మెయిన్ ఫీచర్

మానవత్వ పరిరక్షణే దయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ‘‘మానవత్వం పట్ల నిజమైన ప్రేమ’’ దయాగుణంగా సూచించడం కాదా? అతని శౌర్యం మరియు దయాగుణానికి సమానమేదైనా ఉందా? ప్రేమలో ‘‘షరతులు లేని ప్రేమ’’ అని ఉంటుంది కానీ దయాగుణంలో ‘‘షరతులు లేని దయాగుణం’’ అన్నది లేదు.దయాగుణం అన్న పదంలో ఎదురు ఆశించేది ఉండదని సూచిస్తుంది.
‘‘్ఫలాపేక్ష రహిత కర్మలు’’ గురించి శ్రీకృష్ణుడు చెప్పేటప్పుడు అన్ని పదాలలో ముఖ్యమైన పదం అయిన దయాగుణం యొక్క లక్షణం మానవత్వం పరిరక్షణమేనని వర్ణించాడు.
మీ సందేహ నివృత్తికై ‘‘ప్రేమ’’ మరియు ‘‘దయాగుణం’’ అన్న పదాలకు ఏ పదకోశంలోనైనా చూడండి. దయను నిర్వచించటం కష్టం.
ఇతర విశ్వాసాల పద్ధతులు
ఇతర మత విశ్వాసాలలో ఉన్న వివాదాస్పదమైన పద్ధతులను అర్ధం చేసుకోవడం ముఖ్యం. కొన్ని విశ్వాసాలలో చిన్న పిల్లల జననేంద్రియ విరూపణ తల్లీ బిడ్డల మధ్య బంధాన్ని పూడ్చలేని రీతిలో నాశనం చేస్తోంది.
జననేంద్రియ విరూపణం
నోబెల్ పురస్కార గ్రహీత, హార్వర్డ్ ప్రొఫెసర్ జార్జ్ వాల్డ్23 జననేంద్రియ విరూపణం గురించి వ్రాసిన వ్యాసంలో ఈ పద్ధతిని నిరసిస్తూ తన అభిప్రాయాలు తెలిపారు. జననేంద్రియ విరూపణం విద్యాసంబంధిత విషయమే కాకుండా సార్వత్రికంగా చింతిచదగ్గ విషయమని నివేదికలో తెలియజేశారు. ‘‘వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాల ప్రకారం అమెరికాలో కనీసం 150000 నుంచి 200000 బాలికలకి బలవంతంగా విరూపణ జరిగే ప్రమాదం ఉంది’’.
‘‘ఈక్వాలిటీ నౌ’’ అనే అంతర్జాతీయ మహిళా హక్కుల స్వచ్ఛంద సంస్థలో వరిష్ట విధానపు సలహాదారు, షెల్బీక్వాస్ట్ యిలా అన్నారు’’
ఇది ఒక సాంస్కృతిక మరియు మతపరమైన సంప్రదాయంగా కాకుండా బాలికల మీద అత్యాచార రూపంగా మనం గుర్తించవలెను.’’
మగబిడ్డల సున్తి గురించి మిరియం పోలాక్ అభిప్రాయం ఒక తల్లి దృక్కోణం నుంచి అన్యులకు అనూహ్యమయిన అమూల్యమయిన విచిత్ర కోణాన్ని ప్రదర్శిస్తుంది. ‘‘స్తుని గాయం తల్లీబిడ్డలు యిద్దరిని కోలుకోలేని విధంగా మార్చివేస్తుంది. తన బిడ్డని ఎలాంటి స్థితిలోనైనా
రక్షించుకోవాలన్న తల్లి యొక్క మూలగర్భ జ్ఞానాన్ని గాయపరుస్తుంది మరియు దిగ్భ్రాంతితో బెదిరిపోయిన బిడ్డ, అపాయంలో స్వాభావికంగా తన మొట్టమొదటి రక్షణ మూలమని భావించే తల్లిని పూర్తిగా నమ్మే సామర్ధ్యాన్ని కోల్పోతాడు’’.25
ఈ వాక్యాల యొక్క ప్రాముఖ్యత ఇంతకంటే ఎక్కువగా నొక్కి చెప్పలేము. ఎందుకంటే నమ్మకం లేని వారి నుంచి ఎవరైనా గాని ఏమీ నేర్చుకోలేరు. బాల్యంలో ఇది చాలా కీలకమైనది.
ఒక తల్లి తన సంతానానికి ముఖ్యమైన విషయాలు నేర్పించగలిగేవి ఏమిటంటే అవధుల్లేని ప్రేమ యొక్క అర్ధం తెలియచెయ్యటం మరియు యితరులను నమ్మడం నేర్చుకోవడంలో వేసే మొదటి అడుగులు.
సంపూర్ణమైన నమ్మకం గురించి చెప్పేటప్పుడు ఆ తల్లి పడే వేదనను ఇక్కడ వివరించారు. మానవ వికాసంలో సమస్యలకి ఇదే మూలం అని, అందునా దీనివల్ల తల్లీ బిడ్డకే కాక మానవత్వానికి కూడా తీవ్రమైన చిక్కులు ఉంటాయని పైన వివరించారు. శిశువు మరియు తల్లి ఇద్దరి పట్ల ఇది అన్యాయం కాదా? ఈ పద్ధతి యొక్క చెడు అంశం ఏమిటంటే ఆ బిడ్డ తను భరించే బాధను తెలియచెయ్యలేడు, అందరిపై లేక ప్రపంచంపై ఉన్న ఆగ్రహాన్ని పైకి చెప్పలేడు.
అంతు లేని ఆగ్రహం మనిషిని అధోగతికి తీసుకువెళ్తుంది. ఈ ప్రభావాలు పూడ్చలేనివి.డా.రోనాల్డ్ గోల్డ్ మన్ మగవారి సున్తి మహిళల కెలా కీడు చేస్తుంది. ‘‘జననేంద్రియ విరూపణ వలన దాగిన ప్రతికూల మానసిక మరియు లైంగిక ప్రభావాలు మరియు ఎలా దాని ప్రభావం వల్ల పురుషులతో మహిళల సంబంధాలకు హానీ కలుగుతుందో తెలుసుకోండి. ఈ వ్యాసం వైద్యం మరియు మానసిక సాహిత్యంలో పరిశోధనల నివేదికపై ఆధారపడింది.’’
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562