత్నం చేయాలని, చిన్నవయస్సులోనే దీని గురించి చెబితే వారు త్వరగా అర్థం చేసుకుంటారు’ అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గైనకాలజిస్ట్ డా. సురభీసింగ్ చెబుతున్నారు. ‘అంతేకాదు చాలామంది ఆడపిల్లలు తమ ఆరోగ్యపరిస్థితి గురించి తల్లితో మాట్లాడతారని, పీరియడ్స్ గురించి మాత్రం మాట్లాడరని.. దీని గురించి తల్లితో కానీ, పెద్దలతో కానీ మాట్లాడాలంటే సిగ్గు, భయమని, అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే దీని గురించి అవగాహన కల్పించాలి. ఇప్పుడు స్కూళ్లలో కూడా దీని గురించి శిక్షణా తరగతులను నిర్వహించిన తర్వాత వారు ధైర్యంగా మాట్లాడుతున్నారని.. ఇప్పుడు అన్ని విషయాలూ తల్లితో చర్చిస్తున్నారు. చిన్నతనంలో పిల్లలు ఏది చెప్పినా తొందరగా అర్థం చేసుకుంటారు కాబట్టి, పాఠశాల స్థాయిలోనే బాలికలకు నెలసరి గురించి అవగాహన కల్పించాలి. పీరియడ్స్ గురించి అమ్మాయిలతో మొదట చర్చించాల్సింది ఉపాధ్యాయులే.. పీరియడ్స్ అంటే.. మన శరీరంలో వచ్చే అనేక సానుకూల మార్పులకు సంకేతమని బాలికలకు వివరించాలి. నెలసరి వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. బాలికలు ఎప్పుడూ ప్యాంటీ, ప్యాడ్, పేపర్, పేపర్ సోప్ వంటి వస్తువులను వెంట ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పీరియడ్స్ రావడం మహిళల సమస్య కాదు.. ఇది మనుషుల సమస్య’ అని డా. సురభి వివరించారు.
‘ఇక నుంచైనా ఆడపిల్లలు ఐదో తరగతికి వచ్చేటప్పటికి వారికి నెలసరి గురించి వచ్చే రకరకాల సందేహాలకు తల్లికానీ, ఉపాధ్యాయినులు కానీ దాటవేయకుండా, సమాధానాలు చెబితే వారికి దాని గురించి అవగాహన ఏర్పడటమే కాకుండా, వారు నెలసరిని ఎదుర్కొన్నప్పుడు ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఉంటారు’ అని చెబుతున్నారు స్కూలు ఉపాధ్యాయినులు.