మెయిన్ ఫీచర్

‘నారీ’విజయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్ల మేఘమంత స్వచ్ఛమైనది. ఆకాశమంత ప్రేమను పంచగలది. సహనంలో భూదేవికి మించి ఓర్పును చూపించగలది. చల్లని గాలిలా సేద తీర్చగలది. అగ్నిపర్వతంలా జ్వాలలు చిమ్మించగలది. ఆడపిల్లంటే ప్రకృతి. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే ఆడపిల్లను కాపాడుదాం. ఆడపిల్లను చదివిద్దాం.
శిశులింగ నిష్పత్తి అనగా 0-6 సంవత్సరాల వయస్సు మధ్య అబ్బాయిలు-అమ్మాయిల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. వెయ్యిమంది అబ్బాయిలకు గల అమ్మాయిల సంఖ్య క్షీణిస్తూ వస్తోంది. 1961 నుంచి ఈ ధోరణి తీవ్రరూపం దాల్చింది. ఈ సంఖ్య క్షీణత క్రమంగా 1991లో 945, 2001లో 927, 2011లో 918కి తగ్గటం మరింత ఆందోళనకరమైన విషయం. శిశు లింగనిష్పత్తిలో క్షీణత మహిళల అనధికారతకు ప్రధాన సూచిక. పుట్టక ముందు లింగ పక్షపాతం వల్ల లింగ ఎంపిక ద్వారా వివక్ష మరింత ఎక్కువ అవుతోంది. అలాగే అమ్మాయిలు పుట్టిన తరువాత వారికి వ్యతిరేకంగా.. వారిని ఆటవస్తువులుగా చూస్తూ మరింత వివక్ష.. అందరికీ అందుబాటులో ఉంటున్న లింగ నిర్ధారణలను దుర్వినియోగం చేస్తూ అమ్మాయిలను గర్భంలో చంపేయడం వల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. ఆడపిల్లల మనుగడ, రక్షణ, సాధికారత నిర్ధారించడానికి సమన్వయం, అభిసరణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో.. అనే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకాన్ని శిశులింగ నిష్పత్తి సమస్య పరిష్కరించేందుకు 2014 అక్టోబర్‌లో మొదలుపెట్టారు. ఇది అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి శిశులింగ నిష్పత్తి తక్కువగా గల జిల్లాల్లో జాతీయ ప్రచారం, కేంద్రీకరించిన బహుల రంగాల చర్యల ద్వారా అమలవుతోంది. ఇది మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖల ఉమ్మడి చొరవ. ఈ పథకం పరమార్థం.. ఆడపిల్లలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుని, చదువుకోవడం. ఈ పథకాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రీజనల్ ఔట్‌రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, భాష- సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యాన రవీంద్రభారతిలో ఫిబ్రవరి 12, మధ్యాహ్నం మూడు గంటలకు ‘నారీ’ నృత్యరూపకాన్ని ప్రదర్శించబోతోంది. అందరూ ఆహ్వానితులే.. ఆడపిల్ల బతకడానికి, చదవడానికి అవకాశం ఇవ్వాలంటూ.. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చింది ప్రభుత్వం.