మెయిన్ ఫీచర్

ఎత్తుగా కనిపించాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది మహిళలకు ఎత్తు శారీరక లోపం. అసలు అలాంటి లోపమే లేనట్టు కనికట్టు చేయడానికి.. ఎత్తుగా కనిపించేట్లు మాయ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. నేటి ట్రెండ్‌ను ఫాలో అవుతూనే రకరకాల రంగుల మేళవింపులు, అందానికి హంగులనిచ్చే యాక్సెసిరీస్‌లను వాడితే పొడవుగా కనిపించవచ్చు. సంప్రదాయ వస్తధ్రారణలో చీరలు, పరికిణీ ఓణీలు, చుడీదార్లే ప్రధానమైనవి. వీటిని ఎంపిక చేసుకోవడంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎత్తుగా, అందంగా మెరిసిపోవచ్చు.
* అడ్డగీతలు ఉన్నవి, బాక్స్‌లు-బాక్స్‌లుగా ఉన్న దుస్తులను ధరించకపోవడమే మేలు. వీటి వల్ల మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంది.
* డ్రెస్ ఎలాంటిదైనా గేరా ఉండేటప్పడు అంబ్రెల్లా కట్, బాక్స్‌ప్లీట్ బాగుండవు.
* చీరల్లో ఆర్గాంజా, స్ట్ఫిగా ఉండే వస్త్రం, బ్రొకేడ్, వెల్వేట్, బెనారస్‌లు అంతగా నప్పవు. ఏవి ఎంచుకున్నా కుచ్చిళ్లు ఎక్కువగా లేకుండా చూసుకుంటే మంచిది.
* బోట్‌నెక్, కాలర్‌నెక్‌ల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది.
* వీలైనంత వరకు మెడ, భుజాలు వెడల్పుగా కనిపించేలా చేస్తేనే అందం.
* తెల్లగా ఉండేవారు ఏ రంగుల్ని ఎంచుకున్నా బాగానే ఉంటుంది. అయితే పొడుగ్గా కనిపించాలనుకుంటున్నప్పుడు మాత్రం ముదురు రంగుల్ని ప్రయత్నించాలి.
* ఏ రంగువారైనా బ్లూ, ఎరుపు, ముదురు ఎరుపు, బర్గాండీ ప్రయత్నించవచ్చు.
* నలుపు ఎంచుకుంటే పొడుగ్గా కనిపించడం మాత్రం ఖాయం.
* టాప్, బాటమ్, చున్నీ.. ఇలా డ్రెస్ మొత్తం ఒక్కో రంగులో కాకుండా కాస్త కలిసినట్లుగా కుదిరితే.. అంటే దాదాపు ఒకే రంగులో ప్రయత్నిస్తే లుక్కే మారిపోతుంది.
* చీరలు, పరికిణీ ఓణీలు వేసుకునేటప్పుడు వీటికి జతగా వేసుకునే జాకెట్లకు పొట్టి చేతులను ఎంచుకోవాలి. మోచేతి వరకు చేతులు ఉండే జాకెట్టును వేసుకుంటే పొట్టిగా కనిపిస్తారు. అలాగే మెడ మొత్తం కప్పేసినట్లుగా ఉండే జాకెట్లకు అంటే హై నెక్ బ్లౌజ్‌లకు దూరంగా ఉండాలి. కాస్త డీప్ కట్ బ్లౌజ్‌లను ఎంచుకుంటే పొడవుగా కనిపించవచ్చు.
* చీరల విషయానికి వస్తే కాస్త బరువైన, ఎక్కువ పనితనం ఉన్న చీరలను కాకుండా సిల్క్, జార్జెట్, ఇక్కత్ చీరలను ఎంచుకోవాలి. చీర ఎలాంటిదైనా సరే.. కుచ్చిళ్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొంగు కూడా జాలువారేలా వదిలేయాలి.
* చుడీదార్ ఎంచుకుంటున్నప్పుడు మసక్కలీ తరహా చుడీదార్‌ను ప్రయత్నించాలి. కుచ్చిళ్లు కాస్త పైనుంచి వచ్చేలా ఉన్నవి వేసుకుంటే పొడవుగా కనిపించవచ్చు. అలాగే అనార్కలీ కన్నా కలీ తరహావి పొట్టిగా ఉన్నవారికి బాగా నప్పుతాయి.
* ఛాతిభాగం ఎక్కువగా ఉన్నవారు జార్జెట్ లెహంగాలను వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంది. అయితే క్రేప్ లెహంగాలను ఎంచుకోవచ్చు. చున్నీ కాస్త పలుచగా నెట్ తరహావి అయితే బాగుంటాయి. లెహెంగాలను ఎంచుకునేటప్పుడు ఛాతికి, పొట్టకూ మధ్య కాస్త ఎడం ఉంచడం తప్పనిసరి. జాకెట్ పొడవు వీలైనంత తక్కువగా కనిపించేలా ఉంటే పొడవుగా కనిపించవచ్చు.
* ఎలాంటి డ్రెస్ అయినా సరే.. షోల్డర్ ప్యాడ్లను ఉపయోగిస్తే భుజాలు కాస్త వెడల్పుగా కనిపిస్తాయి. దీనివల్ల కూడా కాస్త ఎత్తుపెరిగినట్లుగా కనిపిస్తారు. కాబట్టి వాటినీ అందుబాటులో ఉంచుకోవాలి.
* పొడవుగా కనిపించాలనుకునేవారికి హైవెయిస్టెడ్ స్కర్ట్‌లు, క్రాప్‌టాప్‌లు బాగుంటాయి. యాంకిల్ లెంగ్త్ అంటే మడమ వరకూ స్కర్ట్‌లు, ప్యాంట్లు ప్రయత్నించి చూడాలి. వదులుగా ఉండే పలాజో ప్యాంట్లు, వాటికి జతగా ట్యూనిక్, హెమ్‌లైన్, కర్చ్ఫీ టాప్‌లను ఎంచుకోవచ్చు. ఎత్తు తక్కువగా ఉండి.. నడుము భాగం లావుగా ఉన్నవారికి హైవెయిస్టెడ్ చక్కగా సరిపోతాయి. పలాజోలతో పాటు లెగ్గింగ్‌లు, జెగ్గింగ్‌లు, పెన్సిల్ కట్ జీన్స్ వీళ్లకు బాగా నప్పుతాయి.
* ఎత్తు తక్కువగా ఉన్నవారు వీలైనంత తక్కువ యాక్సెసరీలు వేసుకుంటే మేలు. దుస్తులు ఏవైనా సరే.. చెవులకు ఇయర్ కఫ్, హెవీ రింగ్స్ బాగుంటాయి. మణికట్టుకి ఓ బ్రేస్‌లెట్ సరిపోతుంది. వీరికి మెడను పట్టి ఉండే చోకర్‌లు బాగుంటాయి.