మెయిన్ ఫీచర్

మొదటి మహిళా ట్రెక్కింగ్ గైడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వతారోహణ.. ట్రెక్కింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దీనిలో ఎన్నో రకాల అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా ఈ రంగంలో పురుషులే ఉంటారు. లింగ వివక్ష ఎక్కువగా ఉన్న మొదటి పది దేశాల్లో మొరాకో కూడా ఒకటి అని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికీ మొరాకో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో 80 శాతం మంది నిరక్షరాస్యులే.. కానీ మొరాకోలో పది మంది మహిళా ట్రెక్కింగ్ గైడ్లు ఉన్నారు. వారిలో హఫీదా డౌబానే మొట్టమొదటి మహిళా ట్రెక్కింగ్ గైడ్‌గా గుర్తింపు పొందింది. ఈమె 1994లో పర్వతారోహక గైడు శిక్షణ పూర్తిచేసి మొరాకోలోనే మొదటి మహిళాగైడ్‌గా గుర్తింపు పొందింది. డిప్లొమా పరీక్ష పాసైన హఫీదా మహిళా ట్రెక్కింగ్ గైడుగా మారింది. కానీ శిక్షణా సంస్థలో ఉన్న ఏకైక మహిళ హఫీదానే.. ఈమెను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఈ రంగంలో మరింత మంది మహిళలకు అవకాశం కల్పించేందుకు అక్కడి పర్యాటక రంగం, గైడ్ పరీక్షను మహిళలకు ప్రత్యేకంగా, సులభతరం చేశారు. పర్వతారోహణకు వచ్చేవారిలో కేవలం మహిళల బృందాలకే హఫీదా యాత్రలను ఏర్పాటు చేస్తుంది. గైడుగా మహిళ ఉండటం వల్ల ట్రెక్కింగ్ చేసే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడటానికి, వారి అవసరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు మహిళలు కొత్తవారితో త్వరగా మాట్లాడరు. సిగ్గుపడతారు. పైగా పర్వతారోహణ చేసేటప్పుడు అన్ని విషయాలను మగవారిని అడిగి తెలుసుకోలేరు. కొన్ని వ్యక్తిగత సమస్యలను కూడా వారికి చెప్పలేరు. అలాంటివారికి హఫీదాలాంటి వారి అవసరం చాలా ఉంటుంది. అందుకే శిక్షణాసంస్థ నిర్వాహకులు హఫీదాలాంటి వాళ్ల ఉపయోగం చాలావుందని గమనించి ఇతర మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. హఫీదా తన ఉద్యోగం గురించి మాట్లాడుతూ 3నా ఉద్యోగమంటే నాకెంతో గర్వం. నేను దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. మొరాకో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో 80 శాతం మంది నిరక్షరాస్యులే.. యాత్రల్లో భాగంగా గ్రామాల్లో ఆగినప్పుడు.. ఈ అమ్మాయిలంతా చదువుకోవాలి అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను. మనందరం కలిసి చదువుకుందాం. మనం కలిసి ఉంటే ఏదైనా సాధించగలం అని అక్కడి వారందరితో చెబుతూ ఉంటాను. ఇదంతా నేను ఏదో సరదాగా చెబుతున్నది కాదు.. ఇక్కడి మహిళల జీవితాలు మారాలి. నేనింకా ఇక్కడే ఉన్నా.. కాబట్టి నేను వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు.. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకూ పర్వతాలు ఎక్కుతూనే ఉంటాను2 అని చెబుతోంది.