మెయిన్ ఫీచర్

ఐంద్రజాలిక కవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాభి అనగానే ‘్ఫడేల్ రాగాల డజన్’తోపాటు ‘కయిత నా దయిత’ కూడా చెప్తారు. పన్‌చాంగమ్ సరే. నిత్య నూతన ప్రయోగాలను ఇష్టపడే తిక్కవరపు పట్ట్భారామారెడ్డిని కేవల ఛందోరీతుల బందోబస్తులను కాదని భాషారీతులను ఎలా వాడేడో చెప్పడంమీదే ఎక్కువ చర్చ జరిగింది.
ఆ దృష్టితోనే ‘కయిత నా దయిత’ను చూసి ఆయన చేసిన ‘హై హీలు యాన’ వంటి ప్రయోగాల గురించి ‘చయనా యువతి’వంటి కవితల గురించి పేర్కొనడం జరిగింది. అప్పటికి భావ కవిత్వోద్యమం ద్వారా స్ర్తిని అంగాంగ వర్ణన చేయడాన్ని కవులు నిరసించినా పఠాభి దాన్ని పెద్దగా లెక్కచెయ్యలేదు. దేనినీ లెక్కచెయ్యకపోవడం గాని ముందు వాటిని తిప్పికొట్టడం గానీ ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకున్నవాడు కదా! మరి.
కానీ ఇవన్నీ ఇలా ఉంచితే నవ యవ్వనోత్సాహంతో రాసినప్పటి నుంచి తరువాతి కాలంలో కూడా రకరకాల వయస్సుల్లో రాసిన కవితల సమాహారంగా ఈ పుస్తకాన్ని చూస్తే ఇందులోంచి మరెన్నో కొత్త అంశాలు బయటపడతాయి.
పుస్తకానికి శీర్షిక అయిన ‘కయిత నా దయిత’అనే కవితకు శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ ప్రేరణ అయినా అందులో పఠాభి గొంతూ, గుండె కూడా వినిపిస్తాయి.
ఇందులో ఆయన కవిత్వాన్ని ‘నా రక్తమున తీవ్రత’ అన్నాడు. ‘‘నా కర్ణముల విశ్వగోపన/ రహస్య గీతాల నాలాపన/ సలుపునట్టి అమృత భాషిణి’’అనీ అన్నాడు. ఇంకా ‘‘నీ అమృతంపు స్పర్శన/ సలుప చిత్రముల ప్రదర్శన/ అద్భుతమగు ఐంద్రజాలిక/ ఓ నా కవనంపు బాలిక’’అని కూడా అన్నాడు. ఇంకా వాణీ నా రాణీ అంటూ చాలా రాసాడు. కానీ పై మూడు విశేషాల ద్వారా ఆయన వాణిని విందాం.
కవిత్వం ఆయన రక్తం తాలూకు తీవ్రత అని కదా అన్నది. దానివలననే ఎవరూ తొక్కని కొత్తమార్గం ఎన్నుకుని విలక్షణ కవి అయ్యాడు. ‘‘ఆమె కన్నుల అనంతాంబరపు నీలి నీడలు కలవు’’అని పూర్వ కవి రాస్తే ‘‘చిన్నదాని కన్నులలో ఉన్నదిరా ఉన్మాదము’’అని రాసేడు. ‘‘అట్టిట్టు ప్రవహిస్తు/ అట్టహాస్యము చేస్తూ/ పాతాళముకేను పడిపోవు చుంటాను/ పడుచుండి/ పడుచుండి పడి పడీ నగుతాను/ అంటూ జలపాతం కవిత రాసాడు. ఇది చదివిన వారికి విశ్వనాథ కినె్నరసాని గుర్తుకురాక మానదు. ఇది వెటకారం కానీ, పేరడీ కాని కాదు. రక్తంలో ఉండే తీవ్రతా గుణం అలా రాయిస్తుందనుకుంటాను. ఇది చూడండి. ‘‘నిమేషాల పిచ్చికేక/ సమీపించనట్టిచోట/ సఖీ నీవు వచ్చుదాక/ నిరీక్షిస్తు రాత్రిపూట/ కార్చుచున్న కంటినీట/ పోషింతును పూలతోట.
మరో కవిత- పేరు కవాలి.
నేను వచిస్తాను వినూ/ గీతలోని సారమునూ
మనకు చాల మజా సదా/ ఈత చెట్టు గీత కదా
శ్రుతులు వినుచు బ్రతుకు క్షుదా
వ్యధల మాన్పు శ్రమలు వృధా
మనకు సదా మహా సరదా
మదిర సుధా పాత్రగదా
ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరికొన్ని ఉన్నాయి. ఇవి రక్త తీవ్రత పాటలని ఆయనే చెప్పాడు. ఇదీ ఆయన కవితను నయితను చేసుకున్న వైనం.
రెండవ లక్షణం విశ్వం దాచి ఉంచిన రహస్యాలను తన చెవులకు వినపడేలా పాడిన అమృత భాషిణి-అంటే ఆమె గాయని, భాషిణి కూడా. ఆమె ‘వెలుగు’ గురించి పఠాభికి ఇలా చెప్పింది. లేదా ఆయన చేత చెప్పించింది.
‘‘ఇరులకు వెల్తురు కలుగు/ జగతినంత జిగిలి వెలుగు / నా గుండియలోన మెలగు/ వింత యయిన వెలది వెలుగు
వెలుగు అంటే ఆయన గుండెలో స్ర్తియే.
తరణినుండి ధరణి నుండి/ మట్టిలో రగిల్చి చిచ్చు
చంపకమ్మునకు పసిండి/ రోజాకును రంగులిచ్చు
‘ఎండ కాంతి మట్టిలో చిచ్చు రగల్చడంవల్లనే రోజాకు ఇన్ని రంగులు’ట ఇంకా కనులముందు కాంతి దూకి/ పరిమళముగ పరిఢవిల్ల- కమలం దగ్గర అదే కాంతి మళ్లీ పరిమళంగా మారిందట. అక్కడితో ఆగడు కదా?
కిలికించిత రసము భంగి/ తరుణి కనుల తయారవును
అంత చిత్తమందు పొలగి/ పెదవులనడి కదలినవును
ఆ సూర్యకాంతే తరుణి కన్నుల్లో కిలికించితం గానూ తర్వాత అది పెదవుల మధ్యకు నవ్వుగానూ చేరుతుందట. ఇంత అందంగా సూర్యకాంతి గురించి ఎవరేనా చెప్పేరా! ఇలాంటి అందాలు కయిత నా దయితలో ఆయన చాలానే దాచాడు. అవి ఆమె చెవిలో పలికిన రహస్య గేయాలన్నాడు.
ఇక మూడవ లక్షణం ‘నీ అమృతంపు స్పర్శన/ ఓ నా కవన బాలిక/ సలుపు ఐంద్రజాలిక చిత్రముల ప్రదర్శన- అన్నాడు. ఆమె తాకడం వల్లనే తనలోంచి ఇలా ఇంద్రజాలాల్లాంటి కవన చిత్రాలు బహిర్గతమవుతున్నాయట.
మచ్చుకి ఆ ఇంద్రజాలాలు చూద్దాం.
నా చిత్తము నాపజాల/ సఖియా! అది క్షుభితకంధి
తరంగాల తురంగాల/ పయిని స్వారి సలుపుచుండు.
అల్లకల్లోలమైన సముద్ర తరంగాలనే గుర్రాల మీద స్వారీ చేస్తోందట తన మనసు. ఆపలేను అంటాడు. అవేవీ లేకపోయినా మనసు చంచలమే. ఇక అలా ఉంటే ఎంత వేగం!! ఎందుకంటే ఆమె తలపువల్ల. అది మండే అగ్నికీలే.
భరతావని నదుల అప్పు/ లన్ని ఆర్పజాలకుండు
నినుగూర్చిన తలపు నిప్పు/ నాలో సతతమ్ము నుండు.
భారతదేశంలోని నదులలోని నీళ్లన్నీ కూడా ఆర్పలేవు. అలాంటి నీ తలపు నిప్పు నాలో నిరంతరమూ ఉంటుంది. విరహాన్ని గురించి ఇలా చెప్పడం ఇంద్రజాలమే.
ప్రేయసితో ఇలా అంటాడు.
‘‘విశ్వస్థలి యంత కూడ/ ఛత్రంబయి కప్పునన్ను
విశ్వస్థలి యంత జూడ/ సకియ నీదు చెన్నికన్ను.
ఇదీ ప్రేమ తాలూకు ఇంద్రజాలమే.
వెనె్నల గురించి రాస్తూ ‘‘కాయమ్మును గగనమ్మును కలుపుచుండి వెనె్నల’’అని రాస్తాడు. ఇదెంత కొత్త వూహ. మళ్లీ వెనె్నల్లో కూచోగానే అమాంతం గుర్తొచ్చి మనని ఆకాశానికి ఎత్తేమాట.
చివరగా చైనా అమ్మాయిని ‘జ్యోత్స్నా ద్రవంపు టలయా’ అని సంబోధించటం సమ్మోహకంగానే ఉంటుంది. వెనె్నలని జ్యోత్స్నాద్రవం పుటలతో పోల్చటం గమ్మత్తే. ఇంకా ఆమెను గురించి ‘‘నిన్ సోకగ మారుతముల్ మూర్ఛిల్లునహా’’ అంటాడు.
ఆమె స్పర్శ గాలికి కూడా మూర్ఛ తెప్పిస్తుందనడం వింత వర్ణనే.
ఇలా తన కవిత్వం గురించి తను చెప్పుకున్న లక్షణాలు ఆయన కవిత్వంలో చూడడం కూడా చెయ్యవలసిన పని. దుడ్డుకర్రల్తో పద్యాల నడుములు విరగతన్నడమేకాక కవితాంశకు ప్రాధాన్యత నివ్వడం కూడా ఆయన కవితా పార్శ్వంగా గమనించవలసి ఉంది.
*
19న నెల్లూరు, విశాఖలో
పఠాభి శతజయంతి సదస్సులు
పఠాభి శతజయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న నెల్లూరు, విశాఖపట్టణంలో ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్నారు. నెల్లూరులో సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సు 19వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా రాచపాళెం చంద్రశేఖరరెడ్డి హాజరుకానుండగా శిఖామణి కీలకోపన్యాసం చేయనున్నారు. సాయంత్రం వరకూ జరిగే ఈ కార్యక్రమంలో పలువురు రచయతలు పఠాభి రచనలపై పలు పత్రాలను సమర్పించనున్నారు. అలాగే విశాఖపట్టణంలో 18వ తేదీన పఠాభి కవిత్వ వైచిత్రిపై చర్చాగోష్టి జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎల్.ఆర్.స్వామి అధ్యక్షులుగా, వి.కళ్యాణ రామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పఠాభి రచనలపై శత జయంతి ప్రసంగాన్ని రామతీర్థ అందించనున్నారు.

- వాడ్రేవు వీరలక్ష్మీదేవి