మెయన్ ఫీచర్

సంపద సృష్టి, వరాల వృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనే అంతా చర్చిస్తున్నారు. కొందరు దీన్ని ‘మోదీ సర్జికల్ స్ట్రయిక్’ అన్నారు. అయితే, ప్రతిపక్ష నేతల ముఖాల్లో నెత్తురుచుక్క కనబడడం లేదు. కొందరు మీడియా ప్రముఖులు దీన్ని ‘ఎన్నికల బడ్జెట్’ అన్నారు. ఎన్నికల వేళ వరాలిచ్చే బదులు రెండు, మూడేళ్ల ముందే ఈ పనిచేసి వుండచ్చు కదా! అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చేసరికి యూపీఏ సర్కారు ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళింది. ఖజానాను నింపడం మోదీ ప్రభుత్వం సవాలుగా స్వీకరించింది.
నాలుగేళ్ల క్రితం మన ఆర్థిక అవస్థల కన్నా ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ బాగుంది. అందుకే 12కోట్ల మంది రైతుల కోసం రైతు సమ్మాన్ నిధిని కేంద్రం మంజూరు చేసింది. మట్టి నుంచి మేలురకం పంటలు పండిస్తున్న రైతుకు ఎంత యిచ్చినా తక్కువే. అయిదు ఎకరాలకన్నా తక్కువ వున్న రైతుకు మేలుచేసే చర్యను మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అవినీతికి అలవాటుపడి కోట్లకు పడగలెత్తిన కొందరు విపక్ష నేతలు దాన్ని రోజుకింత అని, గంటకింత అంటూ బేరీజు వేసి చులకనగా మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీల పేర అధికారం చేపట్టిన నేతలు కొందరు- ‘మేం యింత మాఫీ చేశాం, అంత మాఫీ చేశాం’ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏడాదికి 6వేలు చొప్పున 12 కోట్ల మందికి ఏడాదికి 75వేల కోట్ల నిధిని రైతులకు కేటాయించడం ఓ విప్లవాత్మక చర్య. మధ్యతరగతి ఉద్యోగులైన 3 కోట్ల మంది కోరికను మన్నిస్తూ ఆదాయ పన్ను పరిధిని 5 లక్షలకు పెంచడం, అసంఘటిత రంగంలోని కార్మికులు 12 కోట్ల మందికి ఏడాదికి మూడు వేలు ఫించనివ్వడం, మొత్తంగా 25-30 కోట్ల మంది ఊరటనిచ్చే బడ్జెట్ గురించి మీడియా రాజకీయ రంగు అద్దాలతో చూసి ఎన్నికల బడ్జెట్ అనవచ్చు గాక. కాని బాధ్యతగల ప్రభుత్వం ప్రజల కష్టనష్టాలకు సహానుభూతి చెంది సంవేదనతో బడ్జెట్ ప్రవేశపెట్టడం దానికి రాజకీయ అధికారం కూడా అవుతుంది.
తాత్కాలిక బడ్జెట్ అయినప్పటికీ ప్రజలకు సేవ చేయడమే పరమార్థంగా, 2019 ఎన్నికల్లో పాలనాపగ్గాలు చేపట్టగలమన్న ఆత్మవిశ్వాసంతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన అనేది ఎక్కడా జరగలేదు. ‘రైతులకిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధిని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు- రైతులకు బంగారం యిచ్చినా లేదు మోదీ వారికి ‘ఇనుమే’ ఇచ్చాడని ఆరోపిస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బిజెపికి 17కోట్లు ఓట్లువచ్చాయని, ఓట్ల శాతం పెరిగేందుకే బడ్జెట్‌లో వరాలు కురిపించారని మీడియా వారు కొందరు వ్యాఖ్యానించారు. నిజానికి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ ప్రేరణతో బడుగుప్రజల కనీస అవసరాలను దృష్టిలోపెట్టుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినా, అందుకు గత నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం రూపకల్పన చేస్తూ వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని 3-5% తగ్గించడం, ద్రవ్య లోటును 3-4%కు తగ్గించడం, జియస్‌టిని అమలు చేయడం, నెలకు లక్ష కోట్లమేర పన్నుల రాబడి పొందడం, ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 6-7 కోట్లకు పెరగడం, పెరుగుతూ వుండడం, వీటన్నిటి ఉపలబ్ధిగా సృష్టించబడుతున్న సంపదను వరాల రూపాన ప్రజలకు పంచేందుకు సమాయత్తం కావడం మోదీ మార్కు ఆర్థిక సూత్రంగా అర్ధం చేసుకోవాలి. ప్రధాని విధానాలపై వ్యాఖ్యానిస్తూ ‘ఏస్ ఇనె్వస్టర్’ రాకేష్ ఝంఝన్ వాలా మోదీని ‘పవిత్ర సామ్యవాది’ అన్నారు. ఈరోజు దేశ ఆర్థికవ్యవస్థ 167 లక్షల కోట్లకు చేరింది. ఆర్‌బిఐ వద్ద 400 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలున్నాయి. పౌరుడి తలసరి ఆదాయం 1.12 లక్షలకు చేరింది. ఆర్‌బిఐ వద్ద 3లక్షల కోట్ల రిజర్వు నిధులున్నాయి. దారిద్య్రరేఖ దిగువనున్న జన సంఖ్య 2011 లెక్కల ప్రకారం 21.9%కు తగ్గింది. ‘ఆదాయం పెంచాలి- పేదలకు పంచాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. కూడా వ్యాఖ్యానించారు. నిరర్ధక ఆస్తులను రాబట్టడంలో మోదీ కృషి ఫలిస్తున్నది.
అయితే ఉద్యోగాల మాటేమిటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్‌కింద గ్రామీణ ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఏడాదికంటే యిది 11శాతం ఎక్కువ. కోటి రూపాయల వరకు ఋణం పొందేలా కోట్లాది మందికి ఉపాధి కల్పించే చిన్న మధ్యతరహా సంస్థలకు ప్రభుత్వం ఓ పథకం ప్రారంభించింది. సుమారు 7.23 లక్షల కోట్ల మేరకు ముద్రా ఋణాల క్రింద 4.5కోట్ల మందికి మంజూరైంది. కనీసం ప్రతి ఋణగ్రహీత ఇద్దరికి ఉపాధినిచ్చినా 9కోట్ల మందికి ఉపాధి దొరికినట్లే.
రైల్వేలు, పోలీస్ విభాగం, ప్రత్యక్ష పరోక్ష పన్నుల విభాగాల్లో గత మూడేళ్లలో 3.79 లక్షల మందికి ఉపాధి లభించింది. బడ్జెట్ దస్త్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పిఎఫ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఆదాయపు పన్నుల రిటర్నులు ఫైలుకు, వాహన విక్రయాలు, రవాణా నోడల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోదీ పెద్దనోట్ల నిషేధంతో 1,30,000 కోట్ల నల్లధనం పన్నుల పరిధిలోకి వచ్చింది. నల్లధనం నియంత్రణ చట్టం వల్ల 50000 కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 6900 కోట్ల రూ.ల బినామీ ఆస్తులు, 1600 కోట్లమేర విదేశీ ఆస్తులు స్వాధీనం అయ్యాయి. ఆరోగ్యానికి గత ఏడాదికన్నా 16% నిధులు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో 12లక్షల మంది లబ్ధిపొందారు. ఆరోగ్యం కోసం వెల్‌నెస్ సెంటర్ల సంఖ్య 2022 నాటికి 1.5 లక్షలకు చేరే అవకాశం వుంది. ఆయుష్మాన్ భారత్ క్రింద లబ్ధిపొందినవారు 3000 కోట్లు ఆదా చేసుకున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు యిది గొప్ప ఊరట. సైనిక సంక్షేమం కోసం ఓఆర్‌ఓపి క్రింద యిప్పటికే ప్రభుత్వం 35000 కోట్లు ఖర్చుపెట్టింది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నిధులు మూడురెట్లు అధికంగా కేటాయించారు. గత 70 ఏళ్ళుగా చేయలేని పని రైల్వేశాఖ చేసింది. కాపలా లేని రైల్వేగేట్లను సంపూర్ణంగా తొలగించింది. రైల్వేలకు ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయించారు.
మధ్య తరగతి కుటుంబాలకు విద్యపై తీసుకునే రుణాల వడ్డీ 15%నుంచి 11 శాతానికి తగ్గించడం, ఇంటి ఋణం 11 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గడం పెద్ద వెసులుబాటు. ఎల్‌ఇడి పన్నుల వినియోగంలో 50,000 కోట్ల రూ.ల విద్యుత్ బిల్లులు ప్రజలకు ఆదా అయినాయి. గత నాలుగేళ్ళలో సంఘటిత రంగంలో కోటి 80 లక్షల మందికి పిఎఫ్ యివ్వడం మొదలైంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కొత్తగా 60 లక్షల మంది చేరారు. ఆదాయపు పన్ను పరిధిలో సంఘటిత రంగంలో కొత్తగా 10 లక్షల మంది చేరడం యివన్నీ 10%వున్న సంఘటిత రంగంలో పెరిగిన ఉపాధి అవకాశాలను సూచిస్తున్న గణాంకాలే. బలపడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థతో మోదీ పాలనలో అనేక రంగాలలో ప్రమాణాలు మెరుగవుతున్నట్లు ఈ కింది పట్టిక తెలియచేస్తుంది.
*
పని యుపిఎ-2 వరకు ఎన్‌డిఎ 4 1/2 ఏళ్ళ పాలన
*
రైల్వేలో వసతులకు- 2.3 లక్షల కోట్లు 3.82 లక్షల కోట్లు
రైల్వే బ్రాడ్‌గేజి లైన్లు- 7600 కి.మీ. 9500 కి.మీ
రైల్వే విశ్వవిద్యాలయం- ------- 2018లో ప్రారంభం
బుల్లెట్ ట్రెయిన్- ------- 2022 నాటికి సిద్ధం
సరుకు రవాణా కారిడార్- ------ కొంత పురోగతి
స్వదేశీ పరిజ్ఞానంతో
వేగవంతమైన రైలు - ----- వందేభారత్ ఎక్స్‌ప్రెస్
పేదలకు ఇళ్లు- 25 లక్షలు 1.25 కోట్లు
విమానాశ్రయాలు- 2014వరకు 75 2014-18లో కొత్తవి 25
ఆర్థిక స్థితి ప్రపంచ దేశాల్లో - 11వ స్థానం 6వ స్థానం
వ్యాపార సులభతర సూచీ- 47వ స్థానం 77వ స్థానం
కనీస జీడీపీ - 4.25 6.7
స్వచ్ఛత- 50% 98%
గ్యాస్ కనెక్షన్లు- 2014 వరకు 12 కోట్లు 13 కోట్లు
బ్యాంకు ఎక్కౌంట్లుగల జనం- 50% 100%
ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్- 59 గ్రామాలు లక్షా 16 వేల గ్రామాలు
(2004-2014)
బ్యాంకు ఋణాలు- పారిశ్రామికవేత్తలకు నిరుద్యోగుల ఉపాధికి
18 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు
రిజర్వేషన్లు- ------- ఆర్థికంగా వెనుకబడిన వారికి 10%
ద్రవ్యోల్బణం- 10-18% 3-4%
పన్నులు (వ్యాపారం)- కనీసం 30% 5-18%
ఆదాయపు పన్ను
చెల్లింపుదారులు- 3 కోట్లు 7 కోట్లు
*
ప్రమాణాల లక్ష్యాలు నిర్ణయించడం, వాటిని సాధించడం ప్రగతిశీల పాలనకు గీటురాయి అవుతుంది. ఇందులో ప్రభుతకు ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండాలి. అభివృద్ధి అన్నది లక్ష్యాలతోనే సాధ్యమవుతుంది. అందుకు పదవీ భోగం కంటే ప్రజల కోసం సేవాభావం వున్న ప్రభుత్వం ఏర్పడడం తప్పనిసరి. జనం దీన్ని గుర్తించాలి. జనచైతన్యమే దీన్ని నిజం చేస్తుంది.

-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ 96761 90888