మెయిన్ ఫీచర్

ఎవరో జ్ఞాపకాన్ని పటిష్టం చేసే చిత్రం-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న. విగ్రహారాధన గురించి వేదాలు ఏం చెప్తున్నాయి?
హిందూగ్రంధాలలో ప్రార్థనలు మరియు విగ్రహారాధన గురించి వివరణలు ఉన్నాయి. కొన్ని విశ్వాసాలు విగ్రహారాధన తప్పు మరియు పాపమని నమ్ముతాయి. భావన మరియు భక్తి ప్రధానం కానీ దేవుని విగ్రహ స్వరూపం కాదు. గీత దీనిని గురించి స్పష్టమైన వివరణ యిస్తుంది. అయినప్పటికీ తన లక్ష్యాన్ని సాధించేందుకు ద్రోణాచార్యుని ప్రతిమ సజీవ రూపంతో సమానంగా సాకారమైన ప్రభావం చూపిందని ఏకలవ్యుడు బుజువు చేశాడు. శిల్పి ఎవరని లేదా ఆలయాన్ని ఎవరు నిర్మించారని అన్న విషయంతో నిమిత్తం లేకుండా ఉన్న భక్త్భివనకు ప్రతిరూపకంగా సౌందర్యంతో కూడిన ప్రతిమ కనబడుతుంది. హిందూ మతంలో విగ్రహారాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? దేవాలయాలు దానాలు మరియు సేవల వల్ల నిర్మించబడ్డాయి. దేవాలయ పరిమాణంతో పాటు దాని సౌందర్యం కూడా అంతే ముఖ్యం. ఒక పేద శిల్పి లేదా ఒక ధనిక దాత అనే బేధం లేక వారి సహకారానికి సమంగానే ఫలం పొందుతారు. భవంతునికి ఎవరో పుష్పములు సమర్పిస్తున్నట్టు ఊహించండి. పూజానంతరం ప్రసాదాన్ని భక్తులకు లేదా సందర్శకులకు పంపిణీ చేస్తారు. హిందూధర్మంలో భావన మరియు వ్యక్తీకరణ ప్రధానం. అలాగే యోగాలో కూడా. ఆ రెండింటి సమ్మిళితమే యోగా అంటే. నాట్యం లేక భరతనాట్యాన్ని యోగా అని పరిగణిస్తారు. అందువలననే విగ్రహరూపం ముఖ్యమైనది. ఒక సర్పం మరియు చంద్రునితో అలంకరింపబడిన శివుడు సర్వజీవ సమానత్వానికి ప్రతీక. ‘‘అర్ధనారీశ్వర’’ స్వరూపం భావన మరియు వ్యక్తీకరణ యొక్క సమకాలీకరణకి ప్రతీక. ఎన్ని పదాలైనా కానీ చిత్రం కన్నా అందంగా, కళ్ళకు ఇంపుగా ఆ భావాన్ని వ్యక్తం చేయలేవు. సంపూర్ణంగా సమమైన రెండు పరిపూర్ణ గాజు గోళాలను ఊహించుకునే మానసిక పరీక్షని పరిగణిద్దాం. అటువంటి వస్తువును ఊహించే ప్రయత్నంచేసేటప్పుడు, అటువంటి వస్తువు నిర్మాణం సాధ్యం అని చెప్పలేము. ఒక చిత్రం లేక యధార్థ వస్తువును కళ్ళతో చూచినప్పుడు అవసరమైన లక్ష్యసాధనకు సరితూగే సమగ్రమైన ఊహాశక్తిని కలుగజేస్తుంది. హిందుత్వానికి ప్రకృతి మరియు అందం చాలా ముశ్రీ్యమైనవిగా భగవద్గీతలో వివరించారు. కనుక చిత్రాలు మిక్కిలి ముఖ్యమైనవి. సూర్యుడు, భూమి, నీరు మరియు జంతువులతో సహా సమస్త జీవకోటి అంతా తన నుండే ఉద్భవించాయని, తనలోని భాగాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉటంకించాడు. భగవద్గీత ఒక ప్రత్యేకమైనదని, సమాంతరం ప్రపంచంలో లేనిదని అని చెప్పడానికి కారణం ఒక నిర్ధిష్టమైన, అందమైన మరియు అద్భుతమైన విషయాన్ని బహిరంగం చేయడమే. ఆ కారణం వలననే వేదాలు ప్రార్ధన చేసే కొన్ని సులువైన విధానాలలో విగ్రహారాధనను సూచించింది.
ప్రశ్న. విలువిద్య పోటీలో కర్ణుడిని ఎందుకు అనుమతించబడలేదు?
ధృతరాష్ట్ర మహారాజు అతని సలహాదారుల మేరకు ఒక విలువిద్య పోటిని నిర్వహించారు. మిగిలిన రాజులందరికీ ఆహ్వానాలు పంప బడ్డాయి. బహిరంగంగా జరుపుతున్న పోటీకి వచ్చిన కర్ణుడు అందులో పాల్గొనాలని కోరు కున్నాడు. అతని అభ్యర్థన తిరస్కరించబడింది. ఎందుకంటే అతను రాజు కాదు లేదా రాజ వంశీయుడు కాదు. దీనిని కొందరు అతని కుటుంబ నేపథ్యం ఆధారంగా తీసుకున్న చర్యలా చూస్తారు లేదా అభిప్రాయ పడతారు. అతను సైనిక శిక్షణ తీసుకోవడానికి అర్హుడు కాకపోతే, విలువిద్యా పోటీదారులలో అతను ఉండటానికి అనుమతిస్తారని అంచనా వేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఆ నిర్ణయానికి ఇతర కారణాల గురించి మనం ఆలోచిద్దాం. సాధారణంగా, అర్హత కోసం నియమాలు మొదలైనవి ముందుగా ప్రకటించబడతాయి. ఈ నియమాలు పోటి రోజు నాడు వేదిక వద్ద మార్చబడవు అనేది కూడా నిజం. పోటీదారులు రాజవంశీయులు అయితే, ఇది ఒక అవమానంగా భావింపబడి శత్రుత్వం, యుద్ధాలు మొదలైనవానికి దారి తీస్తుంది. స్నేహపూర్వకత, రాజకీయ పొత్తులను బలోపేతం లేదా వివాహం ద్వారా సంబంధాలను ఏర్పరుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన ఈ పోటీ, వ్యతిరేక ఫతితాలను ఇవ్వవచ్చు. దుర్యోధనుడు కర్ణుడిని అంగ రాజుగా చేసి, అతను తన లక్ష్యాన్ని సాధించడానికి సహాయం చేసాడు. మరియు కర్ణుడి స్నేహం, విశ్వాసం గెలిచాడు.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562