మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకులు వినయము చూపనెంచి, ‘‘నేను బురదలో పొరలాడు వానపాము వంటివాడనండి!’’అనుచుందురు. ఈ రీతిని తాము పురుగులమని భావించుకొనుచు కాలక్రమమున నిజముగా వారు పురుగులవలెనే ఆత్మబలహీనులయ్యెదరు. దైన్యమును నీ మనస్సున జొరనీయకుము. దైన్యమనునది, నిరాశయనునది, పురోగమనమునకు ప్రబల శత్రువు. భావనననుసరించియే సిద్ధియు గలుగుచుండును.
417. మానముకలవాడే మానవుడు, ఇతరులందఱును మానవమాత్రులు.
418. ఆత్మప్రభావమును బ్రకటించు గర్వము గర్వముకాదు. ఆత్మగౌరవము నణచివేయు వినయము వినయము కాదు.
నిష్కాపట్యము
419. పసివానివలె నిష్కపటివై యుండిననేకాని, నీకు తత్త్వజ్ఞానము లభింపబోదు. నీవు గడించిన లౌకిక జ్ఞానమునంతయు మఱచిపోయి ఆ విషయమై పసిబిడ్డవలె అజ్ఞుడవు కమ్ము, అమాయకుడవుగమ్ము. అపుడు నీకు తత్త్వజ్ఞానము లభింపగలదు.
420. సులభముగా నరుని నారాయణుని సన్నిధినిజేర్చునది నిష్కాపట్యము. ఱాళ్లులేకుండునట్లు చక్కగా సాగుచేయబడిన నేలలో విత్తనములు సులభముగా అంకురించి పెరిగి, ఫలించు రీతిని నిష్కపట చిత్తుని మృదుల హృదయమున తత్త్వబోధనలు చక్కగా నాటుకొని ఫలవంతములగును.
421. శ్రీ గురుదేవుడిట్లు వచించును: ‘‘ఎవ్వడైనను ఉదారహృదయుడు, నిష్కపట చిత్తుడునైయున్నచో అది మహా తప్ఫఃలమని భావింపవలయును. నిష్కపటియైననే కాని నరుడు నారాయణుని గనజాలడు. అమాయకులకే భగవంతుడు సాక్షాత్కరించును.’’కాని సత్యసంధత, అమాయకత్వము ననువానిపేర సాధకులు వెఱ్ఱివెంగళప్పలుగా పరిణమింపకుండ శ్రీ గురుదేవుడిట్లు హెచ్చరించువాడు: ‘‘నీవు భక్తుడవు కావలయును గాని వెఱ్ఱిపుల్లయ్యవు కారాదు’’, లేదా, ‘‘సత్యమేదియో, మిథ్యమేదియో, నిత్యమేదియో, అనిత్యమేదియో సదా మనస్సులో వివేచన చేయుచుండవలయును; అంతట అనిత్యమైన జగత్తును విడిచి నిత్యుడగు భగవంతుని మీద మాత్రమే మనసు నిలుపవలయును.’’
వాంఛానివృత్తి
422. ఎవ్వడు ఈ లోకమున జీవించియుండియు మృతుడై యుండునో, అనగా శవమునందువలె ఎవ్వని కామక్రోధాదులు నిగ్రహింపబడి నిర్మూలములగునో అట్టివాడే మానవోత్తముడు.
423. దివ్యమగు మానస సరోవరము కామక్రోధాదులను పెనుగాడ్పులచే కల్లోలమైయున్నంతవఱకు అందు పరంజ్యోతియొక్క ప్రతిబింబము గోచరింపజాలదు. నిర్మలమై, ప్రశాంతమై భగవచ్చింతనమున నిమగ్నమైయుండు మానసమున మాత్రమే దైవదర్శనము లభించును.
424. మనసున కామమను కళంకము అణుమాత్రమున్నను గూడ భగవంతుని గనజాలవు. కావున నీ ‘‘చిల్లర కోరికలను’’దీర్చుకొని పెద్ద కోరికలను వివేక వైరాగ్యములచే విడనాడుము.
425. లోతగునూతిదాపున నిలుచుండిన యాతడు దానిలో పడిపోవుదునేమోయని కడుజాగరూకుడై యుండునటుల సంసారమున మనునతడు అందలి వ్యామోహములకు జిక్కకుండ సదా జాగరూకతతో మెలగవలయును. మోహ నిలయమగు సంసారకూపమున బడినవాడు నిరపాయముగను నిష్కళంకముగను వెలువడుట దుర్లభము.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి