మెయన్ ఫీచర్

కశ్మీర్ సమస్యపై ఉష్టప్రక్షి ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ న్యూఢిల్లీకి వచ్చి, మంగళవారం భారత రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో చర్చలు జరిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ధూర్తదేశంగా ఇరువురూ గుర్తించారు. అఫ్గానిస్థాన్, బలూచిస్తాన్, గిల్గిట్, ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను వారు తీవ్రంగా పరిగణించారు. అంతేకాదు మంగళవారం సాయంత్రం విదే శాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాన్ కెర్రీ ల సంయుక్త విలేకర్ల సమావేశంలో పాక్‌ను తీ వ్రంగా హెచ్చరించారు. ఇది శుభ పరిణామం.
రోగం ఒకటి అయితే మందు మరొకటి అన్నట్టు దశాబ్దాల పర్యంతం మన అధినాయకులు కశ్మీర్ సమస్యను ముదరబెట్టి రావణకాష్టంగా రగిలించారు. నిన్న పాకిస్తాన్ రెండు ప్రధాన చర్యలు చేపట్టింది. మొదటిది దాదాపు ఇరవై ఇద్దరు పార్లమెంట్ సభ్యులను వివిధ దేశాలకు పంపడం. రెండవది బలూచిస్థాన్ అసెంబ్లీలో నరేంద్రమోదీకి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదింపజేయడం. మొదటి చర్య సిమ్లా ఒప్పందానికి విరుద్ధం. ఐతే పాకిస్తాన్ పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుకలా ఉంది. నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్‌లో అస్తిత్వం లేదు. ఐఎస్‌ఐ చేతిలో అతడు కీలుబొమ్మ. పాకిస్తాన్‌లో దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆరు నివాస స్థావరాలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ దశలో బలూచిస్థాన్‌లో పాక్ వ్యతిరేక ప్రదర్శనలు మొదలైనాయి. 1948లో పాకిస్తాన్.. బలూచిస్థాన్‌ను కశ్మీర్ లోని కొంత భాగాన్ని ఆ క్రమించుకుంది. అప్పటి పాలకులు ఈ దుర్మార్గాన్ని అడ్డుకోలేదు. చైనా టిబెట్‌ను ఆక్రమించినప్పుడు కూడా నెహ్రూగారు ఇది ఆదేశపు అంతరంగిక వ్యవహారం అని ప్రకటించారు. కశ్మీర్ సమస్యలను ఐరాసాకు నివేదించి నెహ్రూ మరో చారిత్రక తప్పిదం చేశారు. కశ్మీర్‌కు సంబంధించి వి.కె. కృష్ణమీనన్ ఐరాసాలో గట్టిగా ఆరుగంటలు ఆరిచి స్పృహతప్పిపడిపోయారు. ఆయన కంఠశోష అరణ్యరోదన అయింది.
పాకిస్తాన్ ప్రస్తుతం డామేజింగ్ కంట్రోల్ చేస్తున్నది. అంటే తనది ఉగ్రవాద దేశం అని ప్రపంచమంతా కోడైకూస్తుంటే ఆ మచ్చను మాపుకోవడం కోసం ఎదురుదాడికి దిగింది. అమ్నెస్టీ మానవహక్కుల సంస్థకు బలూచిస్థాన్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘ న కనబడలేదు. శవాలను గుట్టలు, గుట్టలుగా పోసి హననం చేస్తున్న సన్నివేశాలు మనం టివిల్లో చూశాం. స్వతంత్ర బలూచిస్థాన్ కో సం డెబ్బది సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ఉదహరించారు. అందుకు బలూచీ ప్రజలు కృతజ్ఞతలు చెప్పి తిరంగా జెండాను బలూచిస్థాన్‌లో మొన్న ఊరేగించారు. దానితో పాకిస్తాన్ ఉలిక్కిపడి బలూచిస్థాన్ స్థానిక అసెంబ్లీ చేత ఒక తీర్మానాన్ని ఆగస్టు 28న ఆమోదింపజేసింది. దీనిపై బలూచీ పాకిస్తాన్ అధికార ముస్లీంలీగ్ పార్టీ ఎమ్మెల్యే మహమ్మద్ ఖాన్ లహ్రీ ప్రతిపాదించిన తీర్మానాన్ని బలూచిస్థాన్ అసెంబ్లీ ఆమోదించింది.
‘‘పాక్ సార్వభౌమాధికారాన్ని ఐక్యరాజ్యసమితి నిబంధనలను నరేంద్రమోదీ ఉల్లంఘించారని’’ లహ్రీ ఆరోపించారు. 2016, ఆగస్టు 29న లండన్‌లోని చైనా ఎంబసీ ముందు బ లూచీ నిరసనకారులు తమ స్వాతంత్య్రంకో సం అందోళన జరిపారు. ఇది ఉద్యమ తీవ్రత ను తెలియజేస్తున్నది.
పాకిస్తాన్‌లో దాదాపు నలబైనాలుగు శా తం సారవంతమైన భూభాగం బలూచిస్థాన్‌లో ఉంది. ఆనాటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బలూచీల స్వాతంత్య్రం కోసం భారత్‌తో సన్నిహితంగా ఉంటూ ఉద్యమం నడిపాడు. కాని దూరదృష్టి లేని నాటి భారత ప్రభుత్వం బలూచీల స్వాతంత్య్ర కాంక్షను అణచివేసింది. ఇవ్వా ళ బలూచిస్థాన్ మధ్యనుండి చైనా ఒక రహదారిని నిర్మించింది. దీనికి బలూచీలు ఆగ్రహిస్తున్నారు. చైనా వారికి గత్యంతరమేమిటి? భారత్ సైనిక చర్య తీసుకొని బలూచీ విముక్తికి ప్రయత్నిస్తుందా? అప్పుడు 1971లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ అవతరణకు చేసిన కృషి వంటిదిగా ప్రపంచం చేత నరేంద్రమోదీ గుర్తింపబడతారు. ఆక్రమిత కశ్మీర్,గిల్గిత్, బలూచిస్థాన్ ఈ మూడు ప్రాంతాల్లోను ప్రజోద్యమా లు రగులుకుంటున్నాయి. పాకిస్తాన్ నడుము విరగగొట్టడానికి ఇదే సరైన సమయం. బలూచిస్థాన్ పాక్ నుండి విడివడితే 2016, ఆగస్టు 15 నుండి జరిపిన స్వాతంత్య్ర దినోత్సవమే పాక్ చరిత్రలో చివరిది అవుతుంది.
మెహబూబా ముఫ్తీ మొన్న మాట్లాడుతూ కశ్మీర్‌లో అల్లర్లు రేపుతున్న ఉగ్రవాదులు కేవలం ఐదుశాతమేనని మిగతా వారు శాంతియుత జీవనం కాక్షిస్తున్నారని అనడం గమనా ర్హం. మోదీ మొత్తం భారతదేశానికి ఒక ని నాదం, పాకిస్తాన్‌కు మరో నినాదం ఇచ్చారు. ‘‘సబ్‌కా భలా, సబ్‌కా వికాస్’’ అనేది ఆయన భారత్‌కు ఇచ్చిన నినాదం. ఇది శ్రేయారాజ్యం (వెల్ఫేర్ స్టేట్)అనే అర్థంలో ప్రయోగించబడిం ది. అంటే ఇండియాలోని ఇరవైకోట్ల మంది ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అంద రూ సుఖంగా ఉండాలన్నదే ఈ వాక్యానికి అర్థం. ఐతే ‘శాంతి-ప్రేమ’ అనే మరోనినాదం పాక్‌కు ఆయన ఇచ్చారు. ప్రేమ వన్‌వే ట్రాఫిక్ కాదు. వాళ్లు రాళ్లు రువ్వుతుంటేమీరు పూలు విసరగలరా? నరేంద్ర మోదీ కశ్మీర్‌లో పర్యటిస్తూ మరోనినాదం ఇచ్చారు. అది ‘‘కశ్మీరియత్, జంబూరియత్, ఇన్సానియత్’’- దీని అర్థం ఏమిటి? కశ్మీరియత్ అంటే కశ్మీరీ సంస్కృతి, జంబూరియత్ అంటే ప్రజాస్వామ్యం, ఇన్సానియత్ అంటే మానవత. ఈ నినాదానికి అర్థం ఏమిటి? భారతీయ సంస్కృతికన్నా కశ్మీరీ సంస్కృతి భిన్నమైనది కాదు. కల్హణుని రాజతరంగిణి, సోమదేవసూరి కథాసరిత్సాగరం, ప్రత్యభిజ్ఞాశైవం, ఉద్భటారాధ్యు ల పాశుపతం ఇవన్నీ కశ్మీరులోనే పుట్టాయి. కశ్మీరులో శ్రీహర్షుడు అనే రాజు తాను మతం మార్చుకోవడంతో సమస్య వేయేండ్ల క్రితం మొదలైంది. పూర్తి వివరాలను ఆంధ్రభూమి సంపాదకులు రచించిన ‘కాశ్మీరు కథ’ అనే గ్రంథం చదవండి.
రాజా హరిసింగ్, కరణ్‌సింగ్, జవహర్‌లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లా, ఇలా కశ్మీర్ సమస్యను పెంచి పోషించడంలో అందరూ తమ తమ పాత్రను యధోచితంగా పోషించారు. 1990 లో మూడు లక్షలమంది హిందూ పండిట్లు క శ్మీర్ నుండి కట్టుబట్టలతో తరిమివేయబడ్డారు. అప్పుడే నితీష్ కుమార్‌లు, రాహుల్ గాంధీలు నోరెత్తలేదు. ఇవ్వాళ కశ్మీర్‌లో కర్ఫ్యూ పెడితే నానా అల్లరి చేస్తూన్నారు. అంటే భారత్-పాకిస్తాన్‌ల మధ్య 12 అడుగుల ఎత్తున, 150 గజాల వెడల్పును ఒక కంచె ఉంది. ఆ కంచెకు ఆవల పాక్ శత్రువులు ఉన్నారని మనం భ్రమిస్తున్నాం. మరి ఇండియాలో కంచెకు ఇవతలవైపున ఉన్న స్వదేశీయుల మాటేమిటి? కశ్మీర్ సమస్యను ట్రంప్‌కార్డుగా వాడుకొని రాజకీయ లబ్ది పొందాలనుకునే దేశద్రోహుల సంగతి ఏమిటి?
మోదీగారి రెండో నినాదం ‘జంబూరియత్’. అంటే ప్రజాస్వామ్యం. కశ్మీర్‌లో చట్టబద్ధగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఐనా ఫ్లెబిసైట్ (ప్రజాభిప్రాయసేకరణ) అంటూ నినాదాలు ఇవ్వడం ఏమిటి? ఇప్పుడున్న మెహబూబా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డదే కదా. ఇక మూడవ నినాదం ఇన్సానియత్. ఈ మాటకు ‘మానవీయం’ అని అర్థం. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత కశ్మీరీ పండిట్లకు కశ్మీర్‌లో కాలనీలు నిర్మించే యత్న చేస్తే దీన్ని పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు అడ్డుకున్నారు. ఇది ‘ఇన్సానియత్’ అనిపించుకుంటుందా? కశ్మీర్‌లో స్కూలు పిల్లలకు చాక్లెట్లకు బదులు రాళ్లు ఇచ్చి రోడ్లపైకి ఎక్కించడం ఇన్సానియత్ అనిపించుకుంటుందా? ఐసిస్ జండాలు పట్టుకొని లోయలో ఊరేగడం ఇన్సానియత్ అనిపించుకుంటుందా? మరి ఈ వ్యర్థ నినాదాలు ఎందుకోసం? ఎవరిని మభ్యపెట్టడానికి? కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమనుకుంటే 370వ అధికరణను రద్దు చేయాలి. కశ్మీర్ ముఖ్యమంత్రిని ‘కాశ్మీరు ప్రధాని’ అని పిలువకూడదు. భారతీయ పౌరులందరూ కశ్మీర్‌లో ఇళ్లు కట్టుకొని ఉండగలిగే సౌకర్యం కల్పించాలి. అది లేనప్పుడు ప్రభుత్వాలు లోకవంచన చేస్తున్నాయని అర్థం. కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఒక్కటే అక్కడి డెమోగ్రఫీని మార్చ డం. అంటే ముస్లిం మెజారిటీ రాష్ట్రాన్ని హిం దూ మెజారిటీ రాష్ట్రంగా మార్చకపోతే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ వ్యతిరేక ఆందోళనలు ఊపందుకున్నాయి. అంటే పాక్ ఆక్రమి త కశ్మీర్‌ను పాక్ కబంధ హస్తాలనుండి బలప్రయోగంతో విముక్తం చేయడం పరిష్కారమా ర్గం కాగలుగుతుంది. మోదీ వెళ్లి నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి వచ్చిన మరునాడే పఠాన్‌కోటలోని భారత వైమానిక స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు బీభత్సం సృష్టించడం గమనార్హం. భారత శత్రువుల కంచెకు అవతల ఉన్నట్లే, ఇవతల కూడా ఉన్నారు. ము లాయంసింగ్ యాదవ్, నితీశ్ కుమార్, వంటివారు ఇండోపాక్‌లో నిస్సందేహంగా దేశద్రోహానికి ఒడిగడతారు. ఆక్రమిత కశ్మీర్‌లో రెండువందల ఉగ్రవాద స్థావరాలున్నాయి. పాకిస్తాన్‌లో 32 వేల జిహాదీ మదర్సాలున్నాయి. గత డెబ్బయి సంవత్సరాలుగా పాకిస్తాన్ ఇండియా కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ‘ఫ్రాక్సీ వార్’ ప్రకటించింది. ఫరీద్‌కోట సమీపం నుండి డ్ర గ్స్ ఇండియాలోకి ప్రవేశిస్తున్నాయి. నకిలీ కరెన్సీని ఇండియాలో ప్రవేశపెట్టి భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నది. ద్వేషం బీజం గా పుట్టిన దేశాలు, వ్యవస్థలనుండి అమృత ఫలాలు ఆశించడం మూర్ఖుల లక్షణం, ఎల్‌ఒసి వద్ద పాక్ అణుబాంబులను మోహరించింది. ఈ వాస్తవాలను గుర్తించడపోవడం ఉష్టప్రక్షి ధోరణి అనిపించుకుంటుంది.
భట్టారాయ్ నేతృత్వంలోని నేపాల్ ప్రభు త్వం భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది. అటు నేపాల్, ఇటు టిబెట్‌లో చైనా సైన్యం మోహరించి పాక్‌కు మద్దతు ఇస్తున్నది. భారత్‌లో సెక్యులరిజం ఉండాలి అని అంటూ అ లాంటప్పుడు ముస్లిం మెజారిటీ కశ్మీర్ ఇండియాలో ఉండాలి కదా. అదికానప్పుడు మతరా జ్య వ్యవస్థను సెక్యులరిస్టులు సైద్ధాంతికంగా బలపరిచినట్లవుతుంది. అప్పుడు జంబూరియత్ అనే పదానికి బదులు ‘జిహాదియత్’ అనే పదాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. చైనా పాకిస్తాన్‌లను ఎదుర్కొనడానికి ముందు భారత్ అంతర్గత శత్రువులను గమనించాలి. దేశం కిష్ట పరిస్థితిలో ఉంటే కేరళ కార్మిక శాఖ మంత్రిణి మార్సి కుట్టియమ్మ నరేంద్ర మోదీని తిట్టడం ఏమిటి? ఏదోవిధంగా మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి చైనా,పాక్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఇది గమనించకుండా నరేంద్ర మోదీ రెండవ గౌతమ బుద్ధుని వేషం వేసుకోవడం, ప్రేమ, శాంతి వంటి నినాదాలు ఇచ్చి రావడం అవాస్తవిక దృక్పథానికి నిదర్శనం. ఇప్పుడు కశ్మీర్‌లో ఇన్సానియత్ లేదు, వాహాబియత్, జిహాదియత్‌లు ఉన్నాయి.

-ముదిగొండ శివప్రసాద్