మెయిన్ ఫీచర్

భక్తజన బాంధవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిపెద్ద వైష్ణవ క్షేత్రంగా ఖ్యాతిగాంచినది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో గల ఈ యాదగిరి నరసింహుడు సర్వ జనావళికి కష్టాలను దూరం చేసే కలియుగదైవంగా భాసిల్లుతున్నాడు.
ఒకానొక కాలంలో యాదమహర్షి రామభక్త ఆంజనేయుని ఆదేశంతో తపస్సు చేసి ప్రహ్లాదవరదుడైన నరసింహుని మెప్పించాడు. యాదఋషికి తపస్సు మెచ్చిన నరసింహుడు వరం కోరుకొమ్మనగా ఈ తెలంగాణావాసుల వెతలను దూరం చేస్తూ ఎల్లప్రజలను సౌభాగ్యవంతులుగా చేయమని ఆ ఋషిపుంగవుడు కోరాడట. ఆ కోరిక తీర్చేనిమిత్తమే ఈ యాదగిరి నరసింహుడు నేడు ఆంజనేయుని క్షేత్ర పాలకునిగా నియమించుకుని తాను ఇక్కడే నివసిస్తున్నాడు.
ఈ స్వామిని పూర్వకాలంలో అర్చించటానికి, పూజలు సల్పటానికి దేవతలే స్వయంగా దిగి వచ్చేవారట. అపుడు సామాన్య మానవులకు కూడా వారు కనిపించేవారట. కాని ఇపుడు కలి మాయలో ఉన్న మానవులకు వారు కనిపించడం లేదు కాని ప్రతిరోజు దేవలోకం అంతా వచ్చి స్వామిని పూజించి వెళ్తున్నారని భక్తులు అంటారు. గంధర్వయక్ష కిన్నర కింపురుషాదులు వచ్చి తమ తమ నృత్యగానాలతో స్వామివారిని ఇప్పటికీ ఈ క్షేత్రంలో రాత్రి పూట దేవతల నృతగానాదులు విన్పిస్తాయంటారు ఇక్కడి నివాసితులు. వారు పూజించిన చందనచర్చితాల నైర్మల్యాలు కూడా ఇక్కడ చూచిన వారున్నారు అంటే ఈ యాదగిరి గుట్ట మహిమను ఇంతింత అని చెప్పలేము. అందుకే ఈ స్వామికి అత్యంత మనోహరంగా క్షేత్ర నిర్మాణ పనులు చేపట్టారు. ఒక్క తెలంగాణా వాసులే కాక ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ స్వామిని దర్శించే వారున్నారు. భక్తుల సౌకర్యార్ధం స్వామిని అంగరంగవైభోగంగా అలం కరించి పూజించుకోవడం కోసం దేవాలయాన్ని పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు.
భగవంతుడిని నిర్మలచిత్తముతో ధ్యాని స్తూ ఆ భగవంతుణ్ణి చూడా లనుకొనే భక్తులు ఉంటుంటారు. ఆ భక్తుల కోరిక మేరకు భగవంతుడు అనేకావతారాలను దాల్చుతుంటారు. ఆ భగవం తుడు వ్యక్తమునకు మితి అనేదే లేదని అని తెలియచేసేదే ఈ నరసింహావతారము. సృషి టస్థితి లయాదులకు కారణుడైన పరమాత్మను ఏ విధంగా ఉపాసిస్తే ఆ విధంగానే సాక్షాత్కరిస్తాడు. ఆ స్వామికి మిత్ర త్వమూ శత్రుత్వమూ లేదు. రాక్షసులను, సాధువులను ఒక్కలాగే చూస్తాడు. కాని రాక్షసులు ధర్మానికి ఎగ్గు తలపెట్టి సాధువులను హింసించి అధర్మమార్గాన్ని అవలంభిస్తే చాలు స్వామి తన్ను తాను సృజియంచుకుని అవతారమెత్తి వచ్చి దుష్టులను దుర్మార్గులను దునుమాడి ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. అట్లా అరాచ కాలకు పాల్పడిన హిరణ్యకశ్యపుని సంహరించి తనభక్తుడు నిర్మల చిత్తుడైన ప్రహ్లాదు డిని రక్షించటానికి ఎత్తిన అవతారమే ఈ నరసింహస్వామి అవతారం. ఓ దయాళు! ఆదిమధ్యాంత రహితా! నృసింహా! స్వామి కరుణా పారీణా! నిత్య మంగళా! శాంతించు దేవా దేవా శాంతించు శాంతించు కరుణను ప్రసాదించుఅని నాడు కోపోద్రేకంతో వూగిపోతూ ఎర్రని కనులు, అదిరే ముక్కుపుటాలు, భూమి దద్దరిల్లేట్టు ఉన్న పాదఘటనలు... ఇలా అతి భీకరా కారంలో ఉన్న స్వామి ప్రహ్లాదుని స్తుతి విని చల్లని చూపును ప్రదర్శించాడో ఆ స్వామి నేడు తనపై అచంచలమైన నమ్మకంతో వచ్చే భక్తకోటిని చల్లగా చూస్తున్నాడు. ఈస్వామిని దర్శించుకొన్నవారికి ఇహలోక సుఖాలే కాదు అంత్యంలో వైకుంఠధామం కూడా లభ్యమవుతుంది.

- చివుకుల రామమోహన్