మెయిన్ ఫీచర్

తక్షణ సహాయం కోసం 112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏదైనా విపత్కర పరిస్థితి సంభవించినప్పుడు 911 అనే ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు అలాంటి వ్యవస్థనే మనదేశంలోనూ మొదలుపెట్టింది కేంద్రప్రభుత్వం. అదే 112. మహిళా భద్రత, వైద్యం, పోలీసు, అగ్నిమాపక.. ఇలా ఎటువంటి ఆపదకైనా ఇప్పుడు 112 నెంబరుకు డయల్ చేస్తే సరిపోతుంది. వివరాల్లోకి వెళితే..
విపత్కర పరిస్థితుల్లో సహాయం కోసం ఫోన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ నెంబరును తీసుకొచ్చింది. గతంలో మహిళా భద్రత కోసం 1090, వైద్య సేవల కోసం 108, పోలీసుల సహాయం కోసం 100, అగ్నిమాపకశాఖ సహాయానికి 101 నెంబర్లను వినియోగించేవారు. కానీ ఇప్పుడు వీటన్నింటినీ సమీకృతం చేస్తూ ఒకే నెంబరును ప్రవేశపెట్టింది. అదే 112. అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ(ఈఆర్‌ఎస్‌ఎస్)గా పిలిచే ఈ కొత్త వ్యవస్థను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే ప్రారంభించారు. మొదటగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది నాటికి దేశమంతటా ఈ నెంబరు పనిచేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ట్రాయ్ సూచనలనున అనుసరించి టెలికాం కమిషన్ కూడా ఈ నెంబరును అధికారికంగా వినియోగించేందుకు ఆమోదం తెలిపింది.
* భారత ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ 112.
* జీఐఎస్ అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను ఆధారం చేసుకుని ఆపదలో ఉన్నవారికి సహాయం అందించేలా దీన్ని రూపొందించారు.
* గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను ఆధారంగా చేసుకుని ప్రతిస్పందన దళాలు ఆపదలో ఉన్నవారి దగ్గరకు చేరుకుంటాయి.
* అత్యవసర సహాయం కావలసిన వారు 112కు ఫోన్ చేయాలి. లేదా స్మార్ట్ ఫోన్ పవర్ బటన్‌ను వెంటవెంటనే మూడుసార్లు నొక్కాలి. వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌కు కాల్ వెళుతుంది.
* స్మార్ట్ఫోన్ కాకుండా సాధారణ ఫోన్ అయితే ఐదు లేదా తొమ్మిది నెంబరును కొద్దిసేపు నొక్కి పట్టి ఉంచితే ఎమర్జెన్సీ సెంటర్‌కు కాల్ వెళుతుంది.
* బాలెన్స్, అవుట్ గోయింగ్ లేని ప్రాంతాల్లో, తాత్కాలికంగా పనిచేయని సిమ్‌లలో, ల్యాండ్‌లైన్ ఫోన్లలలో కూడా ఈ నెంబరు పనిచేస్తుంది.
* కాల్ చేసే పరిస్థితి లేకుంటే 112 నెంబరుకు ఎస్‌ఎంఎస్ చేసి కూడా సహాయం పొందవచ్చు.
* ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ) వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ-మెయిల్ ద్వారా కూడా సహాయం తీసుకోవచ్చు.
* ఎమర్జెన్సీ కాల్ వచ్చిన పది నుంచి 12 నిముషాల్లో సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
* 112 అనేది పూర్తిగా ఉచిత కాల్.. దీనికి ఫోన్ చేస్తే డబ్బులు కట్ కావు. అలాగే దేశంలో ఎక్కడినుంచైనా మీ ఫోన్ నుంచి 112కు ఫోన్ చేయవచ్చు.
* హిందీ లేదా ఇంగ్లీషులోనే కాకుండా మీ మాతృభాషలో మాట్లాడి కూడా సహాయం పొందవచ్చు.
* 112 నెంబరు 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఆపదలో ఉన్న ఏ సమయంలోనైనా ఫోన్ చేయవచ్చు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 112 ఇండియా పేరుతో ఓ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించింది. ఆపద సమయంలో పిల్లలు, మహిళల రక్షణకు ఉపయోగపడేలా ‘షౌట్’ ఫీచర్‌ను కూడా ఇందులో ప్రవేశపెట్టింది. చాలా ఫోన్లు ఇప్పటికే ఈ నెంబరు కోసం ఎస్‌ఓఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి.